MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవి శివగామి పాత్ర చేస్తే సంకనాకిపోయేది.. అతిలోక సుందరి గురించి రాజమౌళి ఊహించని కామెంట్‌

శ్రీదేవి శివగామి పాత్ర చేస్తే సంకనాకిపోయేది.. అతిలోక సుందరి గురించి రాజమౌళి ఊహించని కామెంట్‌

`బాహుబలి` మూవీలో శివగామి పాత్రలో మొదట శ్రీదేవిని అనుకున్నారు రాజమౌళి. కానీ ఆమె ఆ పాత్ర చేసి ఉంటే మొత్తం పోయేదన్నారు. బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 04 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శివగామి పాత్రకి రాజమౌళి మొదట అనుకున్నది శ్రీదేవి
Image Credit : pinkvilla

శివగామి పాత్రకి రాజమౌళి మొదట అనుకున్నది శ్రీదేవి

రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ మూవీస్‌ `బాహుబలి`, `బాహుబలి 2`. ఈ చిత్రాలు తెలుగుకే కాదు, ఇండియన్‌ సినిమాకి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. భారతీయ సినిమాకి ఒక బెంచ్‌ మార్క్ ని సెట్‌ చేశాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర బాగా పాపులర్‌ అయ్యింది. బాగా పండింది. రమ్యకృష్ణ సైతం అంతే బాగా చేసింది. `బాహుబలి`తో రమ్యకృష్ణపై ఉన్న ఇమేజ్‌ మారిపోయింది. అయితే ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి అనుకున్నది అతిలోక సుందరి శ్రీదేవిని.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
శ్రీదేవి కండీషన్స్ విని షాక్‌ అయిన రామజౌళి
Image Credit : catch news

శ్రీదేవి కండీషన్స్ విని షాక్‌ అయిన రామజౌళి

రాజమౌళి.. శివగామి పాత్ర కోసం శ్రీదేవిని కలిశారు. అయితే ఆమె పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేయడం, అలాగే మెయింటనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉండటం, దీనికితోడు హిందీ మార్కెట్‌లో కొంత షేర్‌ అడగడం వంటి కారణాలతో ఆమెని వద్దు అనుకున్నట్టు రాజమౌళి తెలిపారు. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సందర్బంగానే మరో షాకింగ్‌ కామెంట్‌ చేశారు రాజమౌళి. ఆమె ఒప్పుకోకపోవడమే మంచిదైందని, తమకు హెల్ప్ అయ్యిందని చెప్పారు. ఇంతకి రాజమౌళి ఏం చెప్పారనేది చూస్తే.

Related Articles

Related image1
ఎన్టీఆర్‌ `బొబ్బిలిపులి`పై పోటీగా వచ్చి అడ్రస్‌ లేకుండా పోయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఆలోచనలో పడ్డ చిరు
Related image2
పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం.. అక్కడ `ఓజీ` సునామీ స్టార్ట్
35
శ్రీదేవి చేస్తే సినిమా సంకనాకిపోయేది
Image Credit : india today tv

శ్రీదేవి చేస్తే సినిమా సంకనాకిపోయేది

`శ్రీదేవిగారిని వెళ్లి అడిగాం, మా అదృష్టం బాగుండి, ఆమె ఓకే చేయలేదు. 7, 8 కోట్ల పారితోషికం అడిగారు. వచ్చినప్పుడల్లా 5 బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు, బిగ్గెస్ట్ స్టార్‌ హోటల్‌లో 5 సూట్స్, ఆ తర్వాత హిందీలో పర్సెంటేజ్‌ అడిగారు. ఇది చాలా టూమచ్‌ అనిపించింది. అలా అడగడం మా అదృష్టం` అని చెప్పారు రాజమౌళి. దీనికి ఏబీఎన్‌ రాధాకృష్ణ కల్పించుకుని శివగామి ఆ పాత్ర ఆమె చేసి ఉంటే సంకనాకిపోయేది` అని అనగా, హా అవును, మొత్తం పోయిండేది అని రాజమౌళి ఒప్పుకున్నారు. అంతేకాదు శ్రీదేవిగారు సెటిల్డ్ గా యాక్ట్ చేస్తారు. వైల్డ్ రియాక్షన్‌, ఆ పవర్‌ రాదని తెలిపారు జక్కన్న.

45
షాకిచ్చేలా శ్రీదేవిపై రాజమౌలి కామెంట్స్
Image Credit : our own

షాకిచ్చేలా శ్రీదేవిపై రాజమౌలి కామెంట్స్

అద్భుతమైన నటిగా, అత్యంత అందమైన నటిగా పేరుతెచ్చుకున్న శ్రీదేవిపై రాజమౌళి ఇలాంటి కామెంట్‌ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. రాజమౌళి ఇలా రియాక్ట్ అయ్యారేంటని అందరూ షాక్‌ అవుతున్నారు. చాలా హుందాగా, మెచ్యూర్డ్ గా ఉండే రాజమౌళి నుంచి ఇది ఊహించడం కష్టమనే చెప్పాలి. కానీ ఆయన శ్రీదేవిపై చేసిన ఈ కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే దీనిపై శ్రీదేవి కూడా అప్పట్లోనే స్పందించింది.

55
రాజమౌళికి శ్రీదేవి కౌంటర్‌.. దిగొచ్చిన జక్కన్న
Image Credit : Youtube/ Shreyas Media

రాజమౌళికి శ్రీదేవి కౌంటర్‌.. దిగొచ్చిన జక్కన్న

తనపై రాజమౌళి చేసిన కామెంట్లని అతిలోక సుందరి ఖండించింది. అది నిజం కాదని చెప్పింది. అలా చేసి ఉంటే ఈ యాభై ఏళ్లు ఎలా ఇండస్ట్రీలో సర్వైవ్‌ అవుతాను అని తెలిపింది. `నేను అంత అన్యాయంగా డిమాండ్‌ చేశానంటే, ఈ రోజుకి 300 చిత్రాలు చేయడం, ఈ 50ఏళ్లు నన్ను ఇండస్ట్రీలో ఉండనిచ్చేవారా? కానీ ఇలా అయ్యిందని పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో చెప్పడం మంచి పద్ధతి కాదు. ఆయన ఒక డిగ్నిఫైడ్‌, కామ్‌ డైరెక్టర్‌ అని విన్నాను. ఇలా చేయడం సరికాదు. ఆయనతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ఇలాగే బాహుబలిలాగానే గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నా` అని తెలిపారు శ్రీదేవి. ఇలా రాజమౌళి కామెంట్స్, ఆయనకు శ్రీదేవి కౌంటర్‌ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. దీనికి ఆ తర్వాత రాజమౌళి స్పందించి క్షమాపణలు చెప్పారు. ఈ అంశం గురించి తాను పబ్లిక్‌గా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబుతో గ్లోబల్‌ ట్రోట్‌ సినిమా చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
రమ్య కృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image2
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Recommended image3
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Related Stories
Recommended image1
ఎన్టీఆర్‌ `బొబ్బిలిపులి`పై పోటీగా వచ్చి అడ్రస్‌ లేకుండా పోయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఆలోచనలో పడ్డ చిరు
Recommended image2
పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం.. అక్కడ `ఓజీ` సునామీ స్టార్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved