- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జ్ఞానాంబ ముందు వంటల పోటీ గురించి బయటపడిన నిజం.. ఆనందంలో మల్లిక!
Janaki Kalaganaledu: జ్ఞానాంబ ముందు వంటల పోటీ గురించి బయటపడిన నిజం.. ఆనందంలో మల్లిక!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సునంద (sunanda)మా స్వీట్ షాప్ ఓపెనింగ్ కి మీరు కుటుంబ సమేతంగా అందరూ తప్పకుండా రావాలి అని చెప్పి స్వీట్ బాక్స్ జ్ఞానాంబకు ఇస్తుంది. అప్పుడు కన్నబాబు(kannababu), రామచంద్ర అప్పుడప్పుడు మాకు కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతారు. ఆ తరువాత కన్నబాబు, సునంద మాట్లాడుకుంటూ మనం ఇచ్చిన షాక్ తో ఆ రామచంద్ర జానకి లకు షాక్ తగిలింది అని ఆనంద పడుతూ ఉంటారు.
ఇంతలో జానకి (janaki)వచ్చి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని అనడంతో మీరు ఇచ్చిన గడువు సమయానికి డబ్బులు కట్టలేరు కాబట్టి మా ఏర్పాట్లలో మేము ఉన్నాం అని అన్నాడు కన్నబాబు. అప్పుడు జానకి గడువు దాకా నోరు మూసుకుని ఉండు ఇక్కడినుంచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తుంది. కానీ మల్లిక (mallika)మాత్రం దీని వెనక ఏదో కారణం ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.
మరొకవైపు జానకి,రామచంద్ర(rama chandra)లు డబ్బు విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రామచంద్ర డబ్బుల విషయం గురించి కన్నబాబు అన్న మాటల గురించి భయపడుతూ ఉంటారు. ఇంతలో జానకి(janaki) డబ్బుల విషయం మాట్లాడుతూ ఉండగా అక్కడికి గోవిందరాజు వస్తాడు.
అప్పుడు గోవిందరాజు (govinda raju)ఏంటమ్మా డబ్బులు అంటున్నారు అని అనగా అప్పుడు ఏమి లేదు అని అంటాడు రామచంద్ర. అయితే వారు మాట్లాడుకుంటున్న మాటలను గోడ చాటు నుంచి మల్లిక వింటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు ఒక బాక్స్ లో డబ్బులు పెట్టి రామచంద్ర(rama chandra)కి ఇస్తాడు. అప్పుడు రామచంద్ర ఎందుకు అని అనగా అప్పుడు గోవిందరాజు ఎమోషనల్ అవుతాడు.
అప్పుడు గోవిందరాజు హైదరాబాద్ కీ వెళదానికి టికెట్స్ ఇచ్చి నువ్వు ఎలా అయినా వంటల పోటీల్లో గెలవాలి అని అనడంతో ఆ మాటలు విన్న మల్లిక (mallika)ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మల్లిక వెళ్లి జ్ఞానాంబ (jnanamba)తో రామచంద్ర, జానకి విజయవాడ కి కాదు హైదరాబాద్ వంటల పోటీకి వెళ్తున్నారు అని చెప్పడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది.
అప్పుడు జానకి,జ్ఞానాంబ(jnanamba)కీ జానకి,రామచంద్రల మీద లేనిపోని చాడీలు అన్ని చెప్పి రెచ్చగొడుతుంది. రేపటి ఎపిసోడ్ లో జ్ఞానాంబ మల్లిక మాటలు నమ్మి వెళ్లి విజయవాడ టికెట్ గురించి అడుగుతుంది. అప్పుడు జానకి(janaki) రామచంద్ర, గోవిందరాజు టెన్షన్ పడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.