MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ హరిహర వీరమల్లు మూవీతో టాలీవుడ్ స్టార్ హీరో మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావలసింది

పవన్ హరిహర వీరమల్లు మూవీతో టాలీవుడ్ స్టార్ హీరో మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావలసింది

ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మరో అగ్ర హీరో తన మల్టిప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 29 2025, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మల్టిప్లెక్స్ రంగంలో అగ్ర హీరోలు
Image Credit : Instagram

మల్టిప్లెక్స్ రంగంలో అగ్ర హీరోలు

ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా AAA సినిమాస్ పేరుతో సొంతంగా మల్టీప్లెక్స్ నిర్మించుకున్నారు. కొందరు దర్శకులు, నిర్మాతలకు కూడా సొంత థియేటర్స్ ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ మరో అగ్ర హీరో తన మల్టిప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్, అల్లు అర్జున్ తర్వాత రవితేజ
Image Credit : Instagram

మహేష్, అల్లు అర్జున్ తర్వాత రవితేజ

ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. ఏషియన్ సినిమాస్, మాస్ మహారాజా రవితేజ కలిసి నిర్మించిన నూతన మల్టీప్లెక్స్ ఏఆర్టీ సినిమాస్  (Asian Ravi Teja Cinemas - ART Cinemas) జూలై 2025లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇటీవల 'కుబేరా' ప్రమోషన్ సమయంలో పంపిణీదారుడు, నిర్మాత అయిన సునీల్ నారంగ్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. హైదరాబాద్‌లో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కావడంపై సినీ ప్రేమికుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

35
పవన్ సినిమాతో రవితేజ థియేటర్ ప్రారంభం
Image Credit : production house

పవన్ సినిమాతో రవితేజ థియేటర్ ప్రారంభం

ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం హరి హర వీర మల్లు: పార్ట్ 1 మూవీతో ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజకి చెందిన మల్టీప్లెక్స్ లో తొలి చిత్రం గా పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ప్రదర్శించబడుతుండడంతో టాలీవుడ్ లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చారిత్రక యాక్షన్ డ్రామా 2025 జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ థియేటర్‌లో వీర మల్లు గాథను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

45
ART సినిమాస్‌ ప్రత్యేకతలు
Image Credit : X/ Mega Surya Production

ART సినిమాస్‌ ప్రత్యేకతలు

ART సినిమాస్‌ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో 57 అడుగుల భారీ EPIQ స్క్రీన్, 4K ప్రొజెక్షన్, డాల్బీ Atmos సౌండ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమా అనుభూతిని కలిగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. హైదరాబాద్‌లో సినిమా ప్రదర్శనకు ఇది కొత్త ప్రమాణాల్ని సృష్టించనుందని అంచనా.

55
హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు
Image Credit : X

హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు

ప్రారంభ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ థియేటర్ ఓపెనింగ్ రోజున సునీల్ నారంగ్ మరిన్ని ఆశ్చర్యకర విషయాలు రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పవన్ సినిమాతో రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం అనేది క్రేజీ విషయం. పవన్, రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image2
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image3
Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?
Related Stories
Recommended image1
సమంతని కలిసే సీన్, ఆవేశంతో బల్ల గుద్దిన నాగార్జున.. అసలేం జరిగిందంటే..
Recommended image2
దిల్ రాజు కంటే ముందు చాలా మంది సెలెబ్రిటీలని కలిశా, ఆయనతో పెళ్లి కోసం పెద్ద యుద్ధమే జరిగింది.. తేజస్విని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved