మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టిన నిర్మాత, కారణం ఏంటో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నలా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి, చాలా చిన్న స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అన్ని కష్టాలకు తట్టుకుని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారు మెగాస్టార్.

టాలీవుడ్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకపోవడమే కాదు, వారసత్వం లేకపోయినా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
అంతే కాదు వారిలో చాలామంది స్టార్లుగా మారారు. టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు. సాధారణ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి విలన్ గా, హీరోగా, సుప్రీమ్ స్టార్ గా, మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. అంతే కాదు ఇండస్ట్రీలో తన వారసత్వాన్ని నింపి, మెగా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు.
మెగా ఫ్యామిలీ నుంచి అరడజనకు పైగా స్టార్ హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గరు పాన్ ఇండియా హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇలా చిరంజీవి ఒక్కొ మెట్టు ఎక్కుతూ ఈస్థాయికి వచ్చారు. ఇక 70 ఏళ్ల వయసుకు అడుగు దూరంలో ఉన్న చిరంజీవి, ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. యాక్టింగ్ లో కాని ,డాన్స్ విషయంలో కాని ఏమాత్రం తగ్గడం లేదు. ఫిట్ నెస్ పోకుండా చూసుకుంటూ ఫిల్మ్ కెరీర్ ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు చిరంజీవి.
ఇక స్టార్ గా ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు చిరంజీవి. అప్పట్లో షూటింగ్స్ అంటే చాలా క్రమశిక్షణతో నడిచేవి. ఎవరైనా సరే టైమ్ కు షూటింగ్ కు వచ్చేవారట. స్టార్ హీరోలు అయితే పక్కాగా టైమింగ్ మెయింటేన్ చేసేవారట. స్టార్ హీరోలు నిర్మాతలంటే భయపడేవారు. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ అంటే గౌరవం ఉండేది. ఈక్రమంలో ఓ ప్రొడ్యూసర్ మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సీనియర్ నటి తులసి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఆ నిర్మాత పేరు మాత్రం ఆమె చెప్పలేదు. కోతల రాయుడు సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇది జరిగిందని ఆమె అన్నారు. చిరంజీవి నా అన్నయ్య, దేవుడిచ్చిన అన్నయ్య . చాలా డెడికేషన్ తో పనిచేసే వారు. మరి షూటింగ్ కు లేట్ గా వచ్చాడనో ఏమో తెలియదు కానీ చిరంజీవిని అలా ఎండలోనే ఉంచారు. ఆయన కూడా అలానే నిల్చుండిపోయారు అని తులసి అన్నారు.
చిరంజీవి తన కెరీర్ లో ఇలాంటివి ఎన్నో చూశారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కాని ఈమూవీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీమ్. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు చిరు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈమూవీ రూపొందుతోంది.