- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్య గురించి ఆలోచిస్తూ కుమిలిపోతున్న హిమ.. అసలు నిజం తెలుసుకున్న శోభ!
Karthika Deepam: శౌర్య గురించి ఆలోచిస్తూ కుమిలిపోతున్న హిమ.. అసలు నిజం తెలుసుకున్న శోభ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karhika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ(hima), జ్వాలా అన్న మాటలను గుర్తు తెచ్చుకొని జ్వాలా కీ ఫోన్ చేసి ఎవరి బెదిరించి ఉంటారు, అలా ఫోన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సౌర్య దగ్గరికి మాట్లాడాలి అనుకుంటు ఉంటుంది. మరొకవైపు శోభ(shobha) లోన్ తీసుకుంటూ ఉంటుంది. హాస్పిటల్ పెట్టడానికి మెయింటైన్ చేయడానికి లోన్ తీసుకుంటుంది.
అయితే ఆ అప్పులు తీరాలంటే ఎలా అయినా నిరుపమ్ (Nirupam)ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది శోభ. ఇంతలో అక్కడికి పేషెంట్ వచ్చి మా అమ్మగారికి బ్లడ్ లేదు, సమయానికి దొరకలేదు అని అనడంతో ఇంతకుముందు మీ అమ్మగారికి బ్లడ్ ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది శోభ. అప్పుడు ఆమె ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ హిమ(hima) గారు ఇచ్చారు అని అంటుంది.
అప్పుడు హిమ కు క్యాన్సర్ అని చెప్పింది కదా మరి బ్లడ్ ఎలా ఇస్తుంది అని అనుకుంటూ ఉంటుంది శోభ. మరొకవైపు జ్వాలా(jwala) జరిగిన విషయం గురించి తలచుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు పేషెంట్ కి బ్లడ్ ఇవ్వడం కోసం శోభ(shobha) హాస్పిటల్ కి వస్తుంది. మరొకవైపు నిరుపమ్ దగ్గరికి జ్వాలా వెళ్తుంది.
అప్పుడు జరిగిన దానికి సారీ చెబుతుంది. అంతేకాకుండా నిరుపమ్ (Nirupam)కి ఐ లవ్ యు చెప్తుంది. కానీ తీరా చూస్తే అక్కడ నిరుపమ్ లేకపోవడంతో షాక్ అవుతుంది జ్వాలా. మరొకవైపు హిమ బ్లడ్ ఇచ్చి వెళ్తుండగా శోభ(shobha) ఎదురుపడి హిమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. దాంతో హిమ అక్కడి నుంచి టెన్షన్ తో వెళ్ళిపోతుంది.
ఇంటికి వెళ్లిన సౌర్య (sourya)ఫోటో చూసి బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది. ఇక జ్వాలా ఇంట్లో అద్దం ముందు నిలబడి తనను తాను పొగుడుతూ ఉంటుంది. నిరుపమ్(Nirupam)జ్వాలా అన్న మాటలను తలచుకుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ ను గుడికి తీసుకొని వెళ్లి బలవంతంగా తాళి కడతాడు. అది చూసి జ్వాలా షాక్ అవుతుంది.