MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Mohan Babu: చంద్రబాబు చెప్పిన మాట విని ఎన్టీఆర్‌కి ద్రోహం చేశా.. బాలయ్య ముందు తప్పు ఒప్పుకున్న మోహన్‌ బాబు

Mohan Babu: చంద్రబాబు చెప్పిన మాట విని ఎన్టీఆర్‌కి ద్రోహం చేశా.. బాలయ్య ముందు తప్పు ఒప్పుకున్న మోహన్‌ బాబు

మోహన్‌ బాబు ముక్కుసూటి మనిషి. ఏదున్న మొహం మీదే మాట్లాడతాడు. తాజాగా ఆయన చంద్రబాబు చేసిన మోసం గురించి, చంద్రబాబు వల్ల తాను ఎన్టీఆర్‌ కి చేసిన ద్రోహం గురించి వెల్లడించారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 12 2026, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్‌కి ద్రోహం చేసిన విషయం బయటపెట్టిన మోహన్‌ బాబు
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌కి ద్రోహం చేసిన విషయం బయటపెట్టిన మోహన్‌ బాబు

సీనియర్‌ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తోనే ఉన్నాడు మోహన్‌ బాబు. ఆయన్ని నటుడిగా ప్రోత్సహించడమే కాదు, రాజకీయంగానూ లైఫ్‌ ఇచ్చాడు. కానీ మోహన్‌ బాబు ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచాడు. ఆయనకు ద్రోహం చేశాడు. చంద్రబాబు చెప్పిన మాట విని రామారావుని మోసం చేశాడట. ఈ విషయాన్ని బాలయ్య ముందు ఒప్పుకున్నారు మోహన్‌బాబు. అంతేకాదు తాను తప్పు చేశానని, అదే సమయంలో చంద్రబాబు మిస్టేక్‌ చేసినట్టు తెలిపారు. మరి ఆ కథేంటంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్‌పై చంద్రబాబు వర్గం తిరుగుబాటు
Image Credit : our own

ఎన్టీఆర్‌పై చంద్రబాబు వర్గం తిరుగుబాటు

ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులు, పథకాలు తీసుకొచ్చారు. జనం మెప్పించిన సీఎం అనిపించుకున్నారు. ఇప్పటికీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలు అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. రెండు రూపాయలకే రేషన్‌ బియ్యం అనేది ఆయన తెచ్చిన పథకమే. సీఎంగా రాణించిన క్రమంలోనే ఆయన్ని టీడీపీలో కొందరు వెన్నుపోటు పొడిచారు. రెండు సార్లు సీఎం పీఠం నుంచి దించారు. పార్టీ, అధికారం అంతా లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్తుందని, ఇకపై ఆమె చెప్పినట్టే మనం నడుచుకోవాల్సి వస్తుందని చెప్పి, చంద్రబాబు సమక్షంలోని మేజర్‌ గా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా పార్టీని చీల్చి అధికారం చేపట్టారు. దీంతో రామారావు చాలా బాధపడ్డారు. తనకు వెన్నుపోటు పోవడంపై ఆయన చాలా కుంగిపోయారు.

35
ఎన్టీఆర్‌ని దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ
Image Credit : aha

ఎన్టీఆర్‌ని దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ

ఆ తర్వాత టీడీపీ పూర్తిగా చంద్రబాబు నాయుడి కంట్రోల్‌లోకి వెళ్లింది. నందమూరి ఫ్యామిలీ కూడా చంద్రబాబు వెంటనే ఉన్నారు. సొంత తండ్రినే దూరం పెట్టారు. అయితే ఈ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని కొందరు అంటుంటే, లక్ష్మీ పార్వతి కారణంగా పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు అలా చేయాల్సి వచ్చిందనేది మరికొందరి వాదన. బాలయ్య కూడా దీన్నే సమర్థిస్తుంటారు. అందుకే బావ సైడ్‌ ఉన్నాడు. అయితే ఇదే విషయం బాలకృష్ణ, మోహన్‌ బాబు మధ్య చర్చకు వచ్చింది. మోహన్‌ బాబుని బాలయ్య ప్రశ్నించారు. ఆ రోజు నాన్నగారి వెంట ఎందుకు లేరు, ఆయనకు ఎందుకు ద్రోహం చేశారు, పార్టీ ఎందుకు మారారు అని బాలయ్య ప్రశ్నించాడు.

45
చంద్రబాబు మాట విని ఎన్టీఆర్‌కి మోహన్‌బాబు ద్రోహం
Image Credit : aha

చంద్రబాబు మాట విని ఎన్టీఆర్‌కి మోహన్‌బాబు ద్రోహం

దీనికి మోహన్‌ బాబు స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. సంసార జీవితంలోగానీ, నిజ జీవితంలో గానీ ఎప్పుడూ సక్రమంగా ఉన్నా, ఏదో టైమ్‌ లో సడెన్‌గా దెబ్బతగులుతుంది. ఆ సమయంలో చంద్రబాబు మాటలు విని అన్నయ్యని కాదనుకొని వచ్చాను. ఈ విషయం తెలిసి నా ఫ్రెండ్‌ రజనీకాంత్‌.. ఏరా అన్నయ్యకి ద్రోహం చేశావని మందలించాడు. ఆ తర్వాత నేను, రజనీకాంత్‌ అన్నయ్య వద్దకు వెళ్లాం. ఆయనకు విషయం చెప్పే లోపే, ఏం బ్రదర్‌ మీరు కూడానా అన్నారు. ఆ మాటతో ఇంకా ఏం మాట్లాడలేకపోయాం. ఏదో మాట్లాడి వచ్చేశాం, వచ్చాక చంద్రబాబుని నేను ఇది కావాలి, అది కావాలని ఏదీ అడగలేదు. కానీ చంద్రబాబు మిస్టేక్‌ చేశాడు.

55
చంద్రబాబు క్రమశిక్షణ లేదని బయటకు పంపించాడు
Image Credit : aha

చంద్రబాబు క్రమశిక్షణ లేదని బయటకు పంపించాడు

కాలం గడిచిపోయింది. అన్నయ్య వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గురించి చెడుగా అనకూడదు. నా బంధువు, అతను బాగుండాలి, క్షేమంగా బతకాలి. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన నన్ను క్రమశిక్షణ లేదని అన్నాడు. ఏ మహానుభావుడు అన్నయ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని బిరుదు ఇచ్చాడో, చంద్రబాబు క్రమశిక్షణ లేదని బయటకు పంపించాడు` అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మోహన్‌బాబు. బాలయ్య నిర్వహించిన అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే షో గత సీజన్‌ లో పాల్గొన్న కలెక్షన్‌ కింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
S Janaki Family: ఎస్‌ జానకి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఆ విషాదంతో సంచలన నిర్ణయం
Recommended image2
Janaki Net Worth: ఎస్‌ జానకి ఎంత సంపాదించిందో తెలుసా? ఆమె ఆస్తుల విలువ తెలిస్తే మతిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved