- Home
- Entertainment
- Intinti Gruhalashmi: గాయిత్రికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అంకిత.. కొడుకును మోసం చేస్తున్న నందు!
Intinti Gruhalashmi: గాయిత్రికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అంకిత.. కొడుకును మోసం చేస్తున్న నందు!
Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత (Ankitha) తులసి ను వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక గాయత్రి (Gayathri) తులసితో వెటకారం గా మాట్లాడుతుంది. అంతేకాకుండా నానారకాలుగా గాయత్రి తులసి విషయంలో ఎత్తిపొడుపు మాటలు అంటుంది. ఇక అంకిత వంకరగా మాట్లాడకుండా తిన్నగా మాట్లాడలేవా అని తన తల్లి పై విరుచుకు పడుతుంది.
ఇక అంకిత తండ్రి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ అమ్మా అని తులసి (Tulasi) ను అడగగా.. దారిన పోయే నలుగురిని పోగేసుకొని వచ్చీరాని సంగీతం నేర్పిస్తుంది అని గాయత్రి (Gayathri) తులసిని ఇన్సల్ట్ చేస్తుంది. ఇక అంకిత ఆంటీ తన సంసారం తాను మోస్తుంది అంతే కానీ సిగ్గు పడే పని చేయడం లేదు అని అంటుంది.
మరోవైపు ప్రేమ్ (Prem) కి తన ఓనర్ అవసరానికి గాను మళ్లీ జాబ్ లోకి తిరిగి చేర్చుకుంటాడు. ఒకవైపు శృతి (Shruthi) వాళ్ళ ఓనర్ స్టూడియో లో ఉన్న తన భర్తకి లంచ్ తీసుకొని వెళ్ళమని శృతి కి చెబుతుంది. ఇక ప్రేమ్ శృతి కి కాల్ చేసి నన్ను జాబులో మళ్లీ జాయినింగ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు స్టూడియో లోనే ఉన్నాను అని అంటాడు. దాంతో శ్రుతి టెన్షన్ పడుతుంది.
మరోవైపు తులసి (Tulasi) ఫ్యామిలీ.. చాలా లేట్ అయింది ఎక్కడికి వెళ్లావు అని అడుగుతారు. వచ్చేటప్పుడు అభి (Abhi) దగ్గరకు వెళ్లాను అని చెబుతుంది. ఇక వాడు నిన్ను పట్టించుకోకుండా నువ్వెందుకు వెళ్లావు అని ఆడుతారు. దానితో తులసి నన్ను అభి బాగా రిసీవ్ చేసుకున్నాడు అని లేని పోని అని అబద్ధాలు చెబుతుంది.
ఇక పరంధామయ్య (Parandamaiah) నా గురించి ఏమన్నా అడిగాడ అమ్మ అని అడుగుతాడు. నేనున్న కాసేపట్లో సగం సేపు మీ గురించి అడిగాడు అని తులసి (Tulasi) అబద్ధం చెబుతుంది. ఇక దివ్య పెద్ద అన్నయ్య ఇంత మారిపోయాడు అంటే ఎందుకో నాకు నమ్మాలి అనిపించడం లేదు అని అంటుంది. ఈలోపు అవును అంటూ అక్కడి అంకిత వస్తుంది. ఇక అంకిత తులసి కి జరిగిన అవమానాలు అన్నీ వాళ్లకు చెబుతుంది.
ఇక నందు అభి (Abhi) కి కాల్ చేసి నాకు నిన్ను చూడాలని ఉంది. మీ అమ్మ.. నీ ఎదుగుదలను నేను దగ్గరుండి చూసే అదృష్టం నాకు లేకుండా చేసింది అని మరో స్థాయిలో పర్ఫామెన్స్ చేస్తాడు. ఇక పక్కనే ఉన్న లాస్య (Lasya) బాగా చేసావ్ అంటూ ఎంతో ఆనంద పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.