- Home
- Entertainment
- Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
రాంచరణ్ నటించిన పెద్ది మూవీ విడుదలై 2 వారాలకు పైగా అవుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. పెద్ది చిత్రం విషయంలో జాన్వీ అసంతృప్తిగా ఉందంటూ వార్తలు వచ్చాయి.

Janhvi Kapoor
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పెద్ది చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. రాంచరణ్ నటనకు దేశం నలువైపున నుంచి ప్రశంసలు దక్కాయి. రాంచరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డొమెస్టిక్ మార్కెట్ లో పెద్ది చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న పెద్ది బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది.
పెద్దికి అక్కడ నష్టాలు
అయితే ఓవర్సీస్ లో మాత్రం పెద్ది చిత్రానికి ఎదురీత తప్పడం లేదు. ఓవర్సీస్ లో పెద్ది చిత్రానికి నష్టాలు ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్ది చిత్రాన్ని వివాదాలు కూడా వెంటాడాయి. జాన్వీ కపూర్ పాత్రని డైరెక్టర్ బుచ్చిబాబు ప్రెజెంట్ చేసిన విధానాన్ని చాలా మంది తప్పు పట్టారు. కేవలం గ్లామర్ తో అట్రాక్ట్ చేయడం కోసమే ఆమె పాత్రని ఉపయోగించుకున్నట్లు విమర్శలు వచ్చాయి.
పెద్ది రిలీజ్ తర్వాత జాన్వీ సైలెంట్
ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టేలా ఆమె సన్నివేశాలు ఉన్నాయి అంటూ ట్రోలింగ్ జరిగింది. దీనిపై బుచ్చిబాబు క్షమాపణ చెప్పి జాన్వీ సన్నివేశాల్లో మార్పులు కూడా చేశారు. మరోవైపు అనంత్ శ్రీరామ్ ఐటెం సాంగ్ కోసం రాసిన లిరిక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా పెద్ది రిలీజ్ అయ్యాక జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేదు. 2 వారాలుగా ఆమె నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు.
జాన్వీ పాత్రపై విమర్శలు
పెద్ది చిత్రంలో తన పాత్ర పాత్ర జాన్వీ కపూర్ తీవ్ర అసంతృప్తిగా ఉందంటూ ప్రచారం జరిగింది. తన పాత్ర పట్ల విమర్శలు రావడం కూడా జాన్వీని హర్ట్ చేసింది అంటూ బి టౌన్ లో వార్తలు వచ్చాయి. అందుకే జాన్వీ వీటన్నింటికీ దూరంగా ఉంటూ సైలెంట్ మైంటైన్ చేసింది అని అంటున్నారు.
జాన్వీ కపూర్ హ్యాపీగా లేదా ?
ఎట్టకేలకు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయింది. తన సోదరి ఖుషి కపూర్, తన పెట్ డాగ్స్ తో చిల్ అవుతున్న క్యూట్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా పెద్ది చిత్రం విషయంలో జాన్వీ కపూర్ ఏమాత్రం హ్యాపీగా లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

