- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 11వ తేదీ)లో జ్యోకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. తప్పు జ్యోత్స్నదే అంటుంది పారు. పారుకి స్వీట్ తినిపిస్తాడు శివన్నారాయణ. ఒకరి వల్ల మరొకరు ఫ్రస్టేట్ అవుతారు శ్రీధర్, కాశీ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో నీ భార్య గురించి అలా మాట్లాడటం తప్పే కదరా అంటుంది సుమిత్ర. తన మాటల్లో ఉన్న తప్పుకంటే.. నా భార్య గురించి తను అర్థం చేసుకున్న విధానంలోనే ఎక్కువగా తప్పు ఉంది. తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా అని స్టార్ట్ చేస్తాడు కార్తీక్.
నా భార్య పర్సనల్ లైఫ్ గురించి జనాలు ఏదో మాట్లాడతారని నువ్వు అన్నావు కదా.. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడతాను. పిల్లలుండి భార్య పోయిన భర్త ఉన్న ఇంట్లో ఆరు నెలలు తిరిగిలోపే రెండో పెళ్లి గురించి మాట్లాడుతారు. అదే భర్త పోయిన ఆడదాని గురించి ఎవరూ పట్టించుకోరు.
కానీ ఆ ఆడది మన చెల్లె, తల్లో అయితే అలాగే వదిలేస్తామా? అది ఎంత నరకమో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. నా భార్యకు తెలిసి తెలియని వయసులో పెళ్లైంది. అన్నీ తెలుసుకునే లోపే తల్లి అయింది. కట్టుకున్న భర్త మోసం చేశాడని తెలుసుకునే లోపే తన జీవితం ముగిసిపోయిందని తనకు అర్థం అయింది అంటాడు కార్తీక్.
జ్యోకు కౌంటర్ ఇచ్చిన కార్తీక్
మన విలువేంటో తెలిసిన వాళ్లు మన జీవితంలోకి వచ్చేవరకు మనం ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియదు. దీప విలువేంటో తెలిసే నేను తన జీవితంలోకి వెళ్లాను. మళ్లీ తను కార్తీక దీపంలా వెలిగింది. ఇది ఆ విధాత ముడేసిన బంధం. అందుకే మా బతుకులు ఎక్కడ మొదలైనా చివరకు ఇక్కడకు వచ్చి చేరాయి అంటాడు కార్తీక్.
బావకు దీప తన మరదలు అని తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారికి నచ్చినట్లు బతికే హక్కు ఉంది. దీప రెండో పెళ్లి చేసుకుంది అంటున్నావు దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంది?నేను ఆరోజు చెప్పాను. ఈ రోజు చెప్తున్నాను. ఒక వేళ నేను దీప మెడలో తాళి కట్టకపోయినా సరే.. నిన్ను పెళ్లి చేసుకునేవాన్ని కాదు అంటాడు కార్తీక్.
నాతో పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది. గౌతమ్ తో పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది. రెండు సార్లు పెళ్లి ఆగిపోయిన నీకు పెళ్లి అవసరమా అని ఎవరైనా అంటే నువ్వు ఇలాగే ఈ ఇంట్లోనే ఉండిపోతావా? అంటాడు కార్తీక్
మీ గ్రానీ రెండో పెళ్లి చేసుకుంటే తప్పులేదా?
దీప రెండో పెళ్లి చేసుకుంటే తప్పైంది కానీ మీ గ్రానీ చేసుకుంటే తప్పులేదా? దాసు మామయ్య, అనసూయ పెద్దమ్మ లాంటి వారు పోయిన వారి జ్ఞాపకాలతో బతుకుతున్నారు. పారు, తాత పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో రకంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఎవ్వరి గురించి వాళ్లు చూసుకుంటే మంచిది అంటాడు కార్తీక్.
ఇంకోసారి దీప గురించి ఏదైనా మాట్లాడితే కార్తీక్ క్షమించినా.. నేను అస్సలు క్షమించను అంటాడు శివన్నారాయణ. ఏదో ఒకటి నోరు జారడం, మాటలు పడటం దీనికి అలవాటై పోయింది అని మనసులో అనుకుంటుంది పారు. సరే జరిగిందంతా మర్చిపోయి స్వీట్స్ తినండి అని అందరికి స్వీట్స్ పంచుతాడు కార్తీక్.
