చిరంజీవి కి అల్లు అర్జున్ సర్‌ప్రైజ్.. మెగాస్టార్ అంటే బన్నీకి అంత ఇష్టమా..?
మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఈమధ్య కాలంలో మళ్లీ మెగా అల్లు ఫ్యామిలీలు కలిసి సందడి చేస్తున్నారు. ఈక్రమంలో చిరంజీవి కి అల్లు అర్జున్ ఇచ్చిన సర్ ప్రైజ్ అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంతకీ ఎంటది.

మెగా అల్లు ఫ్యామిలీవార్..
చాలా కాలంగా అల్లు అర్జున్ , రామ్ చరణ్ కు మధ్య సఖ్యత లేదు అన్న టాక్ గట్టిగా వినిపించింది పవన్ కళ్యాణ్ తో బన్నీ విభేదిస్తున్నారన్న మాటలుఉన్నాయి. దీనికి తోడు.. ఎన్నికల్లో పవన్ కు సపోర్ట్ చేయకుండా.. వైసీపీ లీడర్ అయినతన స్నేహితుడికి బన్నీ సపోర్ట్ చేయడంతో.. ఈ వివాదం పెద్ద తుపానుగా మారింది. మెగా అల్లు వార్ అంటూ.. సోషల్ మీడియా కోడై కూసింది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత మెగా హీరోలు సపోర్ట్ గా నిలబడటం, ఆతరువాత అల్లు అర్జున్ నానమ్మ మరణం, అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ టైమ్ లో.. ఈ రెండు ప్యామిలీలు మళ్లీ కలిసిమెలిసి కనిపించారు. ఈరెంటు కుటుంబాల మధ్య బయట ఏది ప్రచారం జరిగినా.. చిరంజీవి, అల్లు అరవింద్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉన్నారు. కలిసి మెలిసి ప్రయాణం చేశారు. ఇక తాజాగా మెగా అభిమానులు దిల్ కుష్ అయ్యేలా అల్లు అర్జున్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు.
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ వ్యాపారం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ బిజినెస్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే సత్యం థియేటర్ ప్లేస్ లో అల్లు మాల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక తాజాగా హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో ‘అల్లు సినిమాస్’ పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని రీసెంట్ గా ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గతంలో అల్లు అర్జున్ పేరు మీద ఏఏఏ (AAA) థియేటర్ ఉన్నప్పటికీ, అది ఆసియన్ గ్రూప్‌లో భాగస్వామ్యంగా మాత్రమే కొనసాగింది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా తన పేరునే బ్రాండ్‌గా తీసుకొని ‘అల్లు సినిమాస్’ పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్మించడం విశేషం
అల్లు మాల్ లో మెగాస్టార్ ఫోటో..
ఈ నేపథ్యంలో నేడు జనవరి 4న ఈ మల్టీప్లెక్స్‌ను ఫార్మల్‌గా ఓపెన్ చేశారు. కాతా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు సినిమాస్ థియేటర్ లోపల ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అల్లు అర్జున్ తన తాత ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య, తండ్రి నిర్మాత అల్లు అరవింద్ ఫోటోలతో పాటు తను గురువగా భావించి.. ఎంతగానో ప్రేమించే.. మామ మెగాస్టార్ చిరంజీవి ఫోటోను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు.
మెగా అభిమానుల మనసు గెలిచిన బన్నీ..
ఈ మాల్ లో చిరంజీవి ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పట్ల అల్లు అర్జున్‌కు ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను మెచ్చుకుంటున్నారు. కొంతకాలంగా మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపించిన నేపథ్యంలో.. అల్లు అర్జున్ చేసిన ఈ పనితో ఆయన.. మెగా అభిమనుల మనసు గెలుచుచున్నారు.
అల్లు అర్జున్ సినిమాలు..
ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌తో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. దాదాపు 800 బడ్జెట్ తో ఆసినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ముంబయ్ కి మకాం మార్చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఈసినిమా తరువాత అల్లు అర్జున్ పుష్ప3 సెట్స్ లో కి వెళ్తాడా.. లేక మరేదైనా సినిమా చేస్తాడా అనేది చూడాలి. బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలితో బన్నీ సినిమా దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.

