గోవిందా కెరీర్‌ని కోలుకోకుండా దెబ్బకొట్టిన 7 డిజాస్టర్ మూవీస్
ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా చాలా ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. 'మనీ హై తో హనీ హై' నుండి 'ఆ గయా హీరో' వరకు, చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. వీటి వెనుక కొన్ని కారణాలు తెలుసుకుందాం.

మనీ హై తో హనీ హై
బాలీవుడ్ హీరో గోవిందా హీరోగా 2008 లో వచ్చిన 'మనీ హై తో హనీ హై' సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ డిజప్పాయింట్ చేసింది.
నాటీ ఎట్ 40
2011 లో వచ్చిన 'నాటీ ఎట్ 40' లో శక్తి కపూర్ తో కలిసి గోవిందా నటించారు. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కామెడీ ఫిల్మ్ గా రచ్చ చేస్తుందనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు.
లూట్
2011 లో వచ్చిన 'లూట్' సినిమాలో సునీల్ శెట్టి, మిథున్ చక్రవర్తి తో కలిసి గోవిందా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
దీవానా మై దీవానా
2013 లో వచ్చిన 'దీవానా మై దీవానా' లో గోవిందా, ప్రియాంక చోప్రా కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.
హ్యాపీ ఎండింగ్
2014 లో వచ్చిన 'హ్యాపీ ఎండింగ్' సినిమాలో గోవిందా నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. భారీ కాస్టింగ్‌తో వచ్చిన ఈ చిత్రం బాగా నిరాశ పరిచింది.
ఫ్రైడే
2018 లో వచ్చిన 'ఫ్రైడే' సినిమాలో గోవిందా ప్రధాన పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
ఆ గయా హీరో
2017 లో విడుదలైన గోవిందా 'ఆ గయా హీరో' సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. IMDb లో 2.3 రేటింగ్ పొందింది. గోవింద కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ గోవింద కెరీర్‌ని బాగా దెబ్బకొట్టాయి. కోలుకోలేకుండా చేశాయి. ఆ తర్వాత ఆయన మూవీస్ చేయడానికి ఆచితూచి వ్యవహరించడం గమనార్హం.