కార్తీక్ ని మెచ్చుకున్న పారు
నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుందా పారు అంటాడు కార్తీక్. లేదురా తప్పు ఏదైనా ఉందంటే అది జ్యోత్స్నదే. నువ్వు ఒక్క దీప గురించే కాదు.. ఆడదాని మనసు అర్థం చేసుకొని మాట్లాడావు. దీప లాంటి భార్య నీకు. నీలాంటి భర్త తనకు దొరకడం అదృష్టమేరా అంటుంది పారు. షాక్ అవుతుంది జ్యోత్స్న.
నీకు తెలియకుండానే నువ్వు అప్పుడప్పుడు మంచి మాటలు మాట్లాడుతావు పారిజాతం అంటాడు శివన్నారాయణ. ఇంత మంచి మాటలు మాట్లాడినందుకు నీకు ఏదో ఒకటి చేయాలి అంటాడు. అయితే ఆ స్వీట్ తినిపించండి అంటుంది పారు. తినిపిస్తాడు శివన్నారాయణ. ఫోటో తీస్తాడు కార్తీక్. అక్కడినుంచి కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న.
చెప్పింది చెయ్ కాశీ
మరోవైపు ఫోన్లో మాట్లాడుతుంటాడు శ్రీధర్. ఫుడ్ ట్రక్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము. నాకు తోడుగా మా అల్లుడు ఉన్నాడు. తను అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేస్తాడు అని ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇంతలో కాశీ లోపలికి వస్తాడు. ఫుడ్ ట్రక్స్ తో పాటు నువ్వు వెళ్లు అని చెప్తాడు. నేననేందుకు.. వేరేవాళ్లను పంపిస్తాను అంటాడు కాశీ. చెప్పింది చెయ్. బిజినెస్ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పడు నాకు అప్ డేట్ ఇవ్వు అని చెప్తాడు శ్రీధర్.
దీపను ఓదార్చిన కార్తీక్
ఓ పక్కన నిలబడి ఏడుస్తూ ఉంటుంది దీప. కార్తీక్ ని చూసి కళ్లు తుడుచుకుంటుంది. పర్లేదు మరదలా ఏడువు. కళ్లు, కన్నీళ్లు కూడా భార్యా భర్తల లాంటివే. కళ్లు సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా నీకు తోడుగా నేను ఉన్నాను అంటూ కన్నీళ్లు వచ్చేస్తాయి అంటాడు కార్తీక్.
ఎవరో ఏదో మాట్లాడరని ఏడుస్తూ కూర్చుంటామా? పారు, జ్యోత్స్నలకు నిద్రపట్టట్లేదు. మా నాన్న సీఈఓ అయ్యాడు. నీ ఫుడ్ ట్రక్ ఐడియా వర్కౌట్ అయింది. అందుకే మనం స్వీట్ పెట్టిన సరే వాళ్లకు మంటగానే ఉంది. ఏం చేయలేక అలా మాట్లాడుతున్నారు వదిలెయ్ అంటాడు కార్తీక్.
ఫ్రస్టేషన్ లో కాశీ, శ్రీధర్
బిజినెస్ ఎలా జరుగుతుంది అని కాశీకి ఫోన్ చేస్తాడు శ్రీధర్. నేను ఉన్న చోట తప్ప మిగతా అన్ని చోట్ల ఫుడ్ అయిపోయింది అంటాడు కాశీ. ఓ సూపర్.. అక్కడ ఎంత ఫుడ్ మిగిలింది అంటాడు శ్రీధర్. 20 మందికి మిగిలిందని చెప్తాడు కాశీ. సరే ఆ ఫుడ్ ని దగ్గర్లో ఉన్న అనాథ శరణాలయంలో పంచిపెట్టమని చెప్తాడు శ్రీధర్.
సరే ఎంప్లాయిస్ ని పంపించి నేను ఇంటికి వెళ్తాను అంటాడు కాశీ. నువ్వు కూడా ఎంప్లాయ్ వే. అక్కడికి వెళ్లి అటునుంచి ఆఫీసుకు రా.. నీతో పనుంది అని చెప్తాడు శ్రీధర్. కోపంగా ఫోన్ కట్ చేస్తాడు కాశీ. వీడికి ఎందుకో ఇంత ఈగో.. ఒక్క పని సరిగ్గా చేయడు. వీడ్ని దారిలో పెట్టాలి అనుకుంటాడు శ్రీధర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

