క్రేజీ నటితో టాలీవుడ్ స్టార్ హీరో ప్రవర్తన దారుణం, ఓపెన్ గా తండ్రికే చెప్పేశాడు..ఆయన రియాక్షన్ ఏంటో తెలుసా
సినిమా అన్నాక హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ సహజం. అది శృతి మించితే లేనిపోని రూమర్స్ మొదలవుతాయి. ఇద్దరి గురించి పుకార్లు షికార్లు చేస్తాయి. అయితే ఇలాంటి రూమర్స్ బారిన పడకుండా వివాదాలకు దూరంగా కెరీర్ ని నడిపించిన హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు.
Tabu
సినిమా అన్నాక హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ సహజం. అది శృతి మించితే లేనిపోని రూమర్స్ మొదలవుతాయి. ఇద్దరి గురించి పుకార్లు షికార్లు చేస్తాయి. అయితే ఇలాంటి రూమర్స్ బారిన పడకుండా వివాదాలకు దూరంగా కెరీర్ ని నడిపించిన హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు.
వెంకటేష్ కి టాలీవుడ్ లో జెంటిల్ మాన్ అనే గుర్తింపు ఉంది. వెంకటేష్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. అయితే సినిమాల్లో హీరో తప్పకుండా సన్నివేశానికి తగ్గట్లుగా హీరోయిన్ తో రొమాన్స్ చేయాలి. డైరెక్టర్ చెప్పినట్లు ప్రవర్తించాలి.
విక్టరీ వెంకటేష్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రాల్లో కూలి నంబర్ 1 కూడా ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్, గ్లామరస్ హీరోయిన్ టబు జంటగా నటించారు. తెలుగులో టబుకి ఇదే డెబ్యూ చిత్రం. ఈ చిత్రంలో సాంగ్స్ ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట.
వెంకటేష్ తండ్రి నిర్మాత డి రామానాయుడు ఈ చిత్రాన్ని రిలీజ్ కి ముందు చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ షో ద్వారా ప్రదర్శించారు. ఈ చిత్రానికి ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ తండ్రి కెఏ మార్తాండ్ పనిచేశారు. తండ్రి తో పాటు అప్పుడప్పుడే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ నేర్చుకుంటున్నారు. స్పెషల్ షో పూర్తయ్యాక రామానాయుడు అందరికీ స్లిప్పులు ఇచ్చి.. సినిమాలో ఏం బావుంది.. ఏమి బాగాలేదు అని నిజాయతీగా రాయమని చెప్పారట.
మార్తాండ్ కె వెంకటేష్ తన అభిప్రాయాన్ని రాసి ఇచ్చారు. ఆ తర్వాత రామానాయుడు మార్తాండ్ కె వెంకటేష్ ని ప్రత్యేకంగా పిలిచి అడిగారు. నీకు సినిమాలో ఏమి నచ్చలేదు అని చెప్పమన్నారట. మార్తాండ్.. భయపడకుండా హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సీన్లు నాకు నచ్చలేదు. వెంకటేష్.. టబుతో ప్రవర్తించిన విధానం ఏమాత్రం బాగాలేదు. ముఖ్యంగా ఆమెకి మత్తుమందు ఇచ్చి లైంగికంగా ప్రవర్తించడం లాంటి సన్నివేశాలు ఎందుకు అని ప్రశ్నించారట.
ఒక అమ్మాయితో హీరో అలా ప్రవర్తిస్తే ఆడియన్స్ లో నెగిటివ్ ఫీలింగ్ వెళుతుంది అని చెప్పారట.దీనితో నిజాయతీగా తన అభిప్రాయాన్ని చెప్పిన మార్తాండ్ వెంకటేష్ ని రామానాయుడు అభినందించారట. అప్పటి నుంచి ప్రతి చిత్రానికి రామానాయుడు మార్తాండ్ అభిప్రాయాన్ని తెలుసుకునేవారట.