MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?

Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?

Hanuman Ansh Telugu Day 3 Collections: ఇటీవల కాలంలో సంచలనాత్మక మూవీగా నిలిచిన హనుమాన్‌ అంశ్‌ మూవీ తెలుగులోనూ విడుదలైన విషయం తెలిసిందే. డల్‌గా ప్రారంభమైన ఈ మూవీ ఆదివారం డబుల్‌ అయ్యింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 12 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తెలుగులో పుంజుకుంటున్న హనుమాన్‌ అంశ్‌
Image Credit : Asianet News

తెలుగులో పుంజుకుంటున్న హనుమాన్‌ అంశ్‌

నీమ్‌ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన మూవీ `హనుమాన్‌ అంశ్‌`. విశాల్‌ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నీమ్‌ కరోలి బాబా పాత్రలో శోభినవ్‌ సత్య నటించారు. ఈ హిందీ సినిమా ఆగస్ట్ లోనే విడుదలైంది. దాదాపు రెండు నెలల తర్వాత తెలుగులో అనువాదం చేశారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికే హిందీ వెర్షన్‌ మూవీని చాలా మంది చూశారు. దీంతో తెలుగు వెర్షన్‌కి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా రోజు రోజుకి పుంజుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హనుమాన్‌ అంశ్‌ తెలుగు కలెక్షన్లు
Image Credit : X/@hombalefilms

హనుమాన్‌ అంశ్‌ తెలుగు కలెక్షన్లు

హనుమాన్‌ అంశ్‌ తెలుగు వెర్షన్‌ మొదటి రోజు కేవలం అరవై లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు డబుల్‌ కి చేరుకుంది. దాదాపు కోటి రూపాయల గ్రాస్‌ చేసింది. ఇక ఆదివారం అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు ఇది దాదాపు రూ.1.35కోట్లు వసూలు చేయడం విశేషం. మొదటి రోజుతో పోల్చితే డబుల్‌ అని చెప్పొచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలై ఆదివారంతో 66 రోజులు. మరి 66వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత చేసిందనేది చూస్తే, దీనికి రూ.3.25కోట్ల గ్రాస్‌ రావడం విశేషం. అంతకు ముందు రోజులతో పోల్చితే వసూళ్లు పెరిగాయి. అయితే తెలుగు కలెక్షన్లు దీనికి యాడ్‌ అయ్యాయని చెప్పొచ్చు.

33
సంచలనాలకు కేరాఫ్‌గా హనుమాన్‌ అంశ్
Image Credit : X/@hombalefilms

సంచలనాలకు కేరాఫ్‌గా హనుమాన్‌ అంశ్

ఒక 66 రోజుల్లో ఈ చిత్రం టోటల్‌గా రూ.435.37కోట్లు వసూలు చేసింది. ఇండియా నెట్‌ రూ.334.48కోట్లు వచ్చాయి. దాదాపు నలభై కోట్లు ఓవర్సీస్‌ రూపంలో వచ్చాయి. మూడు రోజుల్లో తెలుగులో దీనికి దాదాపు రూ.3 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావడం విశేషం. ఈ మాత్రం రావడం కూడా గొప్పవిషయమనే చెప్పొచ్చు. మరి సోమవారం నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.435కోట్లు చేయడం సరికొత్త రికార్డుగా చెప్పొచ్చు. రాముడు, హనుమంతుడి భక్తుడైన నీమ్‌ కరోలి బాబా జీవితంలోని ప్రధాన ఘట్టాలను బేస్ చేసుకొని ఈ మూవీని రూపొందించారు. ఆయన దైవత్వంగా ఎలా మారాడనేది చూపించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image2
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image3
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Related Stories
Recommended image1
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image2
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved