MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే

Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే

యాంగ్రీ హీరో రాజశేఖర్ ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో పోటీగా సినిమాలు చేశారు. కానీ రాజశేఖర్ ఎప్పుడూ టాప్ 4లో నిలబడలేదు. అందుకు కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 05 2026, 08:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ నలుగురికి పోటీగా రాజశేఖర్
Image Credit : Asianet News

ఆ నలుగురికి పోటీగా రాజశేఖర్

యాంగ్రీ హీరో రాజశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. రాజశేఖర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అంకుశం, మగాడు లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు చిరంజీవి పోటీగా రాజశేఖర్ సినిమాలకు కలెక్షన్స్ వచ్చేవి. అప్పట్లో టాలీవుడ్ లో టాప్ 4 హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరితో రాజశేఖర్ పోటీ పడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
హీరోగా కెరీర్ ముగిసినట్లేనా ?
Image Credit : youtube/great andhra

హీరోగా కెరీర్ ముగిసినట్లేనా ?

ఆ నలుగురు హీరోలు ఇప్పటికీ రాణిస్తున్నారు కానీ రాజశేఖర్ కెరీర్ మాత్రం హీరోగా దాదాపుగా ముగిసింది అనే చెప్పాలి. అంతటి స్టార్ డమ్ ఉన్న రాజశేఖర్ కెరీర్ ఎందుకు ఇలా అయింది అనే సందేహాలు ఉండొచ్చు. దానిని ఇండస్ట్రీలో ప్రధానంగా కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. అవి ఇప్పుడు చూద్దాం.

Related Articles

Related image1
Ramayana: సాయి పల్లవి కన్నా ముందు సీతగా అదరగొట్టిన హీరోయిన్లు వీళ్లే, మొదటి సీత ఎవరో తెలుసా?
Related image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
35
రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాలు
Image Credit : Asianet News

రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాలు

రాజశేఖర్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని మిస్ చేసుకున్నారు. కారణాలు ఏవైనా కానీ ఆ సినిమాలన్నీ రాజశేఖర్ దగ్గరకు వచ్చి వెళ్ళినవే. చంటి, సూర్యవంశం, ఠాగూర్, పెదరాయుడు, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలని రాజశేఖర్ మిస్ చేసుకున్నారు.

45
కుర్ర హీరోల ప్రభావం
Image Credit : Instagram/Jeevitha

కుర్ర హీరోల ప్రభావం

ముఖ్యంగా ఠాగూర్ సినిమా విషయంలో పెద్ద వివాదం జరిగింది. రమణ సినిమా రీమేక్ ని రాజశేఖర్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది చిరంజీవి చేతుల్లోకి వెళ్ళింది. 90 వ దశకం మొత్తం ఎలాగోలా క్రేజ్ మైంటైన్ చేస్తూ వచ్చిన రాజశేఖర్ 2000 తర్వాత బాగా డౌన్ అయ్యారు. పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోల రాకతో రాజశేఖర్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ మాత్రం తమ ఆధిపత్యాన్ని కోనసాగించారు.

55
ఆ సమస్య కూడా ప్రభావం చూపింది
Image Credit : IMDB

ఆ సమస్య కూడా ప్రభావం చూపింది

రాజశేఖర్ కెరీర్ డౌన్ కావడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే రాజశేఖర్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం. రాజశేఖర్ కి అప్పట్లో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. సాయికుమార్ వాయిస్ రాజశేఖర్ కి కొండంత అండగా నిలిచింది. అప్పట్లో చాలా మంది ప్రేక్షకులు అది సాయికుమార్ ఒరిజినల్ వాయిస్ అనుకునేవారు. సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం మానేశాక.. ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ లపై రాజశేఖర్ ఆధారపడాల్సి వచ్చింది. కొందరు నిర్మాతలు అయితే సాయికుమార్ వాయిస్ ఉంటేనే రాజశేఖర్ తో సినిమా చేస్తాం అని తేల్చేశారు. ఆ విధంగా రాజశేఖర్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Related Stories
Recommended image1
Ramayana: సాయి పల్లవి కన్నా ముందు సీతగా అదరగొట్టిన హీరోయిన్లు వీళ్లే, మొదటి సీత ఎవరో తెలుసా?
Recommended image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved