- Home
- Entertainment
- ప్రైమ్ వీడియోలో మూవీస్ ని రెంట్ కి తీసుకోవడం ఎలాగో తెలుసా ? ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలని ఇలా చూసేయొచ్చు
ప్రైమ్ వీడియోలో మూవీస్ ని రెంట్ కి తీసుకోవడం ఎలాగో తెలుసా ? ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలని ఇలా చూసేయొచ్చు
ప్రైమ్ వీడియోలో చిత్రాలని రెంట్ కి తీసుకోవడం ఎలా.. రెంట్ కి అందుబాటులో ఉన్న అద్భుతమైన చిత్రాలు ఏంటి ? లాంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో రెంట్
కొన్ని సార్లు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అన్ని రకాల చిత్రాలని చూసే వీలు ఉండదు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని చిత్రాలని రెంట్ కి పెడుతుంటారు. కొన్ని చిత్రాలని ఆలస్యంగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ద్వారా చూసే వీలు కల్పిస్తారు. అలాంటప్పుడు త్వరగా ఆ చిత్రాలని చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ విధానం అందుబాటులో ఉంది.
బ్లాక్ బస్టర్ చిత్రాలు మిస్సయ్యారా
బిజీ షెడ్యూల్ వల్ల థియేటర్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ చిత్రాలని అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి చూడవచ్చు. Movie Rentals on Prime Video ద్వారా మీరు తాజా సినిమాలను రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అద్దెకు తీసుకొని చూడవచ్చు. గత 100 ఏళ్లలో విడుదలైన 7,500కిపైగా సినిమాల కలెక్షన్‌తో దేశంలోనే అతి పెద్ద అద్దె సినిమాల లైబ్రరీగా ప్రైమ్ వీడియో నిలుస్తోంది.
ప్రైమ్ వీడియోలో సినిమా అద్దె విధానం ఇలా
*primevideo.com వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు చూడదలిచిన సినిమాను సర్చ్ చేయండి.
*అదనపు చెల్లింపు అవసరమయ్యే టైటిల్స్ పసుపు రంగు షాపింగ్ బ్యాగ్ ఐకాన్తో ఉంటాయి.
*స్క్రీన్‌పై చూపే సూచనలను అనుసరించి అద్దె ప్రక్రియను పూర్తిచేయండి.
*మీరు అద్దెకు తీసుకున్న సినిమాను మొబైల్, టీవీ లేదా ఇతర అనుకూల పరికరాల్లో చూడొచ్చు.
రెంటల్ నిబంధనలు
అద్దెకు తీసుకున్న సినిమా 30 రోజులు వరకు మీ లైబ్రరీలో ఉంటుంది. కానీ ఒకసారి ప్లే చేయడం మొదలైతే 48 గంటల్లో సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే “More purchasing options” లో మీరు SD, HD క్వాలిటీల్లో సినిమా కొనుగోలు చేసే వీలూ ఉంది.
అమెజాన్ ప్రైమ్ లో అద్దెకి లభించే వివిధ జోనర్ల బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే
యాక్షన్ సినిమాలు:
రెసిడెంట్ ఈవిల్: ది ఫైనల్ చాప్టర్, డ్యూన్, డ్యూన్: పార్ట్ 2, మెగ్ 2: ద ట్రెంచ్, టెనెట్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, జాన్ విక్: చాప్టర్ 2, బ్యాటిల్‌షిప్, ది ఈక్వలైజర్, గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్, ది కరాటే కిడ్, టాప్ గన్: మావరిక్ లాంటి యాక్షన్ చిత్రాలని ప్రైమ్ వీడియోలో రెంట్ కి చూడవచ్చు.
కామెడీ సినిమాలు:
ఘోస్ట్ టౌన్, గ్రీస్, లాస్ట్ హాలిడే, జూలాండర్, బ్యాడ్ మామ్స్, బార్బీ, ది హస్ల్ లాంటి అద్భుతమైన కామెడీ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి.
కిడ్స్ అండ్ ఫ్యామిలీ మూవీస్:
హోటల్ ట్రాన్స్‌లేవేనియా, చార్లెట్ వెబ్, స్పై కిడ్స్ 3: గేమ్ ఓవర్, ది స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్ మూవీ, టీన్ టైటాన్స్ గో వర్సెస్ టీన్ టైటాన్స్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, ట్రోల్స్ వరల్డ్ టూర్
ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీస్:
బివిచ్డ్, లాస్ట్ హాలిడే, లైసెన్స్ టు వెడ్, ది ఫైవ్ ఇయర్ ఎంగేజ్‌మెంట్, క్యాచ్ & రిలీజ్
అంతేకాదు, ప్రైమ్ వీడియోలో మీరు సైన్స్ ఫిక్షన్, ఐఎంబీడీ టాప్ రేటెడ్ సినిమాలు, ఆస్కార్ విన్నర్స్, డాక్యుమెంటరీస్, 2000ల కంటే ముందున్న క్లాసిక్స్ వంటి విభిన్న జానర్లు కూడా అద్దెకు తీసుకోవచ్చు.