- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు
Illu Illalu Pillalu Today Episode Dec 9: ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో వల్లి ఇంగ్లీషుపైనే కథ మొత్తం సాగుతుంది. వల్లికి ఇంగ్లిషు వచ్చో రాదో నర్మద, ప్రేమకు సందేహం వస్తుంది. దీనికోసం వల్లిని ఇబ్బందిపెడతారు. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

కస్టమర్ కేర్‌తో వల్లీ ఇంగ్లిష్ టాకింగ్
ఈరోజు ఎపిసోడ్ మొదలవ్వగానే రామరాజుకి కస్టమర్ కేర్ వ్యక్తి కాల్ చేస్తాడు. అతను ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడగలనని చెబుతాడు. దీంతో రామరాజు తనకి రాదని చెప్పి వల్లిని పిలుస్తాడు. వల్లి అది విని భయంతో వణికిపోతుంది. రామరాజు ఫోన్ ఇవ్వగానే వల్లి తీసుకుని మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి ఏం అడిగినా కూడా ‘ఎస్ ఎస్... యాయా’ అని మాత్రమే సమాధానం చెబుతూ ఉంటుంది. అదే సమయానికి నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. ఫోన్ పట్టుకొని పక్కకి వచ్చి ఫోన్లో ఉన్న వ్యక్తిని దయచేసి తెలుగులో మాట్లాడమని బతిమిలాడుతుంది వల్లి. కానీ అవతలి వ్యక్తికి తెలుగు రాదని చెబుతాడు. ఈలోపు ప్రేమ వచ్చి ఆ ఫోన్ తీసుకొని ఇంగ్లీషులో ఇరగదీస్తుంది. అది విని రామరాజు ఎంతో సంతోషిస్తాడు. వల్లి మాత్రం కుళ్ళిపోతుంది
నీకు ఇంగ్లిష్ రాదా?
రామరాజు వచ్చి వల్లిని ‘నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా. ప్రేమలాగా గడగడా మాట్లాడకుండా అలా మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వు ఎమ్మే ఇంగ్లీష్ నిజంగా చదివావా’ అని అడుగుతాడు. మళ్లీ అతను ఏం చెబుతున్నాడో తనకు వినిపించలేదని, అందుకే మాట్లాడలేకపోయానని ఏదో చెప్పి తప్పించుకుంటుంది. వల్లి ఓవరాక్షన్‌కి అడ్డుకట్ట వేసేందుకు నర్మద కొత్త ప్లాన్ వేస్తుంది. నీకు వచ్చిన ఇంగ్లీషుతోనే ప్రేమతో ఒక రెండు నిమిషాలు మాట్లాడమని అడుగుతుంది. దీంతో వల్లి భయంతో వణికిపోతుంది. రామరాజు, తిరుపతి కూడా మాట్లాడమని అడుగుతారు. ఈలోపు వేదవతి వచ్చి భోజనానికి రమ్మని పిలుస్తుంది. వేదవతి చెప్పకుండా రామరాజుని లాక్కునివెళ్ళిపోతుంది. దాంతో వల్లి బతికిపోయానని అనుకుంటుంది. ప్రేమ వల్లితో ‘అక్కా... నీ ఎమ్మే ఇంగ్లీష్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించు. జాబ్ చేద్దువు గాని’ అని చెబుతుంది.
20 లక్షలు అడిగిన సాగర్
ఇక్కడి నుంచి సీన్ సాగర్ దగ్గరికి మారిపోతుంది. సాగర్ నర్మద తండ్రి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి మిగతా ఇద్దరు అన్నదమ్ములు కూడా సాగర్ దగ్గరికి వస్తారు. నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు ఎందుకు? అని అడుగుతారు. నాకు అర్జెంటుగా 20 లక్షలు కావాలి అని అడుగుతాడు సాగర్. దాంతో ఇద్దరు అన్నదమ్ములు షాక్ అవుతారు. ఎందుకు అని అడిగినా కూడా అది తన వ్యక్తిగతమని అంటాడు సాగర్. ధీరజ్ డబ్బుల కోసం ఏదో ఒకటి చేద్దాం అని చెబుతాడు. కానీ సాగర్ ‘నువ్వు ఆ విషయంలో కల్పించుకోవద్దని నాన్న ఇంతకుముందే నిన్ను చాలా తిట్టారు’ అని చెబుతాడు. పెద్దోడినే సాయం చేయమని అడుగుతాడు సాగర్. 20 లక్షలు తాను ఇవ్వలేనని, ఏదైనా నాన్నకి చెప్పే చేయమని అంటాడు పెద్దోడు. కాసేపు చాలా ఆవేదనగా మాట్లాడతాడు సాగర్. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
ఇంగ్లీషులో మాట్లాడేసిన వల్లి
ఇక వల్లి ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని పట్టుదలతో నెల రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? అనే బుక్ కొనుక్కుంటుంది. దాన్ని చదవడం మొదలు పెడుతుంది. ఎంత చదువుతున్నా ఆ ఇంగ్లీషు తలకి బుర్రకు ఎక్కదు. అలా చదువుతూనే నిద్రపోతుంది. ఉదయం లేవగానే నర్మద, ప్రేమ గుమ్మం దగ్గర కనిపిస్తారు. అలాగే తిరుపతి అమూల్య కూడా వచ్చి పలకరిస్తారు. అందరూ తన దగ్గరకు వచ్చేసరికి వల్లి కంగారు పడుతుంది. ‘తిరుపతికి నీ మీద డౌట్ వచ్చింది.. నువ్వు కస్టమర్ కేర్ తో మాట్లాడిన ఇంగ్లీష్ విని మతి పోయింది. నీకు ఇంగ్లీషు రాదని అంటున్నాడు. నువ్విప్పుడు నాలుగు ముక్కలు ఇంగ్లిషులో మాట్లాడాలి’ అని బలవంపెడతారు ప్రేమ, నర్మద. వల్లి వెంటనే చిన్నపిల్లల రైమ్ అయినా జానీ జానీ ఎస్ పాపా గడగడా చెప్పేస్తుంది. దాంతో తిరుపతి నిజంగా ఇంగ్లీషు ఇరగదీసిందని పొగిడేసి వెళ్లిపోతాడు.
విశ్వక్ పెళ్లి ప్లాన్
తిరుపతి పొగిడిన పొగడ్తలకు వల్లి ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్నానని త్వరగా వెళ్ళిపోతుంది. నర్మద, ప్రేమ కలిసి ఎలాగైనా వల్లి బాగోతం బయట పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇక్కడి నుంచి సీన్... విశ్వక్ దగ్గరికి మారుతుంది. విశ్వక్ అమూల్య కోసం రామరాజు ఇంటివైపే చూస్తూ ఉంటాడు. అమూల్య పూర్తిగా తన ట్రాప్ పడిందని, ఆమె చేతినుంచి జారిపోక ముందే దాని మనసు మారకముందే పెళ్లి పీటలు ఎక్కించేయాలి అని అనుకుంటూ ఉంటాడు. తియ్యగా తేనె పూసిన కత్తిలాంటి మాయ మాటలు చెప్పి అమూల్యను పెళ్లికి ఒప్పించేయాలని విశ్వక్ నిర్ణయించుకుంటాడు. ఈ లోపు అమూల్య ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఆమెను చూసి విశ్వక్ సైగలు చేసి పిలుస్తూ ఉంటాడు. అదే సమయానికి ప్రేమ కూడా అటువైపుగా వస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ మెరిసిపోతుంది.

