MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ తల్లికి వచ్చిన భయంకరమైన కల..అదే సెంటిమెంట్ నాగ చైతన్యకి కూడా, అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇలా

ఏఎన్నార్ తల్లికి వచ్చిన భయంకరమైన కల..అదే సెంటిమెంట్ నాగ చైతన్యకి కూడా, అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇలా

తల్లి దండ్రులు వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా పిల్లలకు పేర్లు పెడుతుంటారు. కానీ అక్కినేని ఫ్యామిలిలో పేర్ల వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉందట. నాగేశ్వర రావు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 06 2024, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూలస్థంభాలు లాంటి నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు. ఏఎన్నార్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోగా దశాబ్దాలు రాణించారు. ఇప్పుడు ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ నటులుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లెజెండ్రీ యాక్టర్ ఏఎన్నార్ తన ఫ్యామిలీ గురించి చెబుతూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆసక్తిగా మారాయి. తల్లిదండ్రులు వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా పిల్లలకు పేర్లు పెడుతుంటారు. కానీ అక్కినేని ఫ్యామిలిలో పేర్ల వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉందట. నాగేశ్వర రావు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. 

 

35

అక్కినేని ఫ్యామిలిలో చాలా మంది పేర్లు నాగ అనే పదంతో మొదలవుతాయి. నాగేశ్వర రావు, నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య ఇలా చాలా మంది పేర్లలో నాగ అని ఉంటుంది. దీని గురించి ఏఎన్నార్ వివరించారు. మా అమ్మకి నన్ను ప్రసవించిన రోజునే ఒక కల వచ్చిందట. తన చుట్టూ నాగుపాము తిరుగుతున్నట్లు కలలో కనిపించిందట. దీనితో ఆమె నాగ దేవతగా భావించి..నాకు నాగేశ్వర రావు అని పేరు పెట్టింది. 

45

ఆ తర్వాత నా భార్య ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేసింది. మా కుమార్తెకి నాగ సుశీల అని పేరు పెట్టింది. నాగార్జునకి మాత్రం నేనే పేరు పెట్టాను. అప్పట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండేది. దాని మీద నాకు ఇష్టం ఉంది. నాగ అనే సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది కాబట్టి నాగార్జున అని పేరు పెట్టినట్లు ఏఎన్నార్ తెలిపారు. ఆ తర్వాత నాగ చైతన్య వరకు ఆ సెంటిమెంట్ కొనసాగింది అని ఏఎన్నార్ అన్నారు. 

 

55

ఏఎన్నార్ చివరగా నాగార్జున, నాగ చైతన్యతో కలసి మనం చిత్రంలో నటించారు. మనం చిత్రం క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. ఈ చిత్ర రిలీజ్ కి కొన్ని నెలల ముందే ఏఎన్నార్ మరణించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image2
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image3
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved