- Home
- Entertainment
- Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా
అల్లు అర్జున్ 15 ఏళ్ళ క్రితం నటించిన ఓ సినిమాలోని పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా ఫ్లాప్ మూవీలోని సాంగ్. ఆ పాట ఏంటి ? అసలు ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో సాంగ్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. బన్నీ నటించే సినిమాలకు పాటలు అంత బాగా కుదురుతాయి. గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాని తీసుకున్న సాంగ్స్ హైలైట్. ఇక బన్నీ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ చిరవగా నటించిన అల వైకుంఠపురములో, పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లోని పాటలు అయితే యూట్యూబ్ ని షేక్ చేశాయి.
15 ఏళ్ళ క్రితం నాటి పాట ఇప్పుడు వైరల్
సాధారణంగా సినిమా రిలీజ్ టైంలోనే పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. కానీ అల్లు అర్జున్ 15 ఏళ్ళ క్రితం నటించిన ఓ మూవీలోని పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ మరేదో కాదు.. వరుడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2010లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.
కట్నంపై సెటైరికల్ లిరిక్స్
పెళ్లి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో లెజెండ్రీ లిరిసిస్ట్ వేటూరి రాసిన ఐదు రోజుల పెళ్లి అనే సాంగ్ బాగా హైలైట్ అయింది. తెలుగు సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్ల గురించి వేటూరి అద్భుతంగా రాశారు. ఈ సాంగ్ సడెన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి ఓ కారణం ఉంది. పూజిత మక్కపాటి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లు యొన్సర్ ఈ సాంగ్ పై రీల్ చేశారు. ఈ సాంగ్ లోలోపల 'ఇమ్మని కట్నం కోరి మేము అడగలేదు' అనే బిట్ సాంగ్ ఉంటుంది. దానిపై ఆమె రీల్ చేశారు.
ఆమె ఎక్స్ ప్రెషన్స్ కి నెటిజన్లు ఫిదా
కట్న కానుకలపై సెటైరికల్ గా భలే గమ్మత్తుగా లిరిక్స్ ఉంటాయి. ఈ సాంగ్ ని పాడుతూ పూజిత మక్కపాటి తన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టేశారు. నెటిజన్లు ఆమె ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అవుతున్నారు. వరుడి తరుపున వాళ్ళు మేము కట్నం అడగడం లేదు అంటూనే తమ కోరికల చిట్టాని విప్పుతారు. దీనికి ఆమె ఇచ్చిన హావా భావాలు భలే ఉన్నాయి. అందుకే ఇది ఫ్లాప్ మూవీలో సాంగ్ అయినప్పటికీ తెగ ట్రెండ్ అవుతోంది.
సంధ్య థియేటర్ ఘటన
దీనికి తోడు అల్లు అర్జున్ కూడా ట్రెండ్ అవుతున్నాడు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి కోర్టు నోటీసులు పంపింది. సోమవారం రోజు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలి అని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

