MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • S Janaki Family: ఎస్‌ జానకి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఆ విషాదంతో సంచలన నిర్ణయం

S Janaki Family: ఎస్‌ జానకి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఆ విషాదంతో సంచలన నిర్ణయం

S Janaki Family: లెజెండరీ గాయని ఎస్‌ జానకి ఎప్పుడూ తన ఫ్యామిలీ ప్రస్తావన తీసుకురాలేదు. ఆమె భర్త ముప్పై ఏళ్లక్రితమే కన్నుమూశాడు, ఇటీవలే కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది వీరే.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 11 2026, 11:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్‌ జానకి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌
Image Credit : stockPhoto

ఎస్‌ జానకి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌

దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ చాలా గోప్యంగానే ఉంచింది. తెరపై వేలాది పాటలతో అలరించిన ఆమె, వ్యక్తిగత విషయాలను మాత్రం మీడియాకు దూరంగానే ఉంచారు. అందుకే ఆమె కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తన సంగీత ప్రయాణంలో ఎంత వినయంగా ఉన్నారో, కుటుంబ జీవితంలో కూడా అంతే సాధారణంగా జీవించడానికే ఎస్. జానకి ప్రాధాన్యం ఇచ్చారు. ఖ్యాతి ఎంత పెరిగినా కుటుంబ బంధాలను కాపాడుకోవడమే తనకు ముఖ్యమని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా ప్రజల దృష్టికి దూరంగానే ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1959లొ రామ్‌ప్రసాద్‌ తో మ్యారేజ్‌
Image Credit : stockPhoto

1959లొ రామ్‌ప్రసాద్‌ తో మ్యారేజ్‌

ఎస్. జానకి భర్త పేరు వి. రామప్రసాద్. వీరికి 1959లో మ్యారేజ్‌ జరిగింది. ఆయన వృత్తిపరంగా మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా, జానకి సంగీత ప్రయాణానికి అండగా నిలిచిన జీవిత భాగస్వామిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో ఎస్. జానకి బిజీగా ఉన్న రోజుల్లో కూడా కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసేందుకు చాలా సపోర్ట్ చేశారట. 1997లో రామప్రసాద్ మరణించడం జానకి జీవితంలో పెద్ద విషాదంగా నిలిచింది. ఆ తర్వాత కూడా ఆమె ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి, సంగీతానికే ఎక్కువ సమయం కేటాయించారు. భర్త గురించి ఆమె మాట్లాడిన సందర్భాల్లో ఆయన తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, తన విజయాల్లో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

35
జానకి కొడుకు, మనవరాళ్లు
Image Credit : stockPhoto

జానకి కొడుకు, మనవరాళ్లు

ఎస్. జానకి దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు మురళీ కృష్ణ. కొన్ని సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు. కాకపోతే సినీ రంగంలో కాకుండా తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు భార్య ఉమా, ఇద్దరు కూతుళ్లు వర్ష, అప్సర ఉన్నారు. ఇదిలా ఉంటే మురళీ కృష్ణ ఆరు నెలల క్రితమే గుండెపోటుతో కన్నుమూశారు. ఇది జానకిని బాగా కుంగదీసింది. 1997లో తన భర్తని కోల్పోయినప్పుడే ఆమె బాగా డౌన్‌ అయ్యింది. ఇప్పుడు చివరి దశలో కొడుకుని పోగొట్టుకోవడంతో జానకి కోలుకోలేకపోయింది. ఓ వైపు వయో భారం, మరోవైపు కొడుకు మరణంతో ఆమె బాగా కుంగిపోయారు. చాలా బెంగ పెట్టుకున్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యారు. హఠాన్మరణం చెందారు. జానకీ శనివారం సాయంత్రం మైసూర్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.

45
సినిమాలకు దూరంగా ఫ్యామిలీ
Image Credit : Asianet News

సినిమాలకు దూరంగా ఫ్యామిలీ

సాధారణంగా సినిమా రంగంలో ఒక్కరు ఉంటే, వారసులంతా సినిమాల్లోకి వస్తారు. నటులుగా, దర్శకులుగా, ఇతర టెక్నీషియన్లుగా ఉంటారు. సింగర్లు అయితే వారసులు కూడ సింగర్లు మారుతుంటారు. కానీ జానకి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ లేరు. కొడుకు మాత్రమే కొన్ని సినిమాల్లో మెరిశాడు. ఆ తర్వాత ఆయన కూడా దూరంగానే ఉన్నారు. వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. కొడలు ఉమా, మనవరాళ్లు వర్ష, అప్సర లు మాత్రమే ఉన్నారు.

55
భర్త మరణంతో జానకి సంచలన నిర్ణయం
Image Credit : Asianet News

భర్త మరణంతో జానకి సంచలన నిర్ణయం

జానకి తన జీవితంలో ఒక నియమాన్ని పాటించారు. ఆమె కట్టు, బొట్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన భర్త మరణంతో సంచలన నిర్ణయం తీసుకుందట. తన ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత రంగు చీరలు, జరీతో కూడిన వస్త్రాలు ధరించడం మానేసినట్లు తెలిపారు. కేవలం తెలుపు రంగు వస్త్రాలనే ధరిస్తున్నట్లు, సిల్క్ చీరలు కూడా కట్టడం లేదని చెప్పారు. గతంలో జానకి పెద్ద బొట్టు పెట్టుకునే వారు, దానికి ఒక విలువ ఉండేదని, అయితే ప్రస్తుతం బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని, తను(భర్త) లేనప్పుడు దానికి విలువ లేదని ఆమె వెల్లడించడం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Related Stories
Recommended image1
Janaki: చిరంజీవి పేరు చెబితే రాధిక గొప్పగా చెప్పుకుంటుంది..అంతకంటే గొప్పగా నేను చెబుతా, ఎస్ జానకి కామెంట్స్
Recommended image2
Janaki Net Worth: ఎస్‌ జానకి ఎంత సంపాదించిందో తెలుసా? ఆమె ఆస్తుల విలువ తెలిస్తే మతిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved