Janaki Kalaganaledu: సీన్ అదిరిపోయింది.. రామచంద్ర ఒక్క డైలాగ్ తో ఎమోషనలైన జ్ఞానంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalagana Ledu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రామచంద్ర (Ramachandra) గుడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పులు విడిస్తూ ఉండగా ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళ దగ్గరకు వెళ్తాడు. దాంతో జ్ఞానాంబ వెంటనే అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు గోవిందరాజు (Govindaraju) రామచంద్రను బాధపడకురా మీ అమ్మది ప్రేమ తాలూకా కోపం అని అంటాడు.
ఇక ఫ్యామిలీ అందరూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని జానకి (Janaki) దంపతులతో చెప్పుకుంటారు. ఆ తర్వాత రామచంద్ర అమ్మ ఆశీర్వాదం తీసుకునే అవకాశం కూడా నాకు దక్కలేదు అని బాధపడుతూ జానకి తో చెప్పుకుంటాడు. నేను దండం పెట్టుకోవడానికి అమ్మ పాదాలు అయితే ఏంటి? అమ్మ చెప్పులు అయితే ఏంటి అని జ్ఞానాంబ (Jnanamba) చెప్పులకు దండం పెట్టుకుంటాడు.
ఇక ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో మల్లిక (Mallika) అత్తయ్య గారు మనం వేరే గుడికి వెళ్దామా అని అంటుంది. ఎందుకంటే మీరు జానకి ముఖం చూడలేకపోతున్నారు ఏమో అని అంటుంది. దాంతో గోవిందరాజు (Govindaraju) అమ్మ పుల్లల మల్లికా ఆపుతావా అన్నట్లు విరుచుకు పడతాడు. ఇక మల్లిక మాటలు విన్న జానకి దంపతులు కొంత బాధ పడతారు.
ఇక పూజా కార్యక్రమం మొదలు పెట్టే క్రమంలో పంతులు గారు పెద్దకొడుకు పెద్దకోడలు ఎక్కడ అని అడుగుతాడు. ఇక గోవింద రాజు (Govindaraju) వారిద్దరిని పిలిచి కాస్త నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టు అని జ్ఞానాంబ (Jnanamba) తో అంటాడు. ఇక తల్లి కొడుకులు ఎంతో ఆనందంగా పూజలో పాల్గొంటారు.
ఆ తర్వాత రామచంద్ర (Ramachandra) సీతారాముల కళ్యాణం లో వాళ్ళ అమ్మ పక్కన కూర్చునే అదృష్టం లేనందుకు విచారం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు ఇది మొదటి కళ్యాణం కాబట్టి సాంప్రదాయం ప్రకారం కొడుకు కోడలు కూర్చుంటే మంచిది అని అంటారు. దాంతో మల్లిక (Mallika) చిరాకు పడుతుంది.
ఇక తరువాయి భాగం లో జానకి (Janaki) రామచంద్ర (Ramchandra) లు స్టేజ్ పై సీతారాముల వేషాలు వేస్తారు. ఇక రామచంద్ర జ్ఞానాంబ కు అర్థమయ్యేలా నువ్వు లేకుండా ఈ గుండె ఉండ లేదమ్మా అని అంటాడు. దాంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఎమోషనల్గా లేస్తుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.