- Home
- Entertainment
- HHVM Surprise: `హరిహర వీరమల్లు` ఫస్టాఫ్ రెడీ, పవన్‌పై షూట్ చేయాల్సింది ఎన్ని రోజులంటే?
HHVM Surprise: `హరిహర వీరమల్లు` ఫస్టాఫ్ రెడీ, పవన్‌పై షూట్ చేయాల్సింది ఎన్ని రోజులంటే?
HHVM Surprise: పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్టాఫ్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. పవన్ షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తుంది.

HariHara VeeraMallu Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని మొదట కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. టీమ్ కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటో చూస్తే.
`హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందట. కేవలం పవన్ కళ్యాణ్‌పై షూటింగ్ చేయాల్సి ఉందట. మరో నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటే చిత్రీకరణ అయిపోతుందని తెలుస్తుంది. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. అయితే పవన్ కోసం షూటింగ్ ఆగిపోయింది, కానీ సినిమా వర్క్ నడుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా చేస్తున్నారట టీమ్.
ఇప్పటికే ఫస్టాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయ్యిందట. మొదటి భాగాన్ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. రెండో భాగానికి సంబంధించిన ఎడిటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ డీఐ వర్క్ చేస్తున్నారని, శనివారంతోనే నాలుగు రోజుల షెడ్యూల్ ఒకటి పూర్తయ్యిందట. పవన్ సీన్లు తప్పితే మిగిలిన కంటెంట్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందట. జస్ట్ పవన్‌పై సీన్లు చిత్రీకరించి, వాటిని ఏ ఏ ప్లేస్‌లో పెట్టాలో మెర్జ్ చేయడమే మిగిలి ఉందని తెలుస్తుంది. టీమ్ మాత్రం పక్కా ప్లానింగ్‌తో ఉన్నారని సమాచారం.
అయితే సినిమాని మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు వాయిదా పడే అవకాశం ఉందని, ఏప్రిల్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ వీరమల్లుగా నటిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్ ఔరంగాజేబ్‌గా కనిపిస్తారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. హిస్టారికల్ పీరియడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత అనే విషయం తెలిసిందే.
read more: Akhanda 2 ` గూస్‌బంమ్స్ అప్‌డేట్.. బాలయ్యకి విలన్‌గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?