MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?

Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?

Lenin OTT: అయ్యగారు ఓటీటీలోకి వచ్చే టైమ్ ఫిక్స్ అయ్యింది. లెనిన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ను అందుకుని.. కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అఖిల్. ఈ నెలలో ఓటీటీ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 01 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల సినిమా..
Image Credit : X/@AnnapurnaStdios

ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల సినిమా..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ మైలురాయిని చేరుకున్నాడు. ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్‌కు ‘లెనిన్’ చిత్రం ఊహించని రీతిలో తిరుగులేని విజయాన్ని అందించింది. జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ రాయలసీమ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో?
Image Credit : X/@AnnapurnaStdios

లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో?

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన ‘లెనిన్’ చిత్రం డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) దక్కించుకుంది. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తేనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయినవారు .. మళ్లీ మళ్లీ చూడాలనుకునే అక్కినేని అభిమానులు ఈ ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు.

Related Articles

Related image1
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Related image2
Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్
35
బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల విధ్వంసం!
Image Credit : Asianet News

బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల విధ్వంసం!

ఈ సినిమా మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి రోజే రూ. 16.7 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘లెనిన్’.. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. 10 రోజుల్లో రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసిన అఖిల్ సినిమా.. కేవలం 20 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అఖిల్ సినీ ప్రస్థానంలోనే ఇది మొదటి రూ. 100 కోట్ల సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

45
అయ్యగారి మాస్ కంబ్యాక్..
Image Credit : Asianet News

అయ్యగారి మాస్ కంబ్యాక్..

ఇప్పటివరకు అర్బన్, లవర్ బాయ్ లేదా స్టైలిష్ పాత్రలకే పరిమితమైన అఖిల్, ఈ చిత్రంతో తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కోసం గెటప్, బాడీ లాంగ్వేజ్, యాసను పూర్తిగా మార్చి ఊర మాస్ లుక్‌లో ఒదిగిపోయారు. ఆయన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం భారీ ప్రశంసలు దక్కాయి. ‘అయ్యగారు మాస్ కంబ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

55
లెనిన్ సినిమా సంగతులు
Image Credit : Asianet News

లెనిన్ సినిమా సంగతులు

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత నిర్మించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Recommended image2
Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved