నిర్మాతలకు విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ..
తమిళనాట హీరో విశాల్ వివాదం ముదిరి పాకాన పడుతోంది. నన్నేం చేయలేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ..విశాల్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
vishal
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో విశాల్. ఆయన తెలుగు మూలాలు ఉన్న నటుడు కావడంతో విశాల్ ప్రతీ తమిళసినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి. తమిళంలో స్టార్ హీరోగా మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో మెయిన్ పిల్లర్ లా వ్యవహరిస్తున్నాడు విశాల్. అయితే మొదట్నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో నిలుస్తాడు విశాల్.
vishal
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా..నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా..తమిళనాట ఏ ఉపద్రవం వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్పందించే మొదటి వ్యక్తిగా.. విశాల్ కు గుర్తింపు ఉంది. అయితే తెలగులో కూడా విశాల్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తుంటాయి.
టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?
ఇక విశాల్ ఇప్పటికే చాలా వివాదాల్లో ఇబ్బందులు పడ్డారు. ఆయన నిర్మాత మండలి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా తెలుగు వాడు అన్న కారణంగా విభేదించినవారు చాలామంది ఉ న్నారు. ఇక ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా వివాదం అవుతుంటాయి. కాగా రీసెంట్ గా విశాల్ చేసిన కామెంట్స్ తమిలనాట చిచ్చు రేపాయి. ఆయన ఏమన్నారంటే తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని విమర్శలు చేసారు.
బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
విశాల్ చేసిన వ్యాక్యలు పెద్ద వివాదాన్ని రేపాయి. అది రోజు రోజుకు పెద్దది అవ్వడంతో, అలాగే విశాల్ నిర్మాత సంఘంలో ఉన్నప్పుడు నిధులు అక్రమంగా వినియోగించారని ఆరోపిస్తూ విశాల్ తో నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయొద్దంటూ తమిళ నిర్మాతల సంఘం భావించింది. నిర్మాత కథిరేసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో విశాల్ తన సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. పనిలో పనిగా నిర్మాత కథిరేసన్ తో పాటు.. తనను వ్యతిరేకిస్తున్నవారికి వార్నింగ్ కూడా ఇచ్చారు.
విశాల్ వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు. మిస్టర్ కతిరేసన్.. నేను నిర్మాతగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు.. మీతో, టీమ్, అందరు వ్యక్తులు కలిసి తీసుకున్నవే.. అవి నా ఒక్కడి నిర్ణయాలు కావు అని మీకు తెలీదా. విద్య, వైద్య, బీమా, సీనియర్ నిర్మాతల కుటుంబ సంక్షేమం కోసం నిధులు ఉపయోగించబడ్డాయని మీకు తెలియదా. మీ ఉద్యోగాలను సరిగ్గా చేయండి, పరిశ్రమ కోసం చేయడానికి చాలా ఉంది. డబల్ ట్యాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ చార్జీలు.. ఇలా చాలా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి.
Vishal
అవన్నీ వదిలేసి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అని అన్నారు విశాల్. ఇక తనను సినిమాలు చేయకుండా ఆపాలని వారు ప్రయత్నిస్తున్నారని.. అది జరగే అవకాశం లేదున్నారు. నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. అసలు చెప్పాలంటే.. సినిమాలు తీయని నిర్మాతలు మీరు. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి అని స్ట్రాంగ్ ట్వీట్ చేసాడు విశాల్.