MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Veturi: చిరంజీవి పాటపై వేటూరి బోల్డ్ స్టేట్ మెంట్..అనుకున్నది ఒక్కటి అయ్యిందొకటి

Veturi: చిరంజీవి పాటపై వేటూరి బోల్డ్ స్టేట్ మెంట్..అనుకున్నది ఒక్కటి అయ్యిందొకటి

Veturi: పాటల రచయిత వేటూరి గురించి తెలియని వారుండరు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది..'యమహానగరి కలకత్తా పురి' పాట. ఈ పాట ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. కానీ ఏదో ఒక అసంతృప్తి వేటూరికి. ఎందుకో తెలుసా? 

2 Min read
Author : Nandini Arava
| Updated : Jun 22 2026, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వేటూరి మైలురాయి 'యమహానగరి... కలకత్తాపురి'
Image Credit : Asianet News

వేటూరి మైలురాయి 'యమహానగరి... కలకత్తాపురి'

వేటూరి గారి పాటల్లో ప్రాసలు ఎంత సహజంగా వస్తాయో ఈ పాటలో కనిపిస్తుంది. 'యమహానగరి... కలకత్తాపురి' అనేది తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా, లలిత సంగీత శైలిలో, సాహిత్య పరంగా ఒక మైలురాయి లాంటి పాట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మణిశర్మ సంగీత దర్శకత్వంలో, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'చూడాలని వుంది' (1998) సినిమాలోనిది ఈ అద్భుతమైన పాట. ఈ పాటను మహాకవి, సాహితీ బ్రహ్మ వేటూరి సుందరరామ్మూర్తి రాయగా, హరిహరన్ పాడారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కలకత్తా నగరం వివరిస్తూ పాట
Image Credit : mee veturi/youtube

కలకత్తా నగరం వివరిస్తూ పాట

పాటంటే ఎప్పుడూ డ్యూయెట్లు రాసుకోవడం కాదు..ఒక్కొక్కసారి ప్రదేశాలు, హిస్టరీ గురించి రాయాల్సి వస్తుందని వేటూరి అనేవారు. అలాంటి సందర్భంలోనే చూడాలని వుంది సినిమాలో కలకత్తా నగరం వివరిస్తూ ఈ పాట రాశారు. రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీ నుంచి ఈ పాట తీసుకున్నారట. 

Related Articles

Related image1
Maa Inti Bangaram: సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఎందుకు చూడాలనేదానికి 5 కారణాలు
Related image2
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
36
బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా
Image Credit : mee veturi/youtube

బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా

యమహానగరి అనడానికి కారణం మహానగర్ అంటే కలకత్తాకు పేరు. ఇండియా మొత్తం మీద మహానగర్ అంటారు. సత్య జిత్ రే పేరుతో 1963లో బెంగాళీ సినిమా కూడా తీశారు. కలకత్తాను... బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అంటారు. యముడు నివసించే చోటులా ఉంటుందంట. అంత భయంకరమైన నేరాలు, ఘోరాలు జరిగేవి కాబట్టే...యమహానగరి అని రాయడం జరిగింది. 

ఇందులో కలకత్తా నగరం గొప్పదనం గురించే కాదు, అక్కడ జన్మించిన మహానుభావుల గురించి ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక పాట అని ఓ సందర్బంలో వేటూరి గారు అన్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి దేశభక్తి, కలకత్తా కళలు, సంప్రదాయాలు, పరిస్థితుల గురించి ఒకే ఒక్క పాటలో పొందుపరిచారు. 

46
హరిహరన్ చాలా కష్టపడ్డారట
Image Credit : mee veturi/youtube

హరిహరన్ చాలా కష్టపడ్డారట

ఈ పాట పాడటానికి హరిహరణ్ భయపడ్డారట. అందులో మెలికలు కలకత్తా నగరపు కిట కిటలో, ఒకరితో ఒకరికి ముఖపరిచేయములు దొరకని క్షణముల....లిరిక్స్ ను పాడలేకపోయారంట. అందుకోసం రాత్రంబవళ్లు కష్టపడ్డారట. ఏన్నో టేక్ లు తీసుకున్నారట. అయినా హరిహరణ్ గెలిచారని వేటూరి అన్నారు. ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారట.

56
manisharma
Image Credit : mee veturi/youtube

manisharma

ఈ పాట అంత పెద్ద హిట్ కావడానికి మణిశర్మ అందించిన వెస్ట్రన్, ఇండియన్ క్లాసికల్ మిక్స్ చేసిన ట్యూన్ ఒక కారణమైతే, హరిహరణ్ మరో ప్రధాన కారణం. వెస్ట్రన్ బీట్స్‌తో అంతటి క్లాసికల్ ట్యూన్‌ను నడిపించడం మణిశర్మ మార్కు కంపోజిషన్‌కు నిదర్శనం. ఈ సినిమా మణిశర్మ కెరీర్‌లోనే అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన ఆల్బమ్. టాప్ మ్యూజిక్ డైరక్టర్ల రేసులో నిలబెట్టింది. అంతేకాకుండా 1998 ఏడాదికి నంది, ఫిలింఫేర్ అవార్డులు తెచ్చిపెట్టింది. 

66
అదే వేటూరి అసంతృప్తి, బాధ
Image Credit : mee veturi/youtube

అదే వేటూరి అసంతృప్తి, బాధ

ఈ పాట విన్నాక చాలా మంది తెలుగువారు ఏమన్నారంటే...బెంగాళీ వాళ్లకి ఇచ్చిన జాతీయగీతం అన్నారు. కానీ ఈ పాట బెంగాళీ వాళ్ల వరకు చేరలేదు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. ఇప్పటివరకూ ఆయన గురించి కూడా బెంగాళీ ప్రజలకు తెలియదు. దానికి కారణం తెలుగువాళ్లే. అందుకే అంత గుర్తింపు రాలేదని ఓ సందర్భంలో వేటూరిగారే స్వయంగా అన్నారు. అదే వేటూరి బాధ, అసంతృప్తి. అంత అద్భుతమైన ఈ పాటను మీరు వినేయండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Celebs: స్మోకింగ్, డ్రింకింగ్ మానేసిన స్టార్లు.. అది నాకు పునర్జన్మ అని చెప్పిన క్రేజీ హీరో
Recommended image2
Lenin Movie: కొడుక్కి ఎట్టకేలకు ఒక్క హిట్టు, ఏడ్చేసిన నాగార్జున.. తండ్రి కాళ్లపై పడి అఖిల్ భావోద్వేగం
Recommended image3
Real Names: పేరు మార్చుకున్నాకే స్టార్ డమ్ అందుకున్న సెలెబ్రిటీలు, వీళ్ళ అసలు పేర్లు తెలిస్తే నమ్మలేరు
Related Stories
Recommended image1
Maa Inti Bangaram: సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఎందుకు చూడాలనేదానికి 5 కారణాలు
Recommended image2
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved