- Home
- Entertainment
- Purna Glamorous Photos: ట్రెండీ వేర్ లో సూపర్ స్టైలిష్ గా... మెస్మరైజ్ చేస్తున్న ఢీ పూర్ణ గ్లామర్
Purna Glamorous Photos: ట్రెండీ వేర్ లో సూపర్ స్టైలిష్ గా... మెస్మరైజ్ చేస్తున్న ఢీ పూర్ణ గ్లామర్
మలయాళ బ్యూటీ పూర్ణ (Purna)సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నారు. ఆమె వరుస ఫోటో షూట్స్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. పూర్ణ అందాల దాడి కుర్రకారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తుంది పూర్ణ. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, డిజిటల్ సిరీస్లలో నటిస్తున్నారు. హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా... విభిన్న పాత్రలు చేస్తూ నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, డిజిటల్ సిరీస్లలో నటిస్తున్నారు. హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా... విభిన్న పాత్రలు చేస్తూ నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలలో నటిస్తున్న పూర్ణ, కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ మధ్య ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న పూర్ణను ఆలీ... మీకు రావలసినంత గుర్తింపు రాలేదు? కారణం ఏమిటీ? అని అడుగగా.. నేను కొన్ని విషయాలకు నో చెప్పాను. దాని వలన చాలా ఆఫర్స్ కోల్పోయాను. సినిమాపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం కూడా కారణం కావచ్చని వివరణ ఇచ్చింది.
తాజాగా ఓటిటి రిలీజ్ 3 రోజెస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తోపాటు కామెడీ పండించారు. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా, పూర్ణ రోల్ తీర్చిదిద్దారు.
ఇప్పటికే పూర్ణ పలు వెబ్ సిరీస్లు, డిజిటల్ చిత్రాలలో నటించారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ వరుస ఆఫర్స్ పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.
కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.
మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి ప్రియమణితో కలిసి పూర్ణ చేసే అల్లరి మామూలుగా ఉండదు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి.
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 (Dhrushyam 2)తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేశారు. ఆమె లేడీ లాయర్ గా కోర్టు రూమ్ సన్నివేశాలలో దుమ్ముదులిపారు. దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది.
అలాగే బాలకృష్ణ (Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. ప్రభుత్వ అధికారి పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటించగా... డిసెంబర్ 4న విడుదలైన అఖండ భారీ వసూళ్లు రాబడుతుంది.
Also read Adah Sharma: అదరహో ఆదా శర్మ.. నాభి అందాలతో మతి పోగొడుతుంది
Also read అందంలో తండ్రికి తగ్గ కూతురు... క్యూట్ ఫోటో షూట్ తో మనసులు దోచేస్తున్న మహేష్ గారాల పట్టి సితార