MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను స్టార్ సింగర్ ను చేసిన కమెడియన్ ఎవరు..? అప్పట్లోనే అంత డబ్బు ఇచ్చాడా..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను స్టార్ సింగర్ ను చేసిన కమెడియన్ ఎవరు..? అప్పట్లోనే అంత డబ్బు ఇచ్చాడా..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన గాన గంధర్వుడు. పాటల రికార్డుల రారాజు, తెలుగు కీర్తి కిరీటంలో కలికితురాయి. ఇంత గొప్ప స్థానం సాధించిన ఆయనను ఇండస్ట్రీలో నిలబెట్టింది మాత్రం ఓ కమెడియన్ అని మీకు తెలుసా..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2024, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... తెలుగు జాతి గర్వించదగ్గ పేరు. తరాలు మారినా చెరగని కీర్తి...మరణం తరువాత కూడా వినిపించే గొంతు. ఎన్నియుగాలైనా నిలిచిపోయే పాటలు.. పాటలకు పట్టుబట్టలు కడితే కనిపించే రూపం బాలు. ఆయన సాధించినది ఎవరికీ సాధ్య కాదేమో.. ఎవరు చేయలేరేమో.. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నా.. మంచే జరుగుతంది అనేంతలా అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీబీ. 

అక్కినేని నాగేశ్వరరావు - రామానాయుడు మధ్య గొడవ, ఆ పాట వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తెలుగు నాట పుట్టినా.. తమిళ, కన్నడ జనాలు మావాడంటే మావాడు అని పోటీపడి తమవాడినిచేసుకోవాలి అని చూసిన తెలుగు సంపద బాలసుబ్రహ్మణ్యం. దాదాపు 50 వేల పాటలతో రికార్డ్ లనుబ్రేక్ చేసి.... రికార్డ్ లతో కూడా డాన్స్ చేపించగలిగిన గాత్రం బాలుది. దాదాపు 18 భాషల్లో వేల పాటలకు ప్రాణం పోసిన బాలసుబ్రహ్మణ్యం.. కోవిడ్ వేవ్ లో అభిమానులను శోక సంద్రంలో ముంచి దివంగతులయ్యారు. 
 

శ్రీదేవికి మూడో కూతురు కూడా ఉందా..? ఎవరికీ తెలియని రహస్యం ఎలా బయటపడింది..?

38

గిన్నిస్‌బుక్ రికార్డును సొంతం చేసుకున్న గాన‌గంధ‌ర్వుడు.. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. ఈయ‌న ఎదిగిన తీరు అంద‌రికీ ఒక పాఠం. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయ‌న చాలా క‌ష్టాలు ప‌డి.. సినిమా రంగంపై ఆస‌క్తితో ముందుకు సాగారు. అప్పట్లో ఇప్పటి మాదిరిగా టీవీషోలు పెట్టి ప్రోత్సహించినవారు లేరు. అవకాశాలు వెతుక్కుంటూ ప్రయాణించాల్సిందే. అటువంటి టైమ్ లో.. ఎంతో శ్రమించి.. అవకాశం సాధించిన తనేంటో నిరూపించుకున్నారు బాలు. ఇక ఇంతలా ఎదిగిన ఆయనకు మొదటి అవకాశం ఇచ్చింది ఓ కమెడియన్ అని మీకు తెలుసా..? 

మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..

48

ఇండస్ట్రీలో ఘంట‌సాల లాంటి దిగ్గజాలు.. తుఫానులా దూసుకుపోతున్న రోజులవి.. ఆయనన్ను దాటి ఎవరు ముందుకు వచ్చి కొత్తవారికి అవకాశాలు ఇవ్వలేదు. అంత సాహసం చేసేవారు కాదు. ఘంటసాల తరువాత  ఏఎం రాజా, పిఠాపురం నాగేశ్వ‌ర‌రావు, పిబి శ్రీనివాస్ లాంటివారు గాయకులుగా ఉన్నారు.  ఇంత పెద్ద సంగీత సామ్రాజ్యంలో ఘంట‌సాల అంటేనే.. సంగీత ద‌ర్శ‌కులు ముందుకు వ‌చ్చేవారు. అంత బలమైన గాలికి కూడా ఎదురెల్లి నిలుచున్నాడు బాలు.  అలాంటి రోజుల్లో ఇండ‌స్ట్రీ మెట్లెక్కిన‌ బాలసుబ్రహ్మణ్యంకు.. మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం స్టార్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ హీరో ప‌ద్మ‌నాభం. 

58

ఇండస్ట్రీకి ఖాళీ చేతులతో వచ్చి.. గొప్పగా సాధించి కోటీశ్వరుడైన పద్మనాభం.. తనలాగే ఇండస్ట్రీకి వచ్చినవారిని హక్కున చేర్చుకున్నాడు. సినిమాలు నిర్మించి కొత్తవారికి అవకాశాలు ఇచ్చేవారట. ఆయనే హీరోగా నటిస్తూ.. ఆయనే నిర్మించుకున్న సినిమాలకు కొత్తవారిని ఎంక్రేజ్ చసేవారట పద్మనాభం. ఇందులో భాగంగా.. ఆయ‌న సొంత బ్యాన‌ర్ పెట్టుకుని.. తీసిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో చాలామంది కొత్తవారికి అవ‌కాశాలు క‌ల్పించారు. ఇందులో గాయకులు కూడా ఉన్నారు. 

68

ఆ కొత్త బ్యాచ్ లో ఉన్న గాయకులలో బాలసుబ్రహ్మణ్యం కూడా ఒకరు. అయితే బాలు కొత్తవారు కాబట్టి.. పద్మనాభం ఆయన్నుతక్కువగా చూడలేదట. చాలా మర్యదగా ప్రవర్తించేవారట. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాలుకి అదృష్టం వరించిందనే చెప్పాలి. అప్పట్లో ఘంటసాల లాంటిస్టార్ సింగర్ పాటలకు 500 వరకూ తీసుకుంటే.. మొదటి పాటకే బాలు 300 తీసుకున్నారంట. 

78

అసలు కొత్త గాయకులకు ఇంత ఇచ్చేవారు కాదట అప్పట్లో.. తిండిపెట్టి.. పదో ఇరవైయో చేతిలో పెట్టేవారట. కాని బాలుకి అలా జరగలేదు..  ఈలెక్కన బాలూని అప్పుడే స్టార్ సింగర్ చేసింది పద్మనాభంమే. అంతే కాదు అలా నిర్విరామంగా పాటలు పాడిన బాలు.. 90స్ లోకి ఎంటర్ అవ్వడంతోనే పాటకు 3 లక్షలు తీసుకున్నారంటే.. అప్పట్లో బాలు డిమాండ్ఎంత స్పీడ్ గా పెరిగింది అనేది అర్ధం అవుతుంది.

88

 ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాల‌ని చెప్పేవార‌ట‌. అంతేకాదు.. నిరంత‌ర శిక్ష‌ణ‌తో ఎన్నిమెట్ల‌యినా.. ఎక్కొచ్చ‌ని చెప్పేవార‌ట‌. ఇదే త‌ర్వాత‌.. కాలంలో బాలుకు ఉప‌యోగ‌ప‌డింది. ఏది ఏమైనా.. బాలు మనమధ్య లేరు. కోవిడ్ మహమ్మారి ఆయన్ను సంగీత ప్రియులకుదూరంచేసింది. అయినా సరే ఆయన గాత్రం ఈ భూమి మీద మనిషి ఉన్నంతవరకూ మారు మోగుతూనే ఉంటుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved