- Home
- Entertainment
- Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
బిగ్ బాస్ తెలుగు 9 షోలో 94వ రోజు తనూజ, కళ్యాణ్ కేంద్రంగా కొన్ని పరిణామాలు జరిగాయి. తనూజ, కళ్యాణ్ రిలేషన్ గురించి భరణి, సంజన మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9 లో భాగంగా 94వ రోజు కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. హౌస్ లో ఉన్న సభ్యులకు బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇచ్చారు. లీడర్ బోర్డు లో ఎక్కువ స్కోర్ సాధించేందుకు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ వివిధ టాస్క్ లో ఇచ్చారు. లీడర్ బోర్డు లో స్కోర్ పెంచుకోవడం ద్వారా నామినేషన్స్ నుంచి బయటపడి ఫినాలే వీక్ కి చేరువ అయ్యే అవకాశం దక్కుతుంది.
సంచాలకులుగా సంజన, కళ్యాణ్
ముందుగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పట్టుకో పట్టుకో అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో సంజనకి పాల్గొనే అవకాశం రాలేదు. కళ్యాణ్, సంజన ఈ టాస్క్ లో సంచాలకులుగా వ్యవహరించారు. ఈ టాస్క్ ప్రకారం సంచాలకులు ఇద్దరూ బాల్స్ విసిరితే.. పోటీదారులు ఆ బాల్స్ ని జంబో ప్యాంట్స్ తో పట్టుకోవాలి. ఈ టాస్క్ లో తనూజ ఎక్కువ బాల్స్ పట్టుకుని విజయం సాధించింది.
సంజన, కళ్యాణ్ మధ్య గొడవ
సంచాలకులు అయిన కళ్యాణ్, సంజన మధ్యే మనస్పర్థలు మొదలయ్యాయి. కళ్యాణ్ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వలేదని తనూజకి ఫేవర్ చేశాడని సంజన పరోక్షంగా ఆరోపించింది. తనూజ వైపే కళ్యాణ్ ఎక్కువ బాల్స్ విసిరి ఆమె గెలిచేలా చేశాడు అని ఆరోపించింది. తాను తనూజకి కేవలం ఒక్క బాల్ మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చానని కళ్యాణ్ అన్నాడు. సుమన్ అన్నకి కూడా ఎక్కువ బాల్స్ వేశానని కానీ భరణి అన్న పట్టుకున్నట్లు కళ్యాణ్ తెలిపాడు.
కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు
దీనితో ఈ గొడవలో తనూజ ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్ నాకు ఒక బాల్ ఎక్స్ట్రా వేశాడని సంజన అంటున్నారు.. ఆమె కూడా నాకు ఒక బాల్ ఎక్కువే వేసింది. అది కనిపించడం లేదా ఆమెకి అంటూ తనూజ మండిపడింది. ఈ గొడవ ముగిశాక భరణి, సంజన సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. కళ్యాణ్, తనూజ మధ్య రిలేషన్ గురించి వీరిద్దరూ చర్చించుకున్నారు. కళ్యాణ్ ఈ వారం తన గేమ్ ని పాడు చేసుకుంటున్నాడు అని సంజన భరణితో చెప్పింది. భరణి మాట్లాడుతూ.. వాళ్ళిద్దరి రిలేషన్ ని నేను కాదనను. తనూజకి కళ్యాణ్ అంటే మంచి అభిప్రాయం ఉంది. కళ్యాణ్ కి కూడా తనూజ అంటే మంచి అభిప్రాయం ఉంది. కానీ తనూజ మరీ ఓవర్ గా కళ్యాణ్ ని కమాండ్ చేస్తోంది. తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నిల్చోమంటే నిల్చుంటున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనూజలో ఈ మార్పు దేనికోసం ?
ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ కి ఇమ్మాన్యుయేల్, పవన్ సంచాలకులు. ఈ టాస్క్ ప్రకారం కొన్ని బోర్డు లని కరెక్ట్ గా ఫిట్ చేసి ఆ తర్వాత జారీ పడుతున్న రోప్ లని పట్టుకుని నిలబడాలి. ఈ టాస్క్ లో భరణి విజయం సాధించాడు. అతడి తర్వాతి స్థానంలో సంజన, తనూజ నిలిచారు. ఆ తర్వాత హౌస్ లోకి కొందరు ప్రేక్షకులను వచ్చారు. వారిని కలిసి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం తనూజకి దక్కింది. ఓ అభిమాని మాట్లాడుతూ.. ఈవారం మీరు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ పట్ల సాఫ్ట్ గా ఉంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సడెన్ గా ఈ మార్పు దేనికోసం అని ప్రశ్నించారు. తనూజ బదులిస్తూ హౌస్ లో ఇన్ని రోజులు కలసి ఉన్నాం. ఆ మాత్రం సపోర్ట్ చేసుకోకపోతే ఎలా అని సమాధానం ఇచ్చింది.

