Asianet News TeluguAsianet News Telugu

Pawan Kalyan - Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నిజమెంత..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. అవును మహేష్ సినిమా కోసం పవన్ ఓ చేయి వేయబోతున్నాడటన మరి ఈ వార్తల్లో నిజం ఎంత..? 
 

Pawan Kalyan Voice Over for Mahesh Babu Guntur Karam Movie JMS
Author
First Published Nov 18, 2023, 8:57 AM IST | Last Updated Nov 18, 2023, 10:16 AM IST

ఒక స్టార్ కోసం. మరో స్టార్ సాయానికి రావడం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో జరుగుతున్న తంతే. చిన్న సినిమా కాని..పెద్ద సినిమా కాని.. స్టార్లు ఒకరి కోసం మరొకరు కదలివెళ్తుంటారు. సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం.. లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లి సినిమాలపై అంచనాలు పెంచడం లాంటివి జరుగుతంటాయి. తాజాగా మహేష్ బాబు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఈరెండింటిలో ఒక పనిచేయబోతున్నారట. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా.. విలన్ గా  జగపతి బాబు కనిపించనున్నారు. అయితే ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన ఈసినిమా చాలా అడ్డంకులు ఫేస్ చేస్తూ.. షూటింగ్ చేసుకుంటుంటుంది. పూజా హెగ్డే  డేట్స్ కూడా అయిపోవడంతో.. కొంత షూట్ చేసిన తరువాత ఆమెను మార్చాల్సిన పరిస్థితి. ప్రస్తుతం శ్రీలీల ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

Pawan Kalyan Voice Over for Mahesh Babu Guntur Karam Movie JMS

ఇక అసలు విషయం ఏంటంటే..ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారు అనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇక తాజా టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం నిజంగానే సూపర్ స్టార్ కోసం పవర్ స్టార్ తన వాయిస్ ని అందించారని, మహేష్ బాబు ఎంట్రీ సీన్ తో పాటు పలు కీలక సీన్స్ కి పవర్ స్టార్ అందించిన వాయిస్ ఓవర్ అదిరిపోనుందని అంటున్నారు. పవర్ స్టార్  ఆస్థాన దర్శకుడిగా త్రివిక్రమ్ కు పేరుంది. అంతే కాదు ఇండస్ట్రీలో వీరిద్దరు మంచి స్నేహితులు కూడా.

డైరెక్షన్‌ మానేసి రాజకీయ పార్టీ పెట్టబోతున్న అనిల్‌ రావిపూడి.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

 దాంతో తన సినిమాకు వాయిస్ అందించాలని మాటల మాత్రికుడు త్రివిక్రమ్ పవన్ ను అడిగారట. దానికి పవన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీని పై గుంటూరు కారం మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గుంటూరు కారం మూవీని గ్రాండ్ లెవెల్లో జనవరి 12న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక బ్యాలెన్స్ షూట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు టీమ్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios