- Home
- Entertainment
- Guppedantha Manasu: సీన్‌లోకి గౌతమ్ ఎంట్రీ.. ఒకొక్కరు ఒకోసారి వసును నిందిస్తున్నారుగా!
Guppedantha Manasu: సీన్‌లోకి గౌతమ్ ఎంట్రీ.. ఒకొక్కరు ఒకోసారి వసును నిందిస్తున్నారుగా!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంతుంది. ఇక ఈ రోజు జూన్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నేను నా లక్ష్యాన్ని ప్రేమిస్తున్న.. ఒక కల కంటున్నాను అది నిజం అవ్వాలనుకుంటున్న అని వసు అంటే.. గౌతమ్ రిషి వైపు మాట్లాడుతూ రిషి గుండె ముక్కలై ఉంటుంది అని అంటాడు.. అ సమయంలో ప్రేమే జీవితం కాదు అది ఒక పార్ట్ అని అంటుంది. అది అంతా రిషి వింటుంటాడు.
మరో సీన్ లో రిషి.. వసు మాటలు గుర్తు చేసుకొని బాధపడుతున్న సమయంలో జగతి వస్తుంది. మీతో మాట్లాడాలి అని రిషితో అంటే మీరు ఏం మాట్లాడుతారో నేను ఊహించగలను అని అంటాడు. మీ శిష్యురాలి గురించి మాట్లాడేందుకే కదా అని అంటాడు. మీరు ఏం మాట్లాడాల్సిన పని లేదు అని గట్టిగా అంటాడు.
అతర్వాత.. నేను రిజెక్ట్ అయ్యేందుకు పుట్టినట్టు ఉన్నాను మేడం అంటే ఏంటి సార్ అలా అంటారు అంటే.. నిజం మేడం మీకు ఇంకా అర్థం కావడం లేదా అని.. బాల్యంలో జగతి గురించి.. ఎంగేజ్ మెంట్ తర్వాత సాక్షి.. ఇప్పుడు ప్రేమలో వసుధార అందరూ నన్ను రిజెక్ట్ చేసి వెళ్లినవారే అని తెగ ఫీల్ అయిపోతాడు.
మీరే కదా వసుధారను ప్రేమిస్తున్న అని చెప్పింది అని రిషి అంటాడు.. వసు మనసులో ఏం ఉందో తెలుసుకోలేకపోయారా.. ఇప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చారా.. దూరమైనా బంధాన్ని దగ్గర చేసుకోవడానికి వచ్చారా అని మళ్లీ బాంబు పేలుస్తాడు.. దీంతో జగతి వసు గురించి చెప్పిన పట్టించుకోకుండా మీరు ఏం చెప్పకండి అంటాడు.
జగతికి దండం పెట్టి మళ్లీ చెప్పిందే చెప్తాడు.. నన్ను అందరూ వదిలేశారు అంటూ చెప్తాడు.. మరో సీన్ లో వసుధర రిషికి ఫోన్ చెయ్యలేదని ఆలోచిస్తుంటుంది. నేను చెయ్యకపోతే మీరు చెయ్యరా అని అనుకుంటుంది.
అటువైపు రిషి కూడా తను నా గురించి ఆలోచించట్లేదా అని ఫీల్ అవుతుండగా ఏదో ఆలోచిస్తూ రిషి ఫోన్ నుంచి వసుధారకు ఫోన్ చేస్తాడు. కానీ వెంటనే కట్ చేస్తాడు. దీంతో అది చూసిన వసుధారా మిస్డ్ కాల్ ఇచ్చాడు ఏంటి సార్.. ఇప్పుడు నేను తిరిగి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది.
ఏది ఏమైతేనేం సారి ఫోన్ చేస్తే నేను చేస్తే తప్పేంటి అని చేస్తుంది. కానీ అటువైపు రిషి తనతో ఎలా మాట్లాడాలో తెలియక ఫోన్ కట్ చేస్తాడు.. సార్ ఏంటి ఇలా కట్ చేశారని వసుధారా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రిషి తన వాట్స్అప్ లో సారీ అనుకోకుండా కాల్ వచ్చింది నీకు నేను కావాలని చేయలేదు అని చెప్తాడు. అది చూసిన వసుధార సర్కిల్ నాపై ఇంకా కోపం పోలేదు ఏమో అని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. రిషి, వసుధార ఇద్దరు ఆ ప్రపోజ్ సీన్ నే గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతారు. ఆటోలో వసుధార వెళ్తుండగా ఆ వెనకే రిషి వస్తుంటాడు. చున్నీ ఆటో బయట ఉంటే ప్రమాదం అని చెప్పి ఆటో అతనికి చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.