సినిమాకు 25 కోట్లుపైనే.. హీరో నాని మొదటి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
ఎటువంటి సినిమా బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు నేచురల్ స్టార్ నాని. చిన్న స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. దాదాపు 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాని ఫస్ట్ జీతం ఎంతో తెలుసా..?
Actor Nani
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. అనుకోకుండా.. అనూహ్యంగా హీరో అయ్యి.. కెరీర్ ను ఒక పద్దతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. హీరో నాని. సహజమైన నటనతో.. నేచురల్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాదించాడు నాని. టాలీవుడ్ లో స్వతహాగా ఎదిగిన హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. .. లేడీస్ లో క్రేజ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. నానికి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నాని అంటే చాలా ఇష్టం.
దాన కర్ణుడు సోనూసూద్ ఆస్తులు ఎన్ని కోట్లు తెలుసా..? చారిటీకి ఆయన ఎంత ఖర్చు చేస్తున్నాడు..?
నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా. కాలేజ్ చదువు పూర్తయ్యాక, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం మొదలు పెట్టిన నాని, హైదరాబాద్‌లోనే రేడియో షో హోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తూనే..చిన్న చిన్న పనులు చేసుకున్నారు. ఇక ఆయనకు అదృష్టం అష్ట చమ్మా సినిమాతో స్టార్ట్ అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు నాని.
ఆ హీరోయిన్ తొడలు చూడటానికి అర్ధరాత్రి వెళ్లిన జేడీ చక్రవర్తి... ఎవరా హీరోయిన్..?
వరుసగా ఫ్యామిలీ మూవీ చేస్తూ వచ్చాడు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ఎంటర్ అయ్యాడు. అయితే ఒక దశలో నాని మోనాటీనీ అన్నవారికి తన నటన, క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ షేడ్స్ ను చూపించి మెప్పించాడు. దసరా లాంటి సినిమాతో నానిలో మాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా అద్భుతాలు చేస్తున్న యంగ్ హీరో.
చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ..? మెగా ఫ్యాన్స్ కు పండగే..
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలపైనా దృష్టి సారించిన నాని గతేడాది విడుదలైన దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలతో అద్భుతం చేశాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో.. సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు నాని. అయితే నాని ప్రస్తుతం సినిమాకు 25 కోట్ల వరకూ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయన జీతం ఎంతో తెలుసా..?
నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్..? ఎవరామె..? ఏ సినిమా కోసం..?
గతంలో ఓఇంటర్వ్యూలో తాను తీసుకున్న మొదటి జీతం గురించి వెల్లడించారు నాని. ఆయన మాట్లాడుతూ.. 'సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా ప్రయాణం మొదలైంది. నాకు వచ్చిన మొదటి జీతం 4000 రూపాయలు. అది నాకు వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చారు. దాన్ని జేబులో పెట్టుకుని సైకిల్‌పై ఇంటికి వెళ్లాను.. అది నాకు బాగా గుర్తు అని అన్నారు నాని.
కమల్ హాసన్ కాదు.. ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా..?
తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్న నానికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఈగ, నేను లోకల్, వీ, నిన్ను కోరి, దసరా, శ్యాం సింగరాయ్ వంటి సినిమాలు నానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. నేచురల్ యాక్టింగ్ తో పాటు.. హ్యాండ్సమ్ గా ఉండే నానికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.