- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి చదువు గురించి తెలుసుకున్న గోవిందా రాజు.. జ్ఞానాంబ సర్టిఫికెట్లు ఇస్తుందా?
Janaki Kalaganaledu: జానకి చదువు గురించి తెలుసుకున్న గోవిందా రాజు.. జ్ఞానాంబ సర్టిఫికెట్లు ఇస్తుందా?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba)ఇంటికి వచ్చిన అమ్మాయికి తన కోడలు జానకి గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి కూడా ఆ అమ్మాయికి సంసారం గురించి చక్కగా జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటికి వచ్చిన అమ్మాయి జానకి మాటలు విని మనసు మార్చుకుని జానకి(janaki) గురించి గొప్పపా పొగుడుతుంది. ఆ మాటలు విన్న జ్ఞానాంబ సంతోషపడుతూ ఉంటుంది.
ఆ మాటలు వింటున్న రామచంద్ర(rama Chandra)బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత రామచంద్ర, జానకి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. జానకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ గురించి ఇద్దరు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వారిద్దరి మాటలు విన్న గోవిందరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో రామచంద్ర జానకి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు విషయం తెలుసుకుని గోవిందరాజు(govindaraju)రామచంద్రను నిలదీయగా,అప్పుడు రామచంద్ర ధైర్యం తెచ్చుకొని నేనే చదివిస్తున్నాను నాన్న అని చెబుతాడు.
అప్పుడు గోవింద్ రాజు టెన్షన్ పడుతూ జ్ఞానాంబ( jnanamba)కు ఈ విషయం తెలిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు జానకి ఐఏఎస్ కల గురించి గొప్పగా చెబుతాడు రామచంద్ర. ఆ మాటలకు జానకి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర ఇందులో జానకి(janaki)గారు తప్పు లేదు. అమ్మకు ఇచ్చిన మాట కోసం ఐఏఎస్ కల వద్దు అనుకుంది. కానీ నా బలవంతం మీద చదువుతోంది అని అంటాడు.
అప్పుడు రామచంద్ర(ramachandra)గోవిందరాజులు చేతులు పట్టుకుని బ్రతిమలాడతాడు. మీ అమ్మతో మాట్లాడి ఏదో ఒక విధంగా కాగితాలు వచ్చేలా చేస్తాను అని వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్లిపోతాడు. అప్పుడు జానకి, రామచంద్రను గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. మరొకవైపు జానకి(janaki)చదువు కాగితాల గురించి ఎలా గుర్తించాలి అని గోవిందరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు జ్ఞానాంబ(jnanamba)జానకి గురించి గొప్పగా పొగడగా అప్పుడు గోవిందరాజు నీ కోడల మీద నమ్మకం ఉంటే తన చదువు కాగితాలు నీ దగ్గర పెట్టుకోవు కదా అని అనగా అప్పుడు జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. అప్పుడు గోవిందరాజు ప్లాన్ సక్సెస్ అవడంతో సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ,జానకి(janaki)చదువు కాగితాలను ఇచ్చేస్తాను అని బయలుదేరుతుంది. కానీ జానకి నెల తప్పింది అన్న రోజు ఆ కాగితాలని జానకి ఇచ్చేస్తాను అని అంటుంది.
కానీ గోవిందరాజు(govindaraju)చేతి వరకు వచ్చి జారిపోయింది అని బాధపడుతూ ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు రామచంద్ర దంపతులు కాగితాల విషయం గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోనే గోవింద రాజు అక్కడికి వస్తాడు. అప్పుడు గోవిందరాజు అసలు విషయం చెప్పడంతో జానకి రామచంద్ర(ramachandra) ఒకసారిగా షాక్ అవుతారు. వారి మాటలు వింటున్న మల్లిక అసలు విషయం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జ్ఞానాంబ దగ్గర ఉన్న బీరువా బీగాలు తీసుకుని వచ్చి రామచంద్ర జానకిలకు చూపిస్తాడు.