MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ramayana: సాయి పల్లవి కన్నా ముందు సీతగా అదరగొట్టిన హీరోయిన్లు వీళ్లే, మొదటి సీత ఎవరో తెలుసా?

Ramayana: సాయి పల్లవి కన్నా ముందు సీతగా అదరగొట్టిన హీరోయిన్లు వీళ్లే, మొదటి సీత ఎవరో తెలుసా?

రామాయణ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి పెద్ద సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నితీశ్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 05 2026, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సాయి పల్లవి సీత పాత్ర
Image Credit : instagram

సాయి పల్లవి సీత పాత్ర

రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణం సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దాదాపు 18 మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తోంది. ఇటీవల రిలీజైన టీజర్‌లో సాయి పల్లవి చిన్న లుక్ కనిపించింది. ఈ సినిమా చర్చల నేపథ్యంలో, భారతీయ సినిమా 100 ఏళ్ల చరిత్రలో సీతగా నటించిన హీరోయిన్లు ఎవరో, మొదటి సీత ఎవరో తెలుసుకుందాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్నా సాలుంకే
Image Credit : facebook

అన్నా సాలుంకే

భారతదేశంలో సినిమా ప్రారంభమైన రోజుల్లో మహిళలు నటించడంపై నిషేధం ఉండేది. అందుకే, హీరోయిన్ల పాత్రలను కూడా మగవాళ్లే పోషించేవారు. రామాయణం ఆధారంగా వచ్చిన మొదటి సినిమా 1917లో విడుదలైన 'లంకా దహన్'. ఇందులో నటుడు అన్నా సాలుంకే సీత పాత్రను పోషించారు. అంతేకాదు, ఆయన రాముడి పాత్రలో కూడా నటించడం విశేషం.

35
వెండితెరపై మొదటి సీత
Image Credit : facebook

వెండితెరపై మొదటి సీత

వెండితెరపై మొదటి సీతగా దుర్గా ఖోటే నిలిచారు. ఆమె దేబాకి బోస్ తీసిన బెంగాలీ చిత్రం 'సీత'లో ఈ పాత్రను పోషించారు. ఇదే సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ రాముడి పాత్రలో నటించారు. ఆ తర్వాత, 1936లో వచ్చిన ఒడియా సినిమా 'సీతా బిబాహ'లో ప్రభావతి సీతగా కనిపించారు. అనంతరం, 1943లో వచ్చిన 'రామ్ రాజ్య' చిత్రంలో శోభనా సమర్థ్ సీత పాత్రలో నటించారు.

45
శ్రీదేవి సీతగా
Image Credit : instagram

శ్రీదేవి సీతగా

ప్రాంతీయ భాషల సినిమాల్లోనూ చాలామంది సీతగా నటించారు. 1958లో వచ్చిన తమిళ చిత్రం 'సంపూర్ణ రామాయణం'లో పద్మిని సీత పాత్ర పోషించారు. మలయాళ చిత్రం 'సీత'లో కుశలకుమారి నటించగా, 'సీతారామ కల్యాణం 'లో గీతాంజలి సీతగా కనిపించారు. 60-70 దశకాల్లో అంజలీ దేవి, చంద్రకళ తెలుగు సినిమాల్లో సీత పాత్రలు పోషించారు. 1976లో వచ్చిన తమిళ చిత్రం 'దశావతారం'లో శ్రీదేవి కూడా సీతగా నటించారు. జయప్రద 'సీతా కల్యాణం', 'లవకుశ' వంటి పలు తెలుగు, హిందీ చిత్రాల్లో సీతగా మెప్పించారు.

55
సీరియల్‌లో దీపికా చిఖ్లియా సీతగా
Image Credit : instagram

సీరియల్‌లో దీపికా చిఖ్లియా సీతగా

టీవీ సీరియళ్లలో సీత పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్‌లో దీపికా చిఖ్లియా సీతగా నటించి ఇంటింటా పాపులర్ అయ్యారు. దీపికాతో పాటు దెబినా బెనర్జీ, మదిరాక్షి ముండ్లే, రుబీనా దిలైక్, రీనా కపూర్, నేహా సర్గమ్, శిల్పా ముఖర్జీ వంటి వారు కూడా వేర్వేరు సీరియళ్లలో సీత పాత్రలో నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Recommended image2
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Recommended image3
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Related Stories
Recommended image1
దృశ్యం డైరెక్టర్ కాపీ కొట్టి తీసిన క్రైమ్ థ్రిల్లర్..చంపి పాతిపెట్టే కాన్సెప్ట్ తోనే, ఓటీటీలో మంచి టైం పాస్
Recommended image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved