- Home
- Entertainment
- Naga Vamsi: ఆదర్శ కుటుంబం వాయిదా..చుట్టమల్లే సాంగ్ ఏఐ వీడియో వివాదం, ఇన్వాల్వ్ కాబోతున్న పవన్ కళ్యాణ్
Naga Vamsi: ఆదర్శ కుటుంబం వాయిదా..చుట్టమల్లే సాంగ్ ఏఐ వీడియో వివాదం, ఇన్వాల్వ్ కాబోతున్న పవన్ కళ్యాణ్
విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా పడింది. నిర్మాత నాగవంశీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కొంత రిలీజ్ డేట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు.

ఆదర్శ కుటుంబం వాయిదా
అనుకున్నదే అయింది. సరిగ్గా రిలీజ్ కి నాలుగు రోజుల ముందు విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం చిత్రం వాయిదా పడింది. అక్టోబర్ 9న రిలీజ్ కావలసిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ తొలిసారి నటిస్తున్న చిత్రం ఇది. గతంలో త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి సినిమాల్లో వెంకీ నటించారు.
వాయిదాకి కారణం అదే
ఆయన దర్శకత్వంలో నటించడం ఇదే తొలిసారి. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డింపుల్ హయతి, నివేత పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే కారణం అని..మరే ఇతర అంశాలు కారణం కాదని నాగవంశీ తెలిపారు. సినిమాని వాయిదా వేస్తున్నందుకు వెంకటేష్ గారి అభిమానులకు క్షమాపణ చెప్పారు.
అదృష్టం కొద్దీ వెంకటేష్ గారు ఇండియాలో లేరు
కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. ప్రస్తుతం వెంకటేష్ గారు లండన్ లో ఉన్నారు. ఆయన ఇండియాకి తిరిగి రాగానే చర్చించి కొత్త రిలీజ్ డేట్ పై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. అక్టోబర్ 9 చాలా మంది డేట్. వాయిదా వేస్తున్నందుకు వెంకటేష్ గారికి కూడా చాలా కోపం వస్తుంది. కానీ అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఆయన ఇండియాలో లేరు. లేకుంటే కచ్చితంగా తిట్టేవారు అని నాగవంశీ అన్నారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఏఐ వీడియోపై కామెంట్స్
ఈ సందర్భంగా తీవ్ర వివాదం అయిన ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఏఐ డీప్ ఫేక్ వీడియో గురించి కూడా నాగవంశీ మాట్లాడారు. ఈ సంఘటనపై తారక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి బాధ్యులైన వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. నాగవంశీ మాట్లాడుతూ హీరోలని, హీరోయిన్లని ఇబ్బంది పెట్టాలా ఇలాంటి ఏఐ వీడియోలు అరికట్టేందుకు టాలీవుడ్ మొత్తం ఒక డెసిషన్ తీసుకోబోతోంది అని.. త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని నాగవంశీ అన్నారు.
ఇన్వాల్వ్ కాబోతున్న పవన్
మొత్తంగా చుట్టమల్లే సాంగ్ ఏఐ వీడియో వివాదంలో పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ కుటుంబం సినిమాకి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉంది. సోషల్ మీడియాలో ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేని విధంగా మంచి అవుట్ పుట్ కోసమే సినిమాని వాయిదా వేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ దీపావళికి ఉండొచ్చు అనే ప్రచారం సాగుతోంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఇటీవల మొదటి గీతంగా విడుదలైన ‘నారాయణమ్మ’ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే మిగతా పాటలు, ట్రైలర్ తో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

