MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: అఖిల్ గురించి నిజం తెలుసుకుని కోపంతో జ్ఞానాంబ.. భర్తకు జెస్సి వార్నింగ్?

Janaki kalaganaledu: అఖిల్ గురించి నిజం తెలుసుకుని కోపంతో జ్ఞానాంబ.. భర్తకు జెస్సి వార్నింగ్?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Sep 22 2022, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి అఖిల్ తో, నేను నిన్ను మరిదిలా కాకుండా కన్న కొడుకుల చూసుకున్నాను. నువ్వు నీ ప్రేమ విషయం చెప్పినప్పుడు కూడా నేను వెళ్లి అత్తయ్య గారితో మాట్లాడి ఒప్పిద్దాం అనుకున్నాను కానీ నువ్వు చివరి నిమిషంలో మాట మార్చి నాకు నమ్మకద్రోహం చేశావు.ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అఖిల్ వెళ్లి అమ్మకు నిజం చెప్తాము అని అంటుంది జానకి. అప్పుడు అఖిల్,నేను కూడా అమ్మకి చెబుదామనే అనుకున్నాను అక్క కానీ ఎప్పుడైతే అమ్మ నా మీద ఒట్టేయు అని మాట అన్నదో నాకు భయం పుట్టింది.అప్పుడు నుంచి అమ్మ దగ్గర నేను దోషిగా నిలబడకూడదు అని నిన్ను, అన్నయ్యని కూడా అలా అనాల్సి వచ్చింది.కానీ నేను ఎంత చేసినా అమ్మకు మాత్రం నిజం చెప్పలేను,అమ్మ దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకోలేను సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 

28

అప్పుడు రామా ఈ సంఘటన అంతా చూసి కోపంతో వచ్చి కొడుతూ ఉంటాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద. నాకు ఇంట్లో చదవడానికి పరిస్థితిలు ఒప్పుకోలేదు, మీ చిన్నన్నయ్యకి చదువుకునే ఉద్దేశం లేదు,మా ఇద్దరి కలనీ నీ దగ్గర తీర్చుకుందాం అనుకున్నాము.నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు నీకు డబ్బులు ఇచ్చి, ఏం అడిగితే అది చేశాను. నువ్వు జూదమాడుతున్నావని మీ వదిన చెప్పినా సరే చిన్నపిల్లలు కదా అని నేను పట్టించుకోలేదు. కానీ నువ్వు ఇంత అసహ్యమైన పని చేస్తావు అని అనుకోలేదు. నీవల్ల అక్కడ ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది. అమ్మ నిన్ను అంత ప్రేమగా చూసుకున్నది రా, మా మాటలు కూడా నమ్మకుండా నిన్ను నమ్మింది. ఆ నమ్మకాన్ని వొమ్ము చేశావు,తప్పు చేసి అమ్మ మీదే వొట్టు వేసావ్ కదా! అసలు నీకు ఇలా ఎలా చేయాలో అనిపించింది.

38

స్వీట్ కొట్టు నడుపుకొని నిన్ను చదివిస్తుంది, నువ్వు మేము గర్వించే స్థాయికి వెళ్తావు అనుకున్నా, అలాంటిది ఈ వయసులో ఆ పనులు ఏంట్రా? రా వెంటనే వెళ్లి అమ్మ ముందు ఒప్పుకో అని కొడుతూ ఉంటాడు. అప్పుడు జానకి రామాను ఆపి ఆగండి రామ గారు, కొట్టినంత మాత్రాన సమస్య తీరదు కదా అని ఆపుతుంది. ఈ సంఘటనంతా జ్ఞానాంబ చూస్తూ ఉంటుంది. అప్పుడు అఖిల్,అన్నయ్య నువ్వు నన్ను చంపేసిన సరే నేను మాత్రం అమ్మతో నిజం చెప్పను అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.అప్పుడు జ్ఞానాంబ ఇదంతా విని అఖిల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినది గుర్తు తెచ్చుకొని అలా కింద పడిపోతుంది. జానకిరామాలు జ్ఞానాంబ నీ చూసి పరిగెట్టుకుంటూ వెళ్లి నీళ్లను ఇస్తారు. 

48

వాడు అంత పెద్ద తప్పు చేస్తాడని నేను అనుకోలేదు, వాడి కోసం మీ ఇద్దరినీ కూడా నేను అనుమానించాను. తల్లి మీద ఒట్టేసాడు. ఈరోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారు.వాన్ని ఇంట్లో ఉండొద్దు అని చెప్పు జానకి అని అంటుంది. అప్పుడు జానకి దీనికి పరిష్కారం అది కాదు అత్తయ్య గారు అని అనగా మరి ఏం చేద్దాము నువ్వేం చెప్తే అది చేద్దామని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత రోజు పెళ్లి అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు జ్ఞానాంబ అఖిల్ నీ కొడుతూ, ఏం పాపం చేస్తే పుట్టావురా, నీ మీద నమ్మకంతో జానకిరాములను కూడా అనుమానించాను. తప్పుచేసి తల్లి మీద ఒట్టేసావు కదరా ఎంత నమ్మకంతో ఉన్నాను రా.నింద భరించలేక ఆత్మహత్య చేసుకున్నవంటే ఆ నమ్మకాన్ని ఇంకా బలంగా నమ్మాను అని తిడుతుంది. అప్పుడు అఖిల్ జ్ఞానాంబ కాల్ల మీద పడి, అమ్మ నువ్వు తిడతావన్న భయంతోనే తప్ప ఇంకే దురుద్దేశంతోనే నేను అనలేదు అమ్మ అని అంటాడు అఖిల్.

58

అప్పుడు జ్ఞానాంబ, ఈరోజు నుంచి నీకు నాకు మాటలు లేవు అలాగే నీ భార్యతో కూడా నాకు సంబంధం లేదు అని చెప్తుంది.అప్పుడు రామా వెళ్లి,అలా కాదమ్మా కొడుకుతో మాట్లాడ లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ బాధ అఖిల్ కి రాకూడదు అని అనగా జ్ఞానాంబ వినకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు అఖిల్ వెళ్లి రామ నీ హద్దుకుంటాడు. అప్పుడు జెస్సీ, థాంక్స్ అక్క నీ వల్లే ఈ పెళ్లి జరిగింది అని అనగా అక్కకి ఎవరైనా థాంక్స్ చెప్తారా,అత్తయ్య గారి గురించి నీకు తెలిసింది కదా!ఈరోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
 

68

ఎప్పటికైనా అత్తయ్య గారు మిమ్మల్ని క్షమిస్తారు బాధపడొద్దు అని అంటుంది. ఆ తర్వాత మల్లిక గదిలోకి వెళ్లి నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి అయింది. స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న వ్యక్తి సీరియల్ లో జూనియర్ ఆర్టిస్ట్ అయినట్టు, నేను ఎంతో ఘనంగా అనుకుంటే ఇక్కడ సీన్ అంతా తారుమారు అయిపోయింది అని చెప్పి దిండు లో ఉన్న దూదినంత జల్లేస్తుంది. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు ఇల్లంతా సంతోషంగా ఉంటే నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు అని అడగగా, మీరు కడుపుతో ఉన్నారా లేదు కదా!
 

78

కడుపుతో ఉన్న వాళ్లకి ఇలాగే మూడు బాగోదు మీకేం తెలుసు? ఇప్పుడు మీరు నన్ను అనుమానిస్తే నాకు కడుపులో బిడ్డ బాధపడుతుంది అని అమాయకంగా అంటుంది.అప్పుడు విష్ణు అలాగేం లేదు సారీ అని మల్లికని బుజ్జగిస్తాడు. అప్పుడు మల్లికా ఈ అమాయకపు అమ్మాయి నాటకం బాగుందే అని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో అఖిల్, జెస్సీ వాళ్ళ గదిలోకి వెళ్తారు. అప్పుడు అఖిల్, జెస్సీ కోపంగా ఉన్నట్టుంది మనం మాట్లాడదాము అని జెస్సి దగ్గరికి వెళ్లి, మన పెళ్లయిపోయింది కదా నీకు సంతోషమేనా అని అనగా జెస్సి కోపంతో,నాతో మాట్లాడొద్దు అఖిల్.
 

88

చిన్నప్పుడు నుంచి మా అమ్మ నాన్నలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు అలాంటిది నాకు కడుపు అని తెలిసిన వెంటనే వాళ్లు నన్ను చూసిన చూపులను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి సమయంలో నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకుంటే నువ్వు అబార్షన్ చేసుకుంటావా లేదా అని నన్నే బెదిరించావు.నేను నిన్ను ఎంత ప్రేమించానో, ఎంతని అమ్మానో నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. అయినా సరే నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నీ మీద ప్రేమతో కాదు, నా బిడ్డ అనాధ కాకూడదు అని. ఈరోజు నుంచి బయట ప్రపంచానికి మాత్రమే మనం భార్యాభర్తలు.గది లోకి వచ్చిన తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు జాగ్రత్త అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved