తండ్రిగా నితిన్ కి ప్రమోషన్..సెలెబ్రిటీలు ఏమంటున్నారంటే, సమంత రియాక్షన్ హైలైట్
నితిన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. నితిన్ సతీమణి షాలిని కందుకూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
యంగ్ హీరో నితిన్ కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది నితిన్ నటించిన చివరి చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై నితిన్ భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
అయితే నితిన్ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నితిన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. నితిన్ సతీమణి షాలిని కందుకూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2020లో నితిన్, షాలిని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ కుటుంబ సభ్యులని ఒప్పించి వివాహం చేసుకున్నారు.
అయితే నితిన్ సతీమణి షాలిని గర్భవతి అయినట్లు ఎక్కడా బయట పెట్టలేదు. ఒక్కసారిగా బిడ్డ జన్మించాడు అని పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ థ్రిల్ తో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని నితిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన కొడుకు చేతి వేళ్ళని ముట్టుకుంటున్న ఫోటోని నితిన్ అభిమానులతో పంచుకున్నారు.
Also Read: అక్కినేని ఫ్యామిలీలో 'నాగ' అనే పదంతో పేర్లు ఎందుకు ఉంటాయో తెలుసా.. పెద్ద ఫ్లాష్ బ్యాక్
నితిన్ ట్వీట్ పై సెలెబ్రిటీలు రియాక్ట్ అవుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు. శ్రీయ శరన్, వెన్నెల కిషోర్, సమంత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ నితిన్ కి శుభాకాంక్షలు చెప్పారు. వీరిలో సమంత రియాక్షన్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా నితిన్ తనకి కొడుకు పుట్టినట్లు చెప్పడంతో.. ఓ మై గాడ్.. కంగ్రాట్స్ అంటూ సమంత కామెంట్స్ పెట్టింది.