MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?

టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?

టాలీవుడ్ లో వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడుతున్న రామ్ పోతినేని..హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాడు. అదేంటి హిందీ సినిమాలే చేయని రామ్.. హిందీలో  హిట్లు కొట్టడమేంటి అని చూస్తున్నారా..?అయితే అసలు విషయం ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 27 2024, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రామ్ పోతినేని హిట్లు ప్లాప్ అన్న సంబధం లేకుండా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.  రామ్ పోతినేని  వరుస ప్లాప్ లతో కాపురం చేస్తున్నాడు. డిఫరెంట్ గా ట్రై చేసినా.. వర్కౌట్ అవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం పాకులాడిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అది సాధించగలిగాడు. అయితే ఆతరువాత ఆ ఇమేజ్ ను కాపాడుకోలేక పోయాడు. ఈక్రమంలోనే అతను చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. 

బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ram Pothineni

Ram Pothineni

మాస్ ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కోసం రామ్ చేసిన రెడ్, వారియర్ లాంటి సినిమాలు కనిపించకుండా పోయాయి. ఈక్రమంలోనే రామ్ పోతినేని బోయపాటి డైరెక్షన్ లో స్కందతో  భారీ యాక్షన్ మూవీ ట్రై చేశాడు.... ఈ సినిమాతో ఊరమాస్ ఇమేజ్ ను కొట్టేయాలని చూశాడు. కాని రామ్ ప్లాన్ ప్లాప్ అయ్యింది. సినిమా కాస్త డిజాస్టర్ అయ్యింది. బోయపాటి మార్క్ యాక్షన్ తో రూపొందిన ఈమూవీ 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. 60 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయిందట. 
 

36

ఇక ఇప్పుడు  రామ్ మళ్ళీ పూరీ జగన్నాథ్ నే నమ్ముకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా పడితేనే మళ్ళీ తాను పైకి లేస్తానన్న నమ్మకంతో ఉన్నాడు రామ్. అందుకు ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో రాబోతున్నాడు రామ్. ఈసినిమాకు సీక్వెల్ ను కూడా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అటు పూరి కూడా లైగర్ తో పెద్ద దెబ్బ తిని ఉన్నాడు. అందుకే  ఈసినిమాపైనే ఇద్దరు నమ్మకంతో ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ గట్టెక్కిస్తుందనుకుంటున్నారు. 
 

46

కాగా రామ్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో డిజాస్టర్లు చూస్తుంటే.. బాలీవుడ్ లో మాత్రం భారీగా ఫ్యాన్స్ ను సాధిస్తున్నాడు. రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాడు. అదెలాగా అని మీకు డౌట్ రావచ్చు. య్యూట్యూబ్ ద్వారా ఈ హీరో మిలియన్ల రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకూ ఏ టాలీవుడ్ హీరో సాధించలేనిది రామ్ పోతినేని సాధించి చూపించాడు. మన హీరోల డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ లో మస్త్ క్రేజ్ ఉంది. అందులో రామ్ సినిమాలంటే అక్కడి జనం పడి చచ్చిపోతున్నారు. 
 

56

ఈక్రమంలో.. ఉస్తాద్ రామ్ పోతినేనికి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ ఉంది. రామ్ ఇంతవరకు హిందీలో  ఒక్క  సినిమా కూడా చేయలేదు. కానీ రామ్ నటించిన తెలుగు సినిమాలన్నీ  హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. . నార్త్ సినీ ప్రియుల నుంచి రామ్ సినిమాలకు భారీగా స్పందన రావడంతో పాటు మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా వస్తున్నాయి. 

66

టాలీవుడ్ లో ఏ ఇతర హీరోల సినిమాల‌తో  కంపేర్ చేయలేనంతగా..  భారీగా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి.ఇప్పటి వరకూ రామ్ కు సబంధించిన  9 సినిమాలు హిందీ వెర్ష‌న్ లో 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను చాలా సునాయాసంగా దాటాయి. అవేమిటంటే.. ఇస్మార్ట్ శంక‌ర్‌, స్కంద‌, హలో గురు ప్రేమ కోసమే, వున్నది ఒకటే జిందగీ, పండగ చేస్కో, గణేష్, హైపర్, నేను శైలజా వంటి సినిమాలు ఉన్నాయి. హిందీలో ఇవి 100 మిలియన్ వ్యూస్ ని దాటేశాయి. కొన్ని సినిమాలైతే మూడు వంద‌లు, నాలుగు వంద‌లు, ఐదు వంద‌ల‌ మిలియన్ మార్క్ ని కూడా అందుకుని సంచ‌ల‌నం రేపుతున్నాయి.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved