- Home
- Entertainment
- Chiranjeevi: సునీల్ బతికి ఉండడానికి చిరంజీవి కారణమని తెలుసా.? షాకింగ్ విషయాన్ని తెలిపిన చిరు
Chiranjeevi: సునీల్ బతికి ఉండడానికి చిరంజీవి కారణమని తెలుసా.? షాకింగ్ విషయాన్ని తెలిపిన చిరు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార విప్లవం పెరిగింది. గతంలో ఎప్పుడో జరిగిన ఆసక్తికర విషయాలు ఈ తరానికి తెలుస్తాయి. అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..

మెగాస్టార్ చిరంజీవిని భారతీయ సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృషి, అసమాన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే చిరు రియల్ లైఫ్‌లో చాలా వ్యాపకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి డ్రైవింగ్. చిరుకు కార్లు అంటే ఎంతో పిచ్చి. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కార్లు అంటే ఎంత ఇష్టమో చెప్పారు.
megastar chiranjeevi
అప్పట్లోనే చిరు ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక కారు ఉండేదని చిరు చెప్పుకొచ్చారు. దానికి ఆయన చెప్పిన కారణం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 'జూబ్లీహిల్స్ పట్టణానికి దూరంగా ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అందుకే ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయి' అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఒకప్పుడు జూబ్లీహిల్స్ ఎంత దూరంగా విసిరేసినట్లు ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రూ. 11 కోట్ల విలువైన రోల్స్ రాయల్స్ కారును ఉపయోగిస్తున్న చిరుకు ఒకప్పుడు మాత్రం ల్యాండ్ క్రూజర్ చాలా ఇష్టం ఉండేదంటా. అత్యంత భద్రత ఉండే ఎస్‌యూవీ కారు కావడంతో దానికి ఆయన మొగ్గు చూపారంటా.
తెలిసిన ఓ స్నేహితుడు ల్యాండ్ క్రూయిజ్‌ను కొనుగోలు చేస్తే కొన్ని రోజులు వాడుకొని ఇస్తానని ఆ కారును తీసుకున్నారంటా చిరు. అప్పట్లోనే ఈ కారులో ఎన్నో రకాల భద్రతా ఫీచర్లు ఉండేవి. ఎల్‌ఈడీ డ్యాష్ బోర్డ్, బ్యాక్ కెమెరా వంటి ఫీచర్స్ ఉండేవి. జీవితంలో ల్యాండ్ క్రూయిజ్ కచ్చితంగా కొంటానని ఆ సమయంలో చిరు తెలిపారు. ఇప్పుడు అలాంటివి 100 కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు.
సునీల్ బతికి ఉన్నాడంటే చిరునే కారణం:
ఇదిలా ఉండగా, ల్యాండ్ క్రూయిజర్‌కు సంబంధించిన ఓ సంఘటనను చిరు ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సమయంలో ఈ కారును హీరో శ్రీకాంత్ కొనుగోలు చేశారంటా. అయితే ఓసారి సునీల్ తన సొంతూరుకు వెళ్లేందుకు శ్రీకాంత్ కారు తీసుకెళ్లారంటా. సునీల్ కారులో వెళ్తున్నప్పుడు ఘోర ప్రమాదం జరిగిందంటా. కారు పూర్తిగా ధ్వంసమయినప్పటికీ, అందులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీనికి ప్రధాన కారణం ల్యాండ్ క్రూయిజర్‌లో ఉన్న భద్రతా ఫీచర్లే అని చిరు చెప్పారు. కాగా ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత చిరును కలిసిన సునీల్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారంటా.
కారులో ప్రయాణం మొదలు పెట్టిన కాసేపటికి హైవేపైకి ఎక్కగానే డ్రైవర్‌తో మాట్లాడుతూ.. చిరంజీవి గారు కచ్చితంగా సీల్ట్ బెల్ట్ ధరించమని చెబుతుంటారని చెప్పి ఇద్దరూ బెల్ట్ వేసుకున్నారంటా. అలా బెల్ట్ వేసుకున్న కాసేపటికే కారు ప్రమాదానికి గురైనట్లు చెప్పాడంటా. 'మేము బతికి బయటపడ్డామంటే దానికి మీరు చెప్పిన సలహానే కారణం' అని చిరుతో సునీల్ పలుసార్లు చెప్పారంటా. ఇలా చిరు అప్పట్లో పంచుకున్న ఆసక్తికర విషయాలను ప్రస్తుతం ఫ్యాన్స్ మళ్లీ వైరల్ చేస్తున్నారు.