- Home
- Entertainment
- Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్ బాస్ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్ బాస్ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారంలో చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. మరి ఆయనకు బిగ్ బాస్ షో నుంచి ఎంత పారితోషికం అందుతుంది. టోటల్‌గా ఎంత పొందుతున్నాడనేది చూస్తే,

రెండోసారి ఎలిమినేట్ అయిన చరణ్
బిగ్ బాస్ తెలుగు 10లో ఐదు వారాలపాటు వింతలు విశేషాలు, ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకున్నాయి. ఇంట్రెస్టింగ్‌గా సాగింది. షోపై హైప్ లేకపోవడంతో నిర్వాహకులు ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. రేటింగ్ పెంచేందుకు హంగామా చేశారు. ఇక ఐదు వారాలు పూర్తి చేసుకుందీ షో. మధ్యలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఐదో వారంలో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా ఏడుగురు వచ్చారు. అయితే మొదట వచ్చిన ఇద్దరు ఎలిమినేట్ కావడం గమనార్హం. వారితోపాటు మొదటివారంలో ఎలిమినేట్ అయిన చరణ్ మళ్లీ ఎలిమినేట్ అయ్యాడు. ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆయన హౌజ్‌ని వీడాడు.
ఏమాత్రం కంటెంట్ ఇవ్వలేకపోయిన చరణ్
చరణ్ మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో హౌజ్‌ని వీడాడు. ఆయనతోపాటు చైత్రరాయ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండో వారంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఆడియెన్స్ పోల్ నిర్వహించగా, చరణ్ రీఎంట్రీ ఇచ్చాడు. చైత్ర రాయ్ కి ఛాన్స్ రాలేదు. ఇక రెండో వారంలో వచ్చి తన సత్తా చాటుతాడునుకున్న చరణ్ ఏమాత్రం హంగామా చేయలేకపోయాడు. గేమ్‌లోనూ వెనకబడ్డాడు. కంటెంట్ ఇవ్వడంలోనూ ఫెయిల్ అయ్యాడు. పైగా సైలెంట్‌గా ఉంటూ వచ్చాడు. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున చెబుతున్నా ఏమాత్రం మార్పు లేదు. దీంతో ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా అపూర్వతోపాటు ఆయన్ని ఎలిమినేట్ చేశారు.
చరణ్ నాలుగు వారాల పారితోషికం
ఇక మధ్యలో ఒక వారం తీసేస్తే నాలుగు వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు చరణ్. మరి ఆయన నాలుగు వారాలకు ఎంత పారితోషికం తీసుకున్నాడు, బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత ఇచ్చారనేది చూస్తే. చరణ్ కామనర్ కేటగిరిలో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. ఆయన అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. కామనర్స్ కి వారానికి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఇవ్వాలని నిర్ణయించారట. ఈ లెక్కన నాలుగు వారాలు ఉన్న చరణ్ కి దాదాపు మూడు లక్షలు పారితోషికం రూపంలో వస్తుందని చెప్పొచ్చు.

