MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ చివరి 10 సినిమాల్లో అసలైన హిట్లు ఎన్ని..అభిమానులు త్వరగా మరచిపోవాలి అని కోరుకునే మూవీ అదే

పవన్ కళ్యాణ్ చివరి 10 సినిమాల్లో అసలైన హిట్లు ఎన్ని..అభిమానులు త్వరగా మరచిపోవాలి అని కోరుకునే మూవీ అదే

Pawan Kalyan last 10 Movies list: పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇప్పటి వరకు 10 సినిమాల్లో నటించారు. ఆ 10 సినిమాల జాబితా ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 20 2026, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Pawan Kalyan
Image Credit : Asianet News

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్టాడ్ భగత్ సింగ్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఆ రేంజ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ ఉస్తాద్ చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ వస్తోంది. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ 10 సినిమాల్లో నటించారు. ఆ 10 సినిమాల్లో ఏది హిట్, ఏది ఫ్లాప్ అనేది ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
1.గోపాల గోపాల
Image Credit : instagram

1.గోపాల గోపాల

కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో పవన్, వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అబౌ యావరేజ్ గా నిలిచింది. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం 41 కోట్లు వసూలు చేసింది.

ఫలితం : అబౌ యావరేజ్

311
2. సర్దార్ గబ్బర్ సింగ్
Image Credit : our own

2. సర్దార్ గబ్బర్ సింగ్

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కథ అందించారు. బాబీ దర్శకుడు. పవన్ క్రేజ్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ సినిమా డిజాస్టర్ అయింది. అభిమానులని సైతం పూర్తిగా నిరాశ పరిచింది.

ఫలితం: ఫ్లాప్

411
3. కాటమరాయుడు
Image Credit : instagram

3. కాటమరాయుడు

పవన్ మరోసారి కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో నటించిన చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ బావున్నప్పటికీ సెకండ్ హాఫ్ తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్.

ఫలితం: ఫ్లాప్

511
4. అజ్ఞాతవాసి
Image Credit : our own

4. అజ్ఞాతవాసి

ఈ సినిమా రిలీజ్ టైంలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అంతా భావించారు. కానీ థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ కి తీవ్ర నిరాశ తప్పలేదు. ప్రేక్షకులని ఈ మూవీ ఏమాత్రం మెప్పించలేకపోయింది. అభిమానులు అయితే ఈ చిత్రాన్ని త్వరగా మరచిపోవాలని కోరుకున్నారు.

ఫలితం: ఫ్లాప్

611
5. వకీల్ సాబ్
Image Credit : instagram

5. వకీల్ సాబ్

అజ్ఞాతవాసి తర్వాత పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పింక్ చిత్రానికి రీమేక్ గా రూపొందింది. రీమేక్ అయినప్పటికీ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి కోవిడ్ పరిస్థితులు, టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ నిబంధనలు లాంటి అడ్డంకులని అధికమిస్తూ వకీల్ సాబ్ విజయం సాధించింది.

ఫలితం: హిట్

711
6. భీమ్లా నాయక్
Image Credit : our own

6. భీమ్లా నాయక్

మలయాళీ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. కథని పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, పవన్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడేలా మార్చేశారు. ఈ మూవీలో పవన్, రానా దగ్గుబాటి పోటా పోటీ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్.

ఫలితం: హిట్

811
7. బ్రో
Image Credit : google

7. బ్రో

పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన ఈ చిత్రం ఫిలాసఫీ ఇష్టపడే వారికి నచ్చింది. కానీ జనరల్ ఆడియన్స్ నుంచి సరైన రాలేదు. ఫలితంగా ఈ మూవీ నిరాశ పరిచింది.

ఫలితం: ఫ్లాప్

911
8. హరిహర వీరమల్లు
Image Credit : X/Harihara Veeramallu

8. హరిహర వీరమల్లు

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం ప్రీరియాడిక్ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్ చాలా బావున్నప్పటికీ గ్రాఫిక్స్, చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకోలేకపోయింది.

ఫలితం: ఫ్లాప్

1011
9. దే కాల్ హిమ్ ఓజీ
Image Credit : Instagram

9. దే కాల్ హిమ్ ఓజీ

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులని ఫుల్ ఖుషీ చేసిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పవన్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తూ యాక్షన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

ఫలితం: సూపర్ హిట్

1111
10. ఉస్తాద్ భగత్ సింగ్
Image Credit : Asianet News

10. ఉస్తాద్ భగత్ సింగ్

ఉగాదికి విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ లాంగ్ వీకెండ్, ఇకపై సమ్మర్ హాలిడేస్ ఉండడంతో కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం ఎలాంటి ఫలితం సాధిస్తుంది అనేది వేచి చూడాలి.

ఫలితం: వేచి చూడాలి

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Related Stories
Recommended image1
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తర్వాత చిరంజీవి మరో సంచలన నిర్ణయం..ఆ హీరో స్ఫూర్తితోనే, అలాంటోడు ఒక్కడుంటే చాలు
Recommended image2
పెళ్లి అనేది పర్సనల్ మ్యాటర్, అందుకే పబ్లిసిటీ జిమ్మిక్కులు చేయడం లేదు.. తీవ్రంగా విరుచుకుపడ్డ అనుష్క
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved