- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Illu Illalu Pillalu Today Episode Dec 10: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో విశ్వక్ అమూల్యకు రాసిన ఒక లెటర్ పెద్ద గందరగోళాన్నే సృష్టిస్తుంది. ఆ లెటర్ అమూల్య దగ్గర నుంచి ఒక్కొక్కరి చేతుల మీదికి మారుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

అమూల్యకు విశ్వక్ లేఖ
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ మొదలవగానే విశ్వక్ అమూల్యను సైగలతో పిలుస్తాడు. అమూల్యను ఈరోజు పార్కులో కలుద్దామని చెబుతాడు. కానీ అమూల్య ఏమీ అర్థం కావడం లేదని సైగ చేయడంతో ఒక పేపర్ మీద ‘ఈరోజు సాయంత్రం పార్కులో కలుద్దాం’ అని రాసి అమూల్యకు విసురుతాడు. అమూల్య దాన్ని చదివి ఓకే చెబుతుంది. తరువాత ఆ కాగితాన్ని నలిపేసి మరోవైపు విసిరేస్తుంది. అక్కడే పెద్దోడు ఉండడంతో ఆ కాయితాన్ని తీసి చదువుతాడు. ఇది ఎవరు రాశారు అని చుట్టుపక్కల చూడడంతో వల్లి కనిపిస్తుంది. వల్లి రాసిందనుకొని దాన్ని రాకెట్ లా చేసి విసిరగానే అది వల్లికి చేరుతాడు. వల్లి అది చదివి ఆనందంతో పొంగిపోతుంది. తరువాత ఆ ఉత్తరం నలిపేసి విసిరేస్తుంది. అది ప్రేమ తీసుకెళ్తున్న పువ్వుల గిన్నెలో పడుతుంది. ప్రేమ ఆ పువ్వుల తీసుకెళ్తూ ఉండగా ధీరజ్ వచ్చి ఢీకొడతాడు. దాంతో పువ్వులు, పేపర్ అన్ని కింద పడతాయి. అ పువ్వులను తిరిగి ఏరి ప్లేట్లో పెడతారు. ఆ పేపర్ ప్రేమ తీసి చదువుతుంది. ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
నర్మద చేతికి లేఖ
ప్రేమ దాన్ని చదివి కుదరదని చెబుతుంది. ధీరజ్ కి ప్రేమ అన్న విషయం ఏమీ అర్థంకాక వెనక్కి వచ్చి ఏమిటి కుదరదని అడుగుతాడు. ప్రేమ మొదట కుదరదని చెప్పి తర్వాత ఓకే అని ఆ కాగితాన్ని తిరిగి ధీరజ్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. అది ధీరజ్ చదివి ప్రేమ పార్క్ లో కలిసేందుకు ఇలా ప్లాన్ చేసిందని అనుకుంటాడు. తర్వాత కాగితాన్ని విసిరేస్తాడు. అది నర్మద దగ్గరికి చేరుతుంది. నర్మదా దాన్ని ఎవరు విసిరారా అని వెతుకుతూ ఉంటే సాగర్ వస్తాడు. సాగరే రాశాడనుకుని నర్మద అనుకుంటుంది. ఆ పేపర్ తీసుకెళ్లి తిరిగి సాగర్ కే ఇస్తుంది. సాగర్.. నర్మదనే పార్కు దగ్గర కలుద్దామని ప్లాన్ చేసిందని భావిస్తాడు. అందరూ పార్కుకి వెళ్లేందుకు సిద్ధమైపోతారు. ఆ కాగితాన్ని సాగర్ తిరిగి విసిరేస్తాడు. అది తిరుపతి చేతిలో పడుతుంది. తిరుపతి దాన్ని చదివి ఎవరు రాశారా అని వెతుకుతూ ఉంటాడు. తిరుపతి కూడా పార్కుకి వెళ్లేందుకు రెడీ అయిపోతాడు.
విశ్వక్ బండి మీద అమూల్య
సాయంత్రం అవుతుంది. విశ్వక్ బండి మీద అమూల్య పార్క్ కి వస్తుంది. అమూల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో అమూల్య ముఖానికి చున్నీని కట్టేసుకుంటుంది. ‘నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను అమూల్య , నీతో మాట్లాడేందుకు అవకాశం దొరక్క ఇలా పార్క్ కి తీసుకొచ్చాను’ అని అమూల్య చేయి పట్టుకుని చెబుతాడు. దాంతో అమూల్య చాలా ఆనందపడి విశ్వక్ చేయి పట్టుకొని నడుస్తూ ముందుకు వెళుతుంది. ఈలోపు జంటలన్నీ అదే పార్కుకు చేరుకోవడం మొదలవుతాయి. మొదటగా వల్లి, పెద్దోడు పార్కుకి వస్తారు.
పార్కుకు వచ్చిన తిరుపతి
వల్లి ఆనందంతో పార్కులో గంతులేస్తూ ఉంటుంది. నన్నిలా బయటకు తీసుకొచ్చారంటే నమ్మకం కుదరడం లేదు అంటూ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక అక్కడికి సాగర్, నర్మద కూడా చేరుకుంటారు. ఆ తర్వాత ధీరజ్, ప్రేమ కూడా వస్తారు. మొత్తం మీద రామరాజు కుటుంబంలోని జంటలన్ని కూడా ఒకే పార్కుకు చేరుకొని ఒకరు చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ ఉంటారు. విశ్వక్ అమూల్య ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చుంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తిరుపతి కూడా అక్కడికి వచ్చేస్తాడు.
తిరుపతికి కనిపించిన వల్లీ పెద్దోడు
ప్రేమ మాట్లాడుతూ కొత్తగా పార్కుకి తీసుకురావడమేంటి అని అంటుంది. దాంతో ధీరజ్ నువ్వే కదా నన్ను పార్కు తీసుకు రమ్మని అడిగావు.. ఇప్పుడు నన్ను ఇలా అంటున్నావేంటని ప్రశ్నిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కాసేపు గిల్లికజ్జా గొడవలు అవుతాయి. మరో పక్క అమూల్య విశ్వా మాట్లాడుతూ ఉంటారు. అమూల్యతో విశ్వమని ముఖం చూపించమని అడుగుతాడు. జంటలన్నీ ఒక్కోచోట కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. ప్రేమ, ధీరజ్ మాత్రం పార్క్ విషయంలో గొడవ పడుతూ ఉంటారు. తిరుపతి తనకు లెటర్ రాసిన వ్యక్తి ఎవరో కనుక్కోవడం కోసం పార్కులో వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. తిరుపతికి వల్లి పెద్దోడు కనిపిస్తారు. దాంతో తిరుపతి షాక్ అవుతాడు. ఇక్కడితో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

