MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?

Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?

నాగార్జునకు టాలీవుడ్ మన్మధుడన్న పేరు ఉంది. చాలామంది హీరోయిన్లకు నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆయనే మా ఫస్ట్ క్రష్ అన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇక నాగార్జున కెరీర్ లో లవ్ స్టోరీ గురించి ఎంత మందికి తెలుసు? నాగ్ వల్ల ఆ హీరోయిన్ బ్యాచిలర్ గా మిగిలిపోయిందా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 01 2026, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ మన్మధుడు..
Image Credit : Facebook/Nagarjuna

టాలీవుడ్ మన్మధుడు..

సినిమా రంగం అంటే రంగుల ప్రపంచమే కాదు, దాని వెనుక ఎన్నో ఆసక్తికరమైన, బాధాకరమైన, సంతోషకరమైన కథలు కూడా ఉంటాయి. ఇలాంటి కథలు కింగ్ నాగార్జున కెరీర్ లో కూడా ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ మన్మధుడిగా పేరు తెచ్చుకున్న కింగ్ నాగార్జున ఎంతో మంది హీరోయిన్స్ కు క్రష్. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లకు పండగే. నాగార్జున ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మాట్లాడి.. ఇంప్రెస్ చేయాలని చూసేవారు. అయితే నాగార్జున కూడా కొంత మంది హీరోయిల్లతో ప్రేమలో పడ్డాడని టాక్ ఉంది. ఓ హీరోయిన్ తో నాగార్జున బంధం నిజమేనా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నాగార్జున‌ - టబు మధ్య బంధం
Image Credit : Instagram

నాగార్జున‌ - టబు మధ్య బంధం

టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున, బాలీవుడ్ నటి టబు మధ్య ఉన్న బంధం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ పెద్ద మిస్టరీ. నాగార్జున రెండుసార్లు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయితే, ఆయన కోసమే టబు అసలు పెళ్ళి చేసుకోవడమే మానేసిందంటుంటారు. అంతే కాదు నాగార్జున కోసం ఆమె ముంబై వదిలి హైదరాబాద్ వచ్చి.. ఒంటరిగా ఉంటుందన్న టాక్ కూడా ఉంది. కానీ ఇందులో నిజం ఎంత?

Related Articles

Related image1
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Related image2
Richest CM : దేశంలోనే రిచ్ సీఎం ఎవరో తెలుసా? చంద్రబాబు, విజయ్‌ ల సంగతేంటి? ?
36
నాగార్జున వైవాహిక జీవితం
Image Credit : StarMaa

నాగార్జున వైవాహిక జీవితం

నాగార్జున జీవితంలోకి ఇద్దరు మహిళలు వచ్చారు. మొదట 1984లో హీరో వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కొడుకు.. ఆయనేహీరో నాగచైతన్య. కొన్ని కారనాల వల్ల వీరు 1990లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున. వీరి తనయుడే హీరో అఖిల్. ఇద్దరు పిల్లలతో నాగార్జున హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ, ఈ అందమైన సంసారం మధ్యలోనే అప్పట్లో వినిపించిన మరో పేరు టబు'.

46
15 ఏళ్ల బంధానికి ఎందుకు ముగింపు?
Image Credit : Asianet News

15 ఏళ్ల బంధానికి ఎందుకు ముగింపు?

టబు, నాగార్జున మధ్య స్నేహం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. మీడియా కథనాల ప్రకారం, టబు నాగార్జునను ఎంతగా ప్రేమించారంటే, ఆయన కోసం తన బాలీవుడ్ కెరీర్‌ను, ముంబై లైఫ్‌ను వదిలేసి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారట. నాగార్జున ఇంటి దగ్గర్లోనే టబు ఓ ఇల్లు కూడా కొన్నారని అప్పట్లో ఫిల్మ్ నగర్‌లో టాక్ నడిచింది. దాదాపు 15 ఏళ్ల పాటు నాగార్జున, టబు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అంటారు. టబు నాగార్జునతో కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ అప్పటికే పెళ్లైన నాగార్జున ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. కానీ టబు మాత్రం నాగార్జునతో ప్రేమ వల్లే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. కొన్నాళ్లకు ఆమె ముంబయ్ వెళ్లిపోయింది.

56
క్లారిటీ ఇచ్చిన నాగార్జున..
Image Credit : our own

క్లారిటీ ఇచ్చిన నాగార్జున..

టబులో తనబంధంపై పలు సందర్భాల్లో నాగార్జున క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. తాను టబు మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చేశాడు. టబు హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. మా ఫ్యామిలీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా.. మా ఇంట్లోనే రెండు మూడు రోజులు ఉంటుంది. అమలనే తనకు కావాల్సిన వన్నీ చూసుకుంటుంది. నాన్నగారితో కలిసి భోజనం కూడా చేసేది. మా ఫ్యామిలీ మెంబర్ లా ఉంటుంది. నాది టబుది స్నేహబంధం మాత్రమే అని నాగార్జున అన్నారు. తాను పెళ్లి చేసుకోను అని ఎప్పుడో నాకు చెప్పింది. ఆమె చాలా ఎమోషనల్ .. అందుకే పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడాలని తనకు లేదు. అంతే కాని నావల్ల టబు పెళ్ళి చేసుకోలేదు అన్న మాటలో అర్ధం లేదు అని నాగార్జున అన్నారు. ఈ రూమర్స్‌పై అమలను ఎప్పుడు అడిగినా ఆమె కొట్టిపారేసేవారు. "నాకు, నాగార్జునకు మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. టబు మా కుటుంబానికి మంచి స్నేహితురాలు" అని అంటుంటారు.

66
54 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్..
Image Credit : instagram

54 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్..

50 ఏళ్లు దాటినా టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జునపై ప్రేమే కారణమా? లేక విధి ఆడిన వింత నాటకమా? అనేది ఎప్పటికీ ఓ మిస్టరీనే. మొత్తానికి, వెండితెరపై అద్భుతంగా కనిపించిన ఈ జంట, నిజ జీవితంలో మాత్రం ఒకటి కాలేకపోయింది. ఇది సినీ పరిశ్రమలోని ఒక "బ్యూటిఫుల్ బట్ ట్రాజిక్" లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. నాగార్జున, టబు ఎంత క్లారిటీ ఇచ్చినా.. అభిమానులు మాత్రం వీరిని మాజీ లవర్స్ గానే చూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
టబు
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Related Stories
Recommended image1
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image2
Richest CM : దేశంలోనే రిచ్ సీఎం ఎవరో తెలుసా? చంద్రబాబు, విజయ్‌ ల సంగతేంటి? ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved