MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: వాయినాలు తీసుకోకుండా వెళ్లిపోయిన ముత్తైదువులు.. జానకిపై ప్రిన్సిపాల్ కంప్లైంట్!

Janaki Kalaganaledu: వాయినాలు తీసుకోకుండా వెళ్లిపోయిన ముత్తైదువులు.. జానకిపై ప్రిన్సిపాల్ కంప్లైంట్!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 28వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

2 Min read
Author : Navya G
Published : Sep 28 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...లీలావతి, మన పూజలూ, పురస్కారాలు వాళ్లకేం తెలుస్తాయి అని అనగా జానకి,నేర్చుకుంటే తెలుస్తుంది కదా పిన్ని గారు అందుకే పూజల కూర్చోబెట్టాము అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ పూజారిగారుతో పూజ కానివ్వండి అని అంటుంది. అప్పుడు పూజారిగారు జానకిని పాట పాడమని చెప్తారు. అప్పుడు జానకి పాట పాడుతూ ఉండగా ఇంతలో మల్లిక జెస్సీ తో నువ్వు కూడా పాడు జెస్సీ అత్తయ్య గారి ముందు నీకు మంచి పేరు వస్తుంది అని అనగా జెస్సి పాడుతుంది.
 

27

అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తన గొంతు విని చిరాకుగా మొఖం పెడతారు. అప్పుడు జెస్సి అందరూ ఇలా చూస్తున్నారు ఏంటి ఏవైనా తప్పు చేశానా అని అనుకుంటుంది.ఇంతలో లీలావతి, ఇప్పటికిప్పుడే నేర్చుకోమంటే తను మాత్రం ఏం నేర్చుకుంటుందో లేండి అయినా ఇలాంటి వాళ్ళను పూజ దగ్గరికి తీసుకురావడం ఎందుకు? అన్నీ నేర్పించి తీసుకురావాలి కదా అని ముత్తైదువులందరూ అంటారు. పూజారి గారు హారతి ఇస్తారు. లీలావతి మనసులో, మల్లికా వయనాన్ని హారతి పళ్లెం పక్కనే పెట్టింది నిప్పు అంటుకుంటుంది అని అనుకుంటుంది.
 

37

అప్పుడు వాయినాలు ఇస్తున్నప్పుడు వాటికి మంటలు వచ్చి కాలిపోతాయి.జానకి వెళ్లి వాటిని ఆపుతుంది.అప్పుడు ముత్తైదువులందరూ చూశారా ఇది! కొత్తకోడలు వచ్చింది వెంటనే ఇలా జరిగిందంటే మనం ఏమనుకోవాలి. ఇంట్లో భర్త పిల్లలు ఉన్న కుటుంబాలు మనవి.ఇప్పుడు ఈ వాయనం తీసుకుంటే మనం కుటుంబానికి ప్రమాదం అని చెప్పి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా జానకి,అలా కాదు పిన్ని గారు మీరు ఇప్పుడు తీసుకోకపోతే మేము చేసిన పూజకు ఫలితం ఉండదు.
 

47

 దయచేసి తీసుకోండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారు. అప్పుడు జ్ఞానాంబ, నేనేం తప్పు చేశాను అని నాకు ఇలా అవుతుంది. అందుకే నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందనే పూజ చెయ్యొద్దు అని అనగా జానకి,అలా కాదు అత్తయ్య గారు వాళ్ళందరూ వెళ్లిపోతేనేమి మంచి మనసు ఉన్న మీరు అయిదుగురు ముత్తయిదుగులతో సమానం మా వాయనాలు మీరు తీసుకొని మా అందరిని ఆశీర్వదించండి అని అంటుంది. అప్పుడు మల్లిక మనసులో,నిజంగానే పోలేరమ్మ ఒప్పుకుంటుందా అని అనుకుంటుంది.
 

57

అప్పుడు జ్ఞానాంబ కొంతసేపు ఆలోచించి సరే అని అంటుంది. అప్పుడు జానకి వెళ్లి జ్ఞానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది, అలాగే మల్లిగా కూడా తీసుకుంటుంది .అప్పుడు జెస్సీ  భయపడుతూ వెళ్లి ఆశీర్వాదం తీసుకోగా జ్ఞానంబ ఆశీర్వదిస్తుంది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ తర్వాత సీన్లో జానకి కాలేజీ ప్రిన్సిపల్, రోడ్డు మీద వెళ్తూ ఉండగా రామ కనిపిస్తాడు. అప్పుడు రామా ను ఆపి మీకోసం మీ ఇంటికే వస్తున్నాను రామ గారు. జానకి చాలా తెలివైన అమ్మాయి దేనినైనా చాలా చక్కగా గుర్తు పెట్టుకుంటుంది.
 

67

 కానీ ఈ మద్య తను చదువులో శ్రద్ధను తగ్గిస్తుంది. మొన్న ఒక పరీక్ష కూడా రాయలేదు.తను  ఏదో సమస్యతో ఉన్నట్టు నాకు అర్థమైంది అది బహుశా మీ ఇంటి సమస్య అయ్యుండొచ్చు. త్వరలో పెద్ద పరీక్షలు ఉన్నాయి మీరే తన్ని జాగ్రత్తగా చదివిపించండి అలాగే ఇలాంటి సమయంలో వ్యాయామం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తారు. అప్పుడు దానికి రామా సరే అండి అలాగే చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ జరిగిన విషయం అంతా గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
 

77

 ఇంతలో గోవిందరాజు అక్కడికి వస్తాడు. అప్పుడు జ్ఞానాంబ, కష్టానికి ఎందుకో మనం బాగా నచ్చినట్టు ఉన్నామండి అందుకే వద్దన్నా మన దగ్గరికి వస్తుంది అని అంటుంది. దానికి గోవిందరాజు, అఖిల్ జెస్సీ గురించేనా నువ్వు మాట్లాడుతుంది అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved