- Home
- Entertainment
- Janaki Kalaganledu: ఇంటి ముందే కొట్టం వేసిన రామచంద్ర.. ఇదంతా జానకి చేసింది అంటూ ఫైర్ అవుతున్న జ్ఞానంబ!
Janaki Kalaganledu: ఇంటి ముందే కొట్టం వేసిన రామచంద్ర.. ఇదంతా జానకి చేసింది అంటూ ఫైర్ అవుతున్న జ్ఞానంబ!
Janaki Kalaganledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganledu) సీరియల్ పరువుగల కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జరిగిన దాని గురించి జ్ఞానాంబ (Jnanaamba) దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది.

ఒక వైపు జానకి, రామచంద్రలు కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటారు. జ్ఞానాంబ.. గోవిందరాజుతో (GovindhaRaju) నా బిడ్డకు ఈ అమ్మ మీద ఉన్న ప్రేమను జానకి పూర్తిగా చంపేసిందని అని చెబుతుంది. అంతేకాకుండా ఇదంతా జరిగింది ఆవిడ వల్లే ఆవిడ మాయమాటల వల్లే అని జానకి (Janaki) ను అసహ్యించుకుంటుంది.
నా బిడ్డను తన గుప్పెట్లో పెట్టుకుని నాకు కాకుండా చేసిందంటూ ఏడుస్తుంది. మరోవైపు రామచంద్ర (Ramachandra) ఈ బాధను భరించడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది అని అంటాడు. దాంతో జానకి రామ గారు అంటూ నోరు మూయిస్తుంది. అదే క్రమంలో రామచంద్ర తనకు వాళ్ళ అమ్మ తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటూ ఏడుస్తాడు.
ఇక మరోవైపు జ్ఞానాంబ (Jnanamba) కూడా ఏడుస్తుంది. ఇక రామచంద్ర అమ్మ ను వదిలేసి నేను రాలేను అంటాడు. ఇక జానకి రామచంద్ర (Ramachandra) లు తన తల్లి ఇంటి ముందల ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటారు. ఇక ఉదయాన్నే ఎంతో ఆనందంగా బయటకు వస్తున్న మల్లిక (Mallika) వాళ్లను అలా చూసి ఒకసారి గా స్టన్ అవుతుంది.
వెంటనే అది వాళ్ళ అత్తయ్య జ్ఞానాంబకు కూడా చూపిస్తుంది. ఇక అది గమనించిన గోవిందరాజు (Govindharaju).. రామా అదరగొట్టేసావు అని అంటాడు. ఇక జ్ఞానాంబ ఈ కొత్త నాటకం వెనక ఉన్న సరికొత్త మోసం ఏంటో అడగండి అని గోవింద రాజుతో అంటుంది. దాంతో రామచంద్ర (Ramachandra) నిన్ను చూడకుండా నేను ఉండగలనా అమ్మ అని అంటాడు.
దాంతో గోవిందరాజు (GovindhaRaju) ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. కానీ జ్ఞానాంబ మాత్రం కోపం బయటకు చూపించి.. తన ఎమోషనల్ ఫీలింగ్ లోపల దాచుకుంటుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర (Ramchandra) నాయనమ్మ ఇచ్చిన స్థలంలో నాకు ఉండే హక్కు లేదా అని అంటాడు.
ఇక దాంతో జ్ఞానాంబ (Jnanaamba) నువ్వు ఈ మాట అనడానికి కారణం ఏమిటో ఈ మాటలు వెనుక కారణం ఎవరో అని జానకి (Janaki) ను మనసులో పెట్టుకుని అంటుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.