Sitara: మిడ్డీలో మెస్మరైజ్ చేస్తున్న స్టార్ కిడ్ సితార... అందంలో మహేష్ బాబు ఏం సరిపోతాడు!
తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సితార ఘట్టమనేని. ఈ స్టార్ కిడ్ తానెంతో ప్రత్యేకం అని నిరూపిస్తుంది. సితార లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sitara Ghattamaneni
సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా ఫోటోలు, డాన్స్ వీడియోలు, టూర్ డైరీస్ షేర్ చేస్తారు. స్టార్ హీరోయిన్స్ మాదిరి ప్రొఫెషనల్ ఫోటో షూట్స్ చేస్తుంది. సితార ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
Sitara Ghattamaneni
సితార అప్పుడే మోడలింగ్ మొదలుపెట్టింది. ఆమె ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. పీఎంజే జ్యువెలర్స్ ప్రచారకర్తగా ఉన్న సితార హోర్డింగ్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో దర్శనమిచ్చింది. ఈ అరుదైన గౌరవం అందుకున్న అమ్మాయిగా సితార రికార్డులకు ఎక్కింది.
Sitara Ghattamaneni
పీఎంజే జ్యువెలర్స్ యాడ్ లో నటించిన సితార ఏకంగా రూ. 1 కోటి తీసుకున్నట్లు సమాచారం. తన మొదటి సంపాదన ఛారిటీకి ఖర్చు చేసిందట. బర్త్ డే నాడు సితార పేద విద్యార్థులకు సహాయం చేసింది. వారు స్కూల్ కి వెళ్లేందుకు సైకిల్స్ డొనేట్ చేసింది.
Sitara Ghattamaneni
అందంలోనే కాదు గుణంలో కూడా సితారది తండ్రి పోలికే. మహేష్ బాబు చాలా కాలంగా పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. సితార చిన్నతనంలోనే పేదలకు సహాయం చేయాలనే గుణం అలవరుచుకుంది.
సితార డాన్స్ నేర్చుకుంటుంది. యాని మాస్టర్ సితార గురువు. యాని మాస్టర్ తో డాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. సితారకు నటనపై మక్కువ ఉందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఆల్రెడీ ఆమె సర్కారు వారి పాట చిత్రంలో ప్రమోషనల్ వీడియోలో నటించింది.
సితారకు పూర్తి భిన్నం అన్నయ్య గౌతమ్ ఘట్టమనేని. సోషల్ మీడియకు దూరంగా ఉంటాడు. అయితే వన్ నేనొక్కడినే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ఇంకా సమయం ఉందని ఇటీవల తల్లి నమ్రత అన్నారు.
Pawan Kalyan - Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నిజమెంత..?