MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhurandhar 2 Collection Day 2: 200 కోట్లు కొల్ల గొట్టిన ధురంధర్ 2, రణవీర్ సింగ్ మూవీ రెండో రోజు వసూళ్లు ఎంత?

Dhurandhar 2 Collection Day 2: 200 కోట్లు కొల్ల గొట్టిన ధురంధర్ 2, రణవీర్ సింగ్ మూవీ రెండో రోజు వసూళ్లు ఎంత?

ఇండియన్ సినిమాను ఊపు ఊపేస్తోంది ధురంధర్ 2 సినిమా. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రచ్చ చేస్తోంది. రెండో రోజు ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజులు కలిపి ఎంత సాధించిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 21 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 రచ్చ..
Image Credit : Asianet News

బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 రచ్చ..

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్: ది రివెంజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది. థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. రెండో రోజు కూడా ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. 

ప్రాథమిక అంచనాల ప్రకారం శుక్రవారం ఈ చిత్రం రూ. 74.70 నుంచి 76 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో రెండు రోజుల (పెయిడ్ ప్రివ్యూలు సహా) మొత్తం వసూళ్లు రూ. 200 కోట్ల మార్క్‌ను దాటాయని సమాచారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ధురంధర్ 2 కలెక్షన్లు లెక్కలు..
Image Credit : Asianet News

ధురంధర్ 2 కలెక్షన్లు లెక్కలు..

సాక్నిల్క్ ట్రేడ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఈ సినిమా బుధవారం జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ. 43 కోట్లు, గురువారం రూ. 103 కోట్లు, శుక్రవారం సుమారు రూ. 74.70-76 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 220.7 నుంచి 222 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. 

దేశీయ స్థాయిలో ఈ చిత్రం గ్రాస్ కలెక్షన్ సుమారు రూ. 260.78 కోట్లకు చేరుకుంది. భారతదేశవ్యాప్తంగా 20,125 షోలలో విడుదలైన ధురంధర్ ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో భారీ స్పందనను పొందుతోంది. హిందీ వెర్షన్‌కు 63 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం.

Related Articles

Related image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?
Related image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
35
సౌత్ మార్కెట్ లో ధురంధర్ పరిస్థితి..
Image Credit : instagram

సౌత్ మార్కెట్ లో ధురంధర్ పరిస్థితి..

ఇక సౌత్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ధురంధర్ వసూళ్లు తక్కువగానే ఉన్నాయి. డబ్బింగ్ వెర్షన్లు ఎక్కువగా విడుదల కాకపోవడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. రెండో రోజు తెలుగులో రూ. 0.76 కోట్లు, తమిళంలో రూ. 0.24 కోట్లు, మలయాళంలో రూ. 0.01 కోట్లు, కన్నడలో రూ. 0.02 కోట్లు మాత్రమే వసూళ్లు నమోదు అయ్యాయి.

45
రంజాన్ వీకెండ్ కలిసి వస్తుందా?
Image Credit : Asianet News

రంజాన్ వీకెండ్ కలిసి వస్తుందా?

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈద్ వీకెండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత వేగంగా వసూళ్లు పెంచుకునే అవకాశముంది. శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో.. ఈ రెండు రోజుల్లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విధంగా ఓపెనింగ్ వీకెండ్ ముగిసే సమయానికి దేశీయంగా రూ. 450 నుంచి 500 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

55
ఒక గూఢచారి సాహసం.. ధురంధర్
Image Credit : instagram

ఒక గూఢచారి సాహసం.. ధురంధర్

‘ధురంధర్: ది రివెంజ్’ ఒక హై-స్టేక్స్ జియోపాలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రణవీర్ సింగ్ ‘హమ్‌జా అలీ మజారీ’ అనే భారతీయ గూఢచారి పాత్రలో నటించారు. పాకిస్తాన్‌లోని టెర్రర్-క్రిమినల్ నెట్‌వర్క్‌లో చొరబడే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి కీలక పాత్రలు పోషించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?
Recommended image2
Samantha: భర్త రాజ్‌ నిడిమోరు గురించి ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన సమంత.. మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?
Recommended image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved