- Home
- Entertainment
- Janaki Kalaganaledu: రామచంద్రను నడిరోడ్డుపై పట్టుకున్న పోలీస్..అతనికి చమటలు పట్టించి పరుగులు పెట్టించిన జానకి!
Janaki Kalaganaledu: రామచంద్రను నడిరోడ్డుపై పట్టుకున్న పోలీస్..అతనికి చమటలు పట్టించి పరుగులు పెట్టించిన జానకి!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభం లోనే జానకి (Janaki) రామచంద్రలు సెల్ఫీ దిగి నందుకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి 5000 ఫైన్ వేస్తారు. అది అతడు ఫేక్ పోలీస్ అని కనిపెట్టిన జానకి అతడికి చెమటలు పట్టించి.. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంది. ఇక మరోవైపు గోవిందరాజు రామచంద్ర మొదటి విడత గెలిచినందుకు ఆనంద పడుతూ ఉంటాడు.
అంతే కాకుండా రామచంద్ర (Rama Chandra) విషయంలో మల్లిక మాట్లాడే నెగిటివ్ కూతలను కూడా కొట్టి పారేస్తాడు. మరోవైపు జానకి (Janaki) దంపతులు కారులో చార్మినార్ దగ్గరకు వస్తారు. ఇక చార్మినార్ దగ్గర జానకి చుట్టూ చూస్తూ ఉండగా.. ఈలోపు రామచంద్ర కనిపించకుండా పోతాడు. జానకి రామచంద్రన్ ను కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది. ఈలోపు రామచంద్ర వచ్చి జానకి మీద చెయ్యి వేసాడు.
ఇక జానకి (Rama Chandra) రామచంద్ర (Rama Chandra) ను గట్టిగా చెంప మీద కొట్టి.. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని ఏడుస్తుంది. ఇక రామచంద్ర గాజులు చూపించి ఇవి కొన్ని మీ చేతికి తొడగాలనే వెళ్ళాను అని అంటాడు. ఆ మాటతో ప్రేమగా జానకి రామచంద్ర ను కౌగిలించుకుంది. ఇక చెఫ్ కాంపిటీషన్ లో రెండో రౌండ్ కు జడ్జీలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ ను కూడా ఇన్వైట్ చేస్తారు.
ఇక ఆ వంటల పోటీకి వచ్చిన జడ్జ్ సంజయ్ (Sanjay) వంటలు పోటీ అనగానే అందరికీ టెన్షన్ పడుతుంది. కానీ ఇష్టం స్టార్ట్ అవ్వాలి అని అంటాడు. ఇక తాను చేసిన వంటను అందరూ తిని వాళ్లు పొగిడితే.. ఆ కిక్కే వేరప్పా అంటూ ఆ పోటీలో పాల్గొన్న వారికి ఎంతో ఆసక్తిని నెలకొలపుతాడు. ఇక రెండో రౌండ్ లో వెస్టర్న్ ఫుడ్ టాస్క్ ఇవ్వగా రామచంద్ర (Rama Chandra) టెన్షన్ పడతాడు.
అది గమనించిన గోవిందరాజు (Govindaraju) దంపతులు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు . ఇక వాళ్ళు చెప్పిన మాటలు నాకే అర్థం కావడం లేదు.. అలాంటిది మన రామా కి ఎలా అర్థం అవుతాయి అండి అని జ్ఞానాంబ (Jnanamba) తన భర్తని అడుగుతుంది. ఇక అలాంటివి వాడెప్పుడూ చేసి ఉండడు.. చూసి ఉండడు అని బాధపడుతూ ఉంటుంది.
ఇక తరువాయి భాగం లో రామచంద్ర (Rama Chandra) చేసిన వంటను ఒక జడ్జి టేస్ట్ చేసి.. డిష్ ఇంకా పూర్తి కాలేదు అని నిరాకరిస్తుంది. ఇలాంటి పోటీలకు వచ్చినప్పుడు అన్ని రకాల వంటల్లో పట్టు ఉండాలి అని అంటుంది. ఇక ఇది గమనించిన జ్ఞానాంబ (Jnanamba) దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు.