- Home
- Entertainment
- అశ్లీల చిత్రాలు ప్రసారం చేసే ఉల్లు, ఏఎల్టీటీ యాప్ లపై కేంద్రం దెబ్బ పడింది.. 24 అసభ్యకర ఓటీటీలపై బ్యాన్
అశ్లీల చిత్రాలు ప్రసారం చేసే ఉల్లు, ఏఎల్టీటీ యాప్ లపై కేంద్రం దెబ్బ పడింది.. 24 అసభ్యకర ఓటీటీలపై బ్యాన్
అసభ్యకర కంటెంట్ ప్రసారం చేసే 24 ఓటీటీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ సంస్థల్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ సంస్థల వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసభ్యకర చిత్రాలు ప్రసారం చేసే ఓటీటీ యాప్ లు
ఉల్లు(ULLU), ఏఎల్టీటీ (ALTT) లాంటి ఓటీటీ సంస్థలు విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలని ప్రసారం చేస్తున్నాయి. గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల కంటెంట్ పై హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా ఈ సంస్థలు అశ్లీల దృశ్యాలని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. దీనితో ఇలాంటి ఓటీటీ సంస్థల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
కేంద్రం కొరడా ఝులిపించింది
ఉల్లు, ఏఎల్టీటీ సహా మొత్తం 24 అసభ్యకర కంటెంట్ ని ప్రసారం చేసే యాప్స్ పై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు దేశంలోని మొత్తం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లాయి. దీనితో ఇది ఉల్లు, ఏఎల్టీటీ లాంటి సంస్థలకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.
24 ఓటీటీ సంస్థలు బ్యాన్
కేంద్రం ఝుళిపించిన కొరడాతో మొత్తం 24 ఓటీటీ సంస్థలు బ్యాన్ కానున్నాయి. ఓటీటీ వేదికలపై అసభ్యకరమైన కంటెంట్ ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. దానిని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
సుప్రీం కోర్టులో విచారణ
ఓటీటీ సంస్థలు తాము ప్రసారం చేసే కంటెంట్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఉల్లు, ఏఎల్టీటీ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సంస్థల్లో ప్రసారం అవుతున్న అసభ్యకర కంటెంట్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనితో సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్రం బ్యాన్ చేసిన ఓటీటీ సంస్థలు, డిజిటల్ యాప్స్ ఇవే
ఉల్లు, ఏఎల్టీటీ, నవరస లైట్, హాట్ ఎక్స్ వీఐపీ, దేశీ ఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జ్వాలా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హల్చల్ యాప్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, ట్రైఫ్లిక్స్, మోజ్ ఫ్లిక్స్ ఇలా మొత్తం 24 అసభ్యకర ఓటీటీ సంస్థల్ని కేంద్రం బ్యాన్ చేసింది.