MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 10 Heroines: కోలుకున్న రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?

Top 10 Heroines: కోలుకున్న రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?

ఓర్మాక్స్ మీడియా తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇండియాలోనే టాప్‌ 10 హీరోయిన్ల జాబితాని ప్రకటించింది. ఈ సారి రష్మిక, కాజల్, తమన్నా మెరుగుపడ్డారు. కానీ త్రిష, శ్రీలీల డౌన్‌ అయ్యారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 21 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఇండియా టాప్‌ 10 హీరోయిన్లు
Image Credit : our own

ఇండియా టాప్‌ 10 హీరోయిన్లు

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోని టాప్‌ 10 హీరోలే కాదు, హీరోయిన్లకి సంబంధించిన జాబితాని కూడా విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే హీరోల జాబితా రాగా, ఇప్పుడు హీరోయిన్ల జాబితా కూడా వచ్చింది. టాప్‌ 10 హీరోయిన్ల లిస్ట్ చూస్తే, ఇందులో రష్మిక మందన్నా, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ఒక్కో స్థానం మెరుగుపడ్డారు. అదే సమయంలో త్రిష, శ్రీలీల ఒక్కో స్థానం పడిపోయారు. మిగిలిన హీరోయిన్లు అదే స్థానాల్లో ఉన్నారు. మరి మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? చివర్లో ఎవరు ఉన్నారనేది చూద్దాం.

210
1.సమంత
Image Credit : youtube/@aha

1.సమంత

కొన్ని నెలలుగా మొదటి స్థానం లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తోన్న సమంతకే దక్కుతుంది. ఆమె తిరుగులేని స్టార్‌ డమ్‌తో రాణిస్తోంది. ఫిబ్రవరిలో కూడా ఆమెదే ఫస్ట్ ప్లేస్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంత `మా ఇంటి బంగారం` సినిమాలో నటిస్తోంది. ఆ మధ్యనే ఆమె దర్శకుడు రాజ్‌ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

Related image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Related image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
310
2.అలియాభట్‌, 3.నయనతార
Image Credit : Asianet News

2.అలియాభట్‌, 3.నయనతార

రెండో స్థానంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ నిలిచింది. సమంత తర్వాత అలియా కూడా కంటిన్యూగా సెకండ్‌ ప్లేస్‌లో ఉంటోంది. మూడో స్థానంలో నయనతార ఉంది. గత నెలలోనూ ఆమె మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు కూడా అదే స్థానానికి ఫిక్స్ అయ్యింది. తన సత్తాని చాటింది.

410
4.రష్మిక మందన్నా
Image Credit : Asianet News

4.రష్మిక మందన్నా

ఇక నాల్గో స్థానాన్ని రష్మిక మందన్నా సొంతం చేసుకుంది. గత నెలలో ఆమె ఐదో స్థానానికి పడిపోగా, ఇప్పుడు ఫిబ్రవరిలో కోలుకుంది. ఒక్క స్థానం మెరుగుపడింది. ఇటీవల రష్మిక మ్యారేజ్‌ వార్తలతో వైరల్‌గా మారింది. విజయ్‌ దేవరకొండని ఆమె మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే.  

510
5.కాజల్‌
Image Credit : our own

5.కాజల్‌

ఐదో స్థానంలోకి కాజల్‌ వచ్చింది. జనవరిలో ఆమె ఆరో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్‌ కి రావడం విశేషం. కాజల్‌ సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె సినిమాలు చేయకపోయినా, ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. పైగా ఫిబ్రవరిలో ఒక స్థానం మెరుగుపడటం విశేషం.

610
6.త్రిష
Image Credit : Asianet News

6.త్రిష

జనవరిలో నాల్గో స్థానంలో ఉన్న త్రిష ఫిబ్రవరిలో పడిపోయింది. రెండు స్థానాలు తగ్గి ఆరో స్థానంలోకి వచ్చింది. త్రిషకి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో ఎఫైర్‌ మ్యాటర్‌ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అయినా త్రిష పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆమె మార్చిలో పెరిగే ఛాన్స్ ఉంది.

710
7.దీపికా పదుకొనె
Image Credit : PR Handout

7.దీపికా పదుకొనె

ఏడో స్థానంలో దీపికా పదుకొనె ఉంది. ఆమె జనవరిలో కూడా అదే స్థానంలో ఉంది. అయితే టాప్‌ 5లో ఉండాల్సిన దీపికా ఇలా పడిపోవడం ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో `ఏఏ22` చిత్రంలో నటిస్తోంది.

810
8.సాయిపల్లవి
Image Credit : unique threads

8.సాయిపల్లవి

సాయిపల్లవి ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత రెండు మూడు నెలలుగా ఆమె స్థానం సేమ్‌ ఉంటుంది. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్‌ లో `రామాయణ్‌`లో నటిస్తుంది. మరో బాలీవుడ్‌ మూవీ చేస్తుంది. తమిళంలో ధనుష్‌తో ఓ సినిమా చేస్తుంది.

910
9.తమన్నా
Image Credit : x/tamanna team

9.తమన్నా

తొమ్మిదో స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నిలిచింది. ఆమె జనవరిలో 10వ ప్లేస్‌లో ఉండగా, ఇప్పుడు 9వ స్థానానికి రావడం విశేషం. ఆమె క్రేజ్‌ పెరుగుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

1010
10.శ్రీలీల
Image Credit : Zee telugu

10.శ్రీలీల

ఇదిలా ఉంటే జనవరిలో 9వ స్థానంలో ఉన్న శ్రీలీల ఇప్పుడు పడిపోయింది. 10వ స్థానానికి పరిమితమయ్యింది. ఇటీవల శ్రీలీల జోరు తగ్గింది. అందుకే ఆమె ఓ స్థానం కోల్పోయింది. అయితే మార్చిలో మాత్రం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో శ్రీలీల రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మిక మందన్న
సాయి పల్లవి
సమంత రూత్ ప్రభు
త్రిష
నయనతార
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Recommended image2
Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Recommended image3
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Related Stories
Recommended image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Recommended image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved