- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జెస్సికి ధైర్యాన్నిచ్చిన జానకి.. కోపంతో రగిలిపోతున్న జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: జెస్సికి ధైర్యాన్నిచ్చిన జానకి.. కోపంతో రగిలిపోతున్న జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జెస్సి తల్లిదండ్రులు, జెస్సి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అని జానకికి ఫోన్ చేసి చెప్తారు. జానకి భయపడి అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ మేడం, ఎగ్జామ్ రాయకుండా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అని అడుగుతారు. ఇంపార్టెంట్ మేడం,పరీక్ష రాసే పరిస్థితుల్లో నేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. వెంటనే జానకి జెస్సి వాళ్ళ ఇంటికి వచ్చి,జెస్సి దగ్గరికి వెళ్లి ఓదార్చుతుంది. నేను మా ఇంట్లో వాళ్లతో మాట్లాడుతాను అని చెప్పాను కదా.
ధైర్యంగా ఉండు అని జానకి అనగా జెస్సి, అక్క మీరు నాకు ఎంత ధైర్యం చెప్పినా నాకు ఈ సమయంలో తోడుగా ఉండవలసింది అఖిలే. కానీ ఇప్పుడు కడుపు తీసుకుంటావా లేకపోతే ఇంక జీవితంలో నేను నీకు దక్కను అని బెదిరిస్తున్నాడు. నాకు భయమేసింది అక్క.ఇలా ప్రతిరోజు భయపడుతూ చావడం కన్నా ఒకేసారి చనిపోతే మంచిది అని చావలనుకున్నాను అని అంటుంది జెస్సీ. అప్పుడు జెస్సి మాటలు విన్న జానకి, అఖిల్ అలాగన్నాడా?నువ్వేం భయపడొద్దు నేను మాట్లాడతాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది.
అప్పుడు జెస్సి,అక్క నాతో కొంచెం సేపు ఉండవా ధైర్యంగా ఉంటుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ గోవిందరాజులు,కూర్చొని మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము అలాగే ఈ సమస్య కూడా ఎదుర్కోగలము అని అంటారు. ఇంతలో జానకి వాళ్ళ టీచర్ జ్ఞానాంబ కి ఫోన్ చేసి, జానకి కి ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తున్నాయా? మరి పరీక్షకి వచ్చి రాయకుండా వెళ్ళిపోయింది. ఈ పరీక్షలు చాలా ముఖ్యమైనవి ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అని చెప్పండి అని అనగా సరే అండి నేను విషయం కనుక్కుంటాను అని జ్ఞానాంబ అంటుంది.
అప్పుడు జ్ఞానాంబ గట్టిగా జానకి ఎందుకు ఇలా చేస్తుంది. పరీక్ష రాయకుండా వెళ్ళిపోయిందట అని అనగా మల్లికా, చూశారా అత్తయ్య గారు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నట్టు ఇంటి బయట ఉండరు. కాలేజీకి వెళ్లి బంకు కొట్టిన విద్యార్థి లాగా పరీక్ష రాయకుండా జెస్సి దగ్గరికి వెళ్ళుంటాది.మన ఇంట్లో వాళ్ళ కన్నా వాళ్ళే ఎక్కువైపోయారు దానికి అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ రామాతో, నువ్వు జానకిని కాలేజీలో దింపావు కదా అని అనగా అవునమ్మా దింపాను, నేను ఒకసారి ఏమైందో కనుక్కుంటాను అని రామా అంటాడు.
అప్పుడు జ్ఞానాంబ, వద్దు జానకి ఇంటికి రాని తనంతట తానే చెప్తాది అని అంటుంది.అందరూ జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు గోవిందరాజు మనసులో జ్ఞానం చాలా కోపంగా ఉన్నది అని అనుకుంటాడు. అప్పుడు మల్లికా, పోలేరమ్మ చాలా కోపంగా ఉన్నది జానకికి ఇచ్చిన ఐదవకాశాలు ఒక్కసారే చేరిపేసెలా ఉంది అని సంబరపడిపోతుంది.ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. జానకి పరీక్ష రాసేవా అని అనగా రాయలేదు అత్తయ్య గారు అని అంటుంది జానకి. అప్పుడు మల్లికా చూసారా అత్తయ్య గారు మీ ముందు ఎంత ధైర్యంగా తప్పు ఒప్పుకుంటుందో.
మీకన్నా వాళ్లే ఎక్కువైపోయారు మీరు ఎంత చెప్పినా వినకుండా ఆ జెస్సి గురించి ఆలోచిస్తుంది అని అనగా జెస్సి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అత్తగారు అని జానకి చెప్తుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.ఒక మూల నుంచి అఖిల్ విని భయపడిపోతాడు. అప్పుడు మల్లికా, జానకి నాటకాలు ఆపు, అత్తయ్య గారిని బెదిరించి జెస్సి తో అఖిల్ కి పెళ్లిచేసేద్దాం అనుకుంటున్నావు కదా అందుకే ఈ సూసైడ్ అని నమ్మిస్తున్నావు అని అనగా, సూర్యుడికి గ్రహణం పట్టినంత మాత్రాన వెలుగు ఇవ్వడం మానేయడు.
అలాగే సాక్ష్యాలు లేనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు అని అంటుంది జానకి. అప్పుడు జ్ఞానాంబ, ఇదే నీకు నేను ఇస్తున్న చివరి అవకాశం జానకి ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నేను నీకు తప్పు నిరూపించుకోమని చెప్పాను కానీ పరీక్షలు వదిలేసి నిరూపించుకోమని చెప్పలేదు అని అంటుంది. అప్పుడు మళ్ళీక ఆశ్చర్యపోయి, ఒక అవకాశం చెరిపేయరా?అని బాధపడుతుంది.ఆ తర్వాత సీన్లో రామా అఖిల్ నీ బైటకు పిలిచి,అఖిల్ నిజం చెప్పు అని అనగా నేను అమ్మ మీద ఒట్టేసిన తర్వాత కూడా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్నయ్య అని అంటాడు అఖిల్.
అప్పుడు రామా, నీకు ఒట్టు మీద ఉన్న నమ్మకం కన్నా అమ్మ మీద ఉన్న భయం ఎక్కువ. నువ్వు నాకు నిజం చెప్తే నేను ఏదైనా చేసి నీ పెళ్లి జరిపిస్తాను. అమ్మ మీద భయంతో నువ్వు కడుపు తీయించుకోమని జెస్సికి చెప్పి ఉండొచ్చు అని అనగా, నన్ను ఎందుకు ఎవరు నమ్మడం లేదు అన్నయ్య. నేను తప్పు చేయలేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.వెళ్లి విషం బాటిల్ తెరుస్తాడు అఖిల్.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!