MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రిష తో జంటగా నటించడం వల్ల స్టార్ గా మారిన హీరో ఎవరో మీకు తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?

త్రిష తో జంటగా నటించడం వల్ల స్టార్ గా మారిన హీరో ఎవరో మీకు తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?

కొన్ని కొన్ని జోడీలు వెండితెరకు కలిసివస్తాయి.. హీరోల వల్ల హీరోయిన్లు, హీరోయిన్ల వల్ల హీరోలు కూడా స్టార్ డమ్ ను సాధిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ హీరోయిన్ త్రిష తో నటించడం వల్ల ఓ హీరోకు తెలుగులో స్టార్ డమ్ వచ్చిందని మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2026, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వర్షం సినిమాతో స్టార్ గా మారిన త్రిష..
Image Credit : x/trisha fans page

వర్షం సినిమాతో స్టార్ గా మారిన త్రిష..

వర్షం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ సంచలనం సృష్టించింది హీరోయిన్ త్రిష. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు , తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన త్రిష.. ఈక్రమంలో స్టార్ హీరోలెందరితోనో నటించి మెప్పించింది. తెలుగులో ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ సరన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. తమిళంలో విజయ్, అజిత్, సూర్య, విశాల్ లాంటి హీరోల సరసన అదరగొట్టింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష...
Image Credit : Instagram/ Trisha

20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష...

సుధీర్ఘకాలం ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు కావడం విశేషం. ఇంతకాలం కెరీర్‌లో ఆమె అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోలతో జోడీగా కనిపించారు. ఇటీవల కాలంలో కొన్ని వివాదాల్లో ఆమె పేరు వినిపించినప్పటికీ, ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరోల సరసన నటించేందుకు త్రిషను ఓన్లీ ఆప్షన్ గా భావిస్తున్నారు. సీనియర్ హీరోల కోసం దర్శకులు ఎక్కువగా త్రిషనే సంప్రదిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

Related image1
Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !
Related image2
Trisha Krishnan: విజయ్ దళపతి లైఫ్‌లో కలకలం రేపిన త్రిష.. నటించిన టాప్ 5 బ్లాక్‌ బస్టర్ సినిమాలు
34
త్రిష తో సినిమా వల్ల స్టార్ హీరోగా మారిన సిద్ధార్థ్
Image Credit : Asianet News

త్రిష తో సినిమా వల్ల స్టార్ హీరోగా మారిన సిద్ధార్థ్

త్రిష కెరీర్ ప్రారంభ దశలో ఆమెతో కలిసి సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగిన నటుల్లో సిద్ధార్థ్ ఒకరు. ‘యువ’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడంతో మంచి స్నేహితులుగా మారారు. అనంతరం ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. సిద్ధార్థ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదల సమయంలో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

44
ప్రస్తుతం సిద్ధుకి కలిసిరాని కాలం..
Image Credit : Asianet News

ప్రస్తుతం సిద్ధుకి కలిసిరాని కాలం..

అయితే త్రిష హీరోయిన్‌గా నటించడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చివరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ విజయంతో సిద్ధార్థ్ కూడా తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అనంతరం ఆయన కొన్ని సినిమాలతో విజయాలను సాధించి సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో మార్కెట్‌లో పెద్దగా కనిపించడంలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాక్ ఇచ్చిన దశరథ- కొత్త సీఈఓగా దీప- పారుపై కార్తీక్ డౌట్
Recommended image3
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Related Stories
Recommended image1
Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !
Recommended image2
Trisha Krishnan: విజయ్ దళపతి లైఫ్‌లో కలకలం రేపిన త్రిష.. నటించిన టాప్ 5 బ్లాక్‌ బస్టర్ సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